MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • Gold Price Crash: ఎటూ తేలని యుద్ధం.. బంగారం మార్కెట్ పతనం..భారీగా పడిపోయిన పసిడి, సిల్వర్

Gold Price Crash: ఎటూ తేలని యుద్ధం.. బంగారం మార్కెట్ పతనం..భారీగా పడిపోయిన పసిడి, సిల్వర్

Gold Price Crash: ఇన్నాళ్లూ పరుగులు పెట్టిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. మూడు రోజుల వరుస పెరుగుదల తర్వాత పసిడి రేట్లు దిగొచ్చాయి. వెండి కూడా తగ్గింది.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 14 2026, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మార్కెట్లు పతనం..భారీగా దిగొచ్చిన పసిడి, సిల్వర్
Image Credit : chatgpt

మార్కెట్లు పతనం..భారీగా దిగొచ్చిన పసిడి, సిల్వర్

బంగారం కొనాలనుకునే వారికి ఎట్టకేలకు కాస్త ఊరటనిచ్చే వార్త వచ్చింది. వరుసగా పెరుగుతూ ఆల్‌టైమ్ గరిష్ఠాలకు చేరువైన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కూల్ అయ్యాయి. దేశీయ మార్కెట్లో బంగారం రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా పసిడి ధరపై ప్రభావం చూపించాయి.

గత మూడు రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు భారీగా లాభాలను ఆర్జించారు. అయితే అమెరికా ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదవడంతో మార్కెట్‌లో కీలక మార్పులు కనిపించాయి. మరోవైపు డాలర్ విలువ బలపడటంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించేందుకు బంగారాన్ని విక్రయించారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు దిగొచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇదే ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా పడింది.
Image Credit : Getty

ఇదే ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా పడింది.

హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో ఆగస్టు 13 సాయంత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,260 తగ్గి రూ.1,53,600కు చేరింది. 22 క్యారెట్ల బంగారం కూడా రూ.1,150 తగ్గి రూ.1,40,800 వద్దకు వచ్చింది. అయితే తగ్గుదల ఇక్కడితో ఆగలేదు. ఇవాళ ఉదయం మరోసారి పసిడి రేట్లు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.710 తగ్గడంతో రూ.1,52,890కి చేరింది. 22 క్యారెట్ల ధర కూడా రూ.650 తగ్గి రూ.1,40,150 వద్ద స్థిరపడింది. వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ.5,000 తగ్గింది. దీంతో కిలో వెండి ప్రస్తుతం రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది.

Related Articles

Related image1
Gold price Hike: గోల్డ్ మార్కెట్‌లో కలకలం.. రికార్డు స్థాయికి చేరిన ధరలు!
Related image2
Gold Price Hike: నిన్న రూ.3 వేలు.. ఇవాళ మరో రూ.వెయ్యి...సామాన్యులపై బంగారం బాదుడు
34
ఎటూ తేలని యుద్ధం
Image Credit : X

ఎటూ తేలని యుద్ధం

ఇక అంతర్జాతీయ పరిణామాలు కూడా బంగారం ధరలకు కీలకంగా మారాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల పరిస్థితి, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న విభేదాలు, హార్ముజ్ జలసంధిపై నెలకొన్న టెన్షన్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు మళ్లీ తీవ్రం కావడంతో క్రూడ్ ఆయిల్ ధరల్లో కూడా కదలికలు కనిపిస్తున్నాయి. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో మార్కెట్లలో అనిశ్చితి మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. కాల్పుల విరమణపై ప్రకటనలు వచ్చినప్పటికీ పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీంతో పశ్చిమాసియా పరిణామాలను ప్రపంచ మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి.

44
స్టాక్ మార్కెట్లు కుదేల్
Image Credit : our own

స్టాక్ మార్కెట్లు కుదేల్

ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పైనా కనిపిస్తోంది. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ సుమారు 300 పాయింట్ల వరకు నష్టపోగా, నిఫ్టీ కూడా దాదాపు 100 పాయింట్లు దిగజారింది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు 87 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా ఒత్తిడిలోనే ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
భారత దేశం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Related Stories
Recommended image1
Gold price Hike: గోల్డ్ మార్కెట్‌లో కలకలం.. రికార్డు స్థాయికి చేరిన ధరలు!
Recommended image2
Gold Price Hike: నిన్న రూ.3 వేలు.. ఇవాళ మరో రూ.వెయ్యి...సామాన్యులపై బంగారం బాదుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved