Gold Price: వెండిలో పెట్టుబడితే మీ పంట పండినట్లే, ఎందుకో తెలుసా? బంగారం కంటే బెటర్..
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. సామాన్యుడు బంగారం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, రూపాయి విలువ తగ్గడం ఇలా బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టడం మంచిదేనా.? అసలు నిపుణులు ఏం చెబుతున్నారు తెలుసుకుందాం..

ఇంట్లో బంగారం ఉందంటే అదొక ధీమా అని భావించే వారు మనలో చాలా మంది ఉంటారు. అందుకే బంగారం ధర ఎంత పెరిగిన కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే వెండి సైతం బంగారం బాటలోనే సాగుతోంది. ఇప్పటికే కిలో వెండి ధర రూ. లక్షకు చేరువైంది. అయితే భవిష్యత్తుల్లో బంగారంతో పోటీపడి మరీ వెండి ధరలు పెరగడం ఖాయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకే పెట్టుబడి పెట్టే వారికి బంగారం కంటే వెండి బెస్ట్ ఆప్షన్‌గా చెబుతున్నారు. వెండికి డిమాండ్ పెరుగుతుందని చెప్పడానికి నిపుణులు ఏ కారణాలు చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం..

వెండి ధర పెరగడానికి కారణాలు.?
ప్రస్తుతం ప్రపంచదేశాలు గ్రీన్ ఎనర్జీపై దృష్టిసారిస్తున్నాయి. ముఖ్యంగా సౌర విద్యుత్ ఉపయోగం పెరుగుతుంది. అదే విధంగా ఎలక్ట్రానిక్ వెహికిల్స్ వాడకం ఎక్కువుతోంది. ఈ కారణంగానే వెండికి డిమాండ్ పెరగనుంది. గ్రీన్ ఎనర్జీకి వెండికి సంబంధం ఏంటనేగా మీ డౌట్. సోలార్ ప్యానెల్స్, సోలార్ సెల్స్ తయారీలో వెండిని ఉపయోగిస్తారు. అదే విధంగా వెండి-జింక్, వెండి-ఆక్సైడ్ బ్యాటరీలు అధిక సామర్థ్యంతో పనిచేస్తాయి. వీటితో పాటు టచ్ స్క్రీన్స్, ప్రింటెడ్ సర్క్యూట్స్, సెన్సార్లు, మైక్రోచిప్స్ వంటి వాటిలో కూడా వెండిని విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఇక వెండిని మెడికల్ పరికరాల తయారీలో కూడా పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. దీనికి కారణం వెండిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు నీటిని శుద్ధి చేసే ఫిల్టర్లలో కూడా వెండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలే దీనికి కారణంగా చెప్పొచ్చు. అలాగే న్యూక్లియర్ రియాక్టర్లలో కూడా వెండి ఉపయోగిస్తుంటారు.
ఇక ఆస్ట్రోనాట్స్ ఉపయోగించే సూట్స్ తయారీలో కూడా వెండిని విరివిగా వాడుతున్నారు. వెండి అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. అధునాతన రోబోటిక్ పరిరకరాల్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఉపయోగించే సర్క్క్యూట్స్‌లో కూడా వెండిని ఉపయోగిస్తున్నారు. ఇలా ఇన్ని రంగాల్లో ఉపయోగిస్తున్నారు కాబట్టే భవిష్యత్తులో వెండికి డిమాండ్ పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.