MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్‌పై ఏప్రిల్ 1 నుంచి కేంద్రం నిఘా! ఈ తప్పులు చేసేవాళ్లని పట్టుకోడానికే..

వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్‌పై ఏప్రిల్ 1 నుంచి కేంద్రం నిఘా! ఈ తప్పులు చేసేవాళ్లని పట్టుకోడానికే..

Tax Rules: డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి దేశానికి నష్టం కలిగించే పనులు చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఏప్రిల్ 1 నుంచి వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై అధికారులు నిఘా పెట్టనున్నారు. అందుకే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Mar 29 2025, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఏప్రిల్ 1, 2025 నుండి భారతీయ పన్ను అధికారులు వాట్సాప్, టెలిగ్రామ్, ఇ-మెయిల్‌ల వంటి కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. ఈ మేరకు ఇటీవల లోక్‌సభలో ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఆమోదించారు. ఈ చర్య పన్ను అమలు ప్రక్రియ బలోపేతం అవుతుంది. లెక్కల్లో చూపని డబ్బు, ఆర్థిక అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది. 

24

ప్రభుత్వం ఈ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టింది?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 27న లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ప్రవేశపెట్టడం వెనుక ఉన్న కారణాలు వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ క్రిప్టోకరెన్సీలతో సహా వర్చువల్ ఆస్తులను సరిగ్గా లెక్కించేలా చూసుకోవడానికి ఈ బిల్లు రూపొందించామని సీతారామన్ అన్నారు. ఇప్పటి వరకు ఆదాయానికి సంబంధించిన ఆధారాలు డిజిటల్ ఫార్మేట్ లో ఎక్కువగా లేవని, ఉన్నవాటిని కూడా అధికారులు పరిశీలించడానికి అధికారం లేదని అన్నారు. ఈ బిల్లుతో డిజిటల్ ఆధారాలను యాక్సెస్ చేసే అధికారం లభిస్తుందని తెలిపారు. 

 
34

లెక్కల్లో లేని రూ.250 కోట్ల డబ్బును గుర్తించాం: సీతారామన్

లోక్ సభలో సీతారామన్ మాట్లాడుతూ లెక్కల్లో లేని డబ్బును బహిర్గతం చేయడంలో డిజిటల్ ఆధారాలు సహాయపడిన అనేక సందర్భాలను ఆమె ఉదాహరణలతో సహా చెప్పారు. మొబైల్ ఫోన్లలోని ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌ల ద్వారా లెక్కల్లో లేని రూ.250 కోట్ల డబ్బును గుర్తించామని సీతారామన్ తెలిపారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు సంబంధించిన రూ.200 కోట్ల అప్రకటిత ఆస్తులను గుర్తించడంలో వాట్సాప్ సందేశాలు మాత్రమే కీలక పాత్ర పోషించాయన్నారు. ఇలాంటి పన్ను ఎగవేతలను మరింత సమర్థవంతంగా గుర్తించడానికి అధికారులకు చట్టపరమైన అధికారులు కల్పిస్తూ కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025ను ప్రవేశపెట్టామని తెలిపారు. 

44

కొత్త బిల్లు ప్రకారం అధికారులు ఏమి యాక్సెస్ చేయవచ్చు?

కొత్త పన్ను బిల్లు ఆదాయపు పన్ను అధికారులకు విస్తృతమైన డిజిటల్ యాక్సెస్‌ను అందిస్తుంది. అధికారులు వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కమ్యూనికేషన్‌లను పరిశీలించగలరు.

క్రిప్టోకరెన్సీలు, డిజిటల్ టోకెన్లు, వర్చువల్ డిజిటల్ ఆస్తులను చెక్ చేయగలరు. ఈ-మెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ పెట్టుబడి, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆస్తి యాజమాన్య వివరాలను నిల్వ చేసే వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసే హక్కును ఆదాయపు పన్ను అధికారులు కలిగి ఉంటారు.

అంతేకాకుండా ట్యాక్స్ వెరిఫికేషన్ చేసే సమయంలో యాక్సెస్ కోడ్‌లు, ఎన్‌క్రిప్షన్ మెసేజ్ లను కూడా వారు చూసేందుకు అధికారం కలిగి ఉంటారు. 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved