MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధరలు

Gold Price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధరలు

Gold Price Fall: పసిడి ప్రియులకు కాస్త ఊరట దొరికింది. ఇవాళ స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. గత రెండు రోజులుగా వరుసగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఈరోజు స్వల్పంగా తగ్గాయి. అసలు బంగారం ధరలు రోజుకోలా ఎందుకు మారుతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 04 2026, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధరలు
Image Credit : Getty

స్వల్పంగా దిగొచ్చిన బంగారం ధరలు

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన తర్వాత ఈరోజు మార్కెట్‌లో మార్పు కనిపించింది.. ధరలు తగ్గినప్పటికీ, గత వారం నమోదైన భారీ పెరుగుదలతో పోలిస్తే ఈ తగ్గుదల చాలా తక్కువగానే ఉండటంతో కొనుగోలుదారులకు పెద్దగా ఉపశమనం లభించలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావం
Image Credit : our own

ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావం

బంగారం ధరలు ప్రతిరోజూ మారడానికి ఎన్నో అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ బలహీనత లేదా బలపడటం, అంతర్జాతీయంగా బంగారంపై పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితులు లేదా ఆర్థిక అనిశ్చితి పెరిగితే.. పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు కూడా ఎగబాకుతాయి.

Related Articles

Related image1
Gold Price Hike: అందుకే మోదీ బంగారం కొనద్దు అన్నది....రూ.7వేలు పెరిగి కొంపముంచిన పసిడి
Related image2
Gold Price Hike: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు కొంటే మీ జేబుకు చిల్లే
34
ఇవాళ మారిన పరిస్థితి
Image Credit : Google

ఇవాళ మారిన పరిస్థితి

అయితే ఇవాళ పరిస్థితి కొంత మారింది. కొందరు పెట్టుబడిదారులు ఇప్పటికే వచ్చిన లాభాలను బుక్ చేసుకోవడం, అమెరికా డాలర్ స్వల్పంగా బలపడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. దాని ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా కనిపించింది. ఈరోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.1,46,730కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 తగ్గి 10 గ్రాములకు రూ.1,34,500గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములకు రూ.200 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,10,050గా ఉంది.

44
అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి
Image Credit : Getty

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి

బులియన్ మార్కెట్‌లో ప్రకటించే ధరలే తుది ధరలు కావు. నగల దుకాణాల్లో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ వంటి అదనపు ఖర్చులు కలుస్తాయి. కాబట్టి ప్రాంతం మారేకొద్దీ ధరలు మారే అవకాశం ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద స్థిరంగా ఉంది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయనేది అంతర్జాతీయ పరిస్థితుల బట్టి ఉంటుంది. ప్రతిరోజూ ధరలను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Amazon Prime Day Sale : రూ.108510 ల్యాప్‌టాప్ కేవలం రూ.65990 కే.. ఏకంగా 42 వేల తగ్గింపా..!
Recommended image2
RBI: ఇంత వ‌డ్డీ మ‌రే ప్ర‌భుత్వ ప‌థ‌కంలో దొర‌క‌దు.. పెట్టుబ‌డిదారుల‌కు ఇది వ‌ర‌మ‌నే చెప్పాలి
Recommended image3
Post Office Scheme: పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే రూ. 5 లక్షల వరకు లాభం
Related Stories
Recommended image1
Gold Price Hike: అందుకే మోదీ బంగారం కొనద్దు అన్నది....రూ.7వేలు పెరిగి కొంపముంచిన పసిడి
Recommended image2
Gold Price Hike: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు కొంటే మీ జేబుకు చిల్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved