- Home
- Business
- SUV: జీఎస్టీ తగ్గింపు తర్వాత.. దేశంలో అత్యంత చౌకైన సన్‌రూఫ్ కారు ఇదే. ఎంత తగ్గిందంటే?
SUV: జీఎస్టీ తగ్గింపు తర్వాత.. దేశంలో అత్యంత చౌకైన సన్‌రూఫ్ కారు ఇదే. ఎంత తగ్గిందంటే?
SUV: జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన తర్వాత పలు రకాల వస్తువుల ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. వీటిలో కార్లు కూడా ఉన్నాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత దేశంలో అత్యంత తక్కువ ధరకు లభిస్తోన్న సన్‌రూఫ్ కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఎక్స్టర్‌పై భారీగా తగ్గింపు
జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చిన తరువాత Hyundai Exter S Smart ఇప్పుడు దేశంలోనే అతి తక్కువ ధరలో లభించే సన్‌రూఫ్ SUVగా మారింది. తక్కువ ధరతో పాటు మైలేజ్, ఫీచర్లు, భద్రత కలిపిన మోడల్‌గా ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
కొత్త ధర – బడ్జెట్ ఫ్రెండ్లీ SUV
జీఎస్టీ తగ్గింపు తరువాత Hyundai Exter S Smart ధర ఇప్పుడు ₹7.03 లక్షలు (ఎక్స్‌షోరూం) మాత్రమే. ఎక్స్టర్ బేస్ మోడల్ ధర రూ. 5.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక సన్‌రూఫ్ ఉన్న S Smart వేరియంట్ బడ్జెట్‌కి మరింత దగ్గరైంది. ఈ మైక్రో SUV ప్రధానంగా టాటా పంచ్ కారుతో పోటీ పడుతుంది.
ఇంజిన్ & మైలేజ్
హ్యుందాయ్ ఎక్స్టర్ S Smartలో 1.2 లీటర్ల Kappa పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 81.8 బీహెచ్‌పి పవర్, 113.8 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. మాన్యువల్, AMT గేర్‌బాక్స్ రెండింటిలోనూ లభిస్తుంది.
పెట్రోల్ వేరియంట్ మైలేజ్ – 19.4 కి.మీ/లీటర్
CNG వేరియంట్ మైలేజ్ – 27.1 కి.మీ/కిలో
ఇందువల్ల ఇది ఫ్యూయల్ ఎఫిషియన్సీ పరంగా కూడా ఆకర్షణీయమైన ఎంపికగా చెప్పొచ్చు.
ఫీచర్లు & సౌకర్యాలు
ఈ SUVని ప్రత్యేకంగా నిలిపేది దీని ఫీచర్లే అని చెప్పాలి.
* వాయిస్ ఎనేబుల్డ్ సన్‌రూఫ్ (ఈ ధరలో అరుదు)
* డ్యుయల్ డాష్‌క్యామ్ (ఫ్రంట్, రియర్)
* 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ (Android Auto, Apple CarPlay సపోర్ట్)
* 6 ఎయిర్‌బ్యాగ్స్, ESC, హిల్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్
ఈ సదుపాయాల వల్ల ఇది చౌకైన SUV అయినా ప్రీమియం టచ్ ఇస్తోంది.
ఏయో కార్లకు పోటీనిస్తుందంటే.?
ఈ కారు టాటా పంచ్, మారుతి సుజుకి చెందిన Fronx, ఇగ్నిస్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, క్రిటాన్ సీ3, హ్యుండాయ్ వెన్యూ (బేస్ మోడల్) వంటి వాటికి పోటీనిస్తుంది. అయితే సన్‌రూఫ్‌తో పాటు అధునాతన ఫీచర్లు కలయికతో Exter S Smart మరింత విలువైన SUVగా గుర్తింపు పొందుతోంది.
ఇతర మోడల్స్‌పై జీఎస్టీ ప్రభావం ఎంతుంది.?
* జీఎస్టీ తగ్గింపు తర్వా టాటా పంచ్ ధర రూ. 6.19 లక్షల నుంచి రూ. 5.49 లక్షలకు తగ్గింది. వినియోగదారులకు రూ. 70,000 నుంచి రూ. 85,000 వరకు లాభం.
* ఇక Maruti Suzuki Fronx అన్ని వేరియంట్లలో 9.2% – 9.4% ధర తగ్గింది. టాప్ మోడల్‌లో రూ. 1.11 లక్షలు వరకు తగ్గింపు లభిస్తోంది.