MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Today: బంగారం ధరలు మళ్లీ తగ్గాయ్.. తులం రూ.లక్షకు చేరుతుందా?

Gold Price Today: బంగారం ధరలు మళ్లీ తగ్గాయ్.. తులం రూ.లక్షకు చేరుతుందా?

Gold Price Today: బంగారం కొనాలనుకునేవాళ్లకు గుడ్ న్యూస్ వచ్చింది. మొన్నటివరకు ఆకాశాన్నంటిన పసిడి.. ఇప్పుడు క్రమంగా దిగొస్తొంది. దీంతో కొనుగోలుదారుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. మరి హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ బంగారం ధరలు ఎంత ఉన్నాయి?

2 Min read
Author : Nandini Arava
Published : Oct 15 2026, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ధరలు తగ్గడానికి కారణాలేంటి?
Image Credit : our own

పసిడి ధరలు తగ్గడానికి కారణాలేంటి?

బంగారం కొనాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారా? అయితే తాజా ధరలు మీకు కొంత ఊరటనివ్వొచ్చు. కొన్నాళ్లుగా భారీ ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తులో కనిపించిన పసిడి.. ఇప్పుడు క్రమంగా దిగొస్తోంది. తాజాగా మరోసారి బంగారం ధరలు తగ్గాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ.820 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.750 తగ్గుదల నమోదైంది. ధరలు తగ్గుతున్న తీరు చూస్తుంటే ఇప్పుడే కొనాలా? మరికొంతకాలం వేచి చూడాలా? అనే సందేహం చాలామందిలో మొదలైంది. మరి నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయి? వెండి రేటు సంగతేంటి? పసిడి ధరలు తగ్గడానికి కారణాలేంటి? తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,47,440 కు చేరిన పసిడి
Image Credit : AI Meta

రూ.1,47,440 కు చేరిన పసిడి

ముందుగా హైదరాబాద్‌లో బంగారం ధరలను చూద్దాం. స్వచ్ఛమైన బంగారం కొనాలనుకునేవారికి సంబంధించిన 24 క్యారెట్ల పసిడి ధర పది గ్రాములపై రూ.820 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,47,440 వద్ద కొనసాగుతోంది. నగలు తయారు చేయడానికి సాధారణంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. పది గ్రాములపై రూ.750 దిగొచ్చింది. దీంతో ప్రస్తుతం తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,150గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. పది గ్రాములపై రూ.610 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం ధర రూ.1,10,580 వద్ద నమోదైంది.

హైదరాబాద్‌లో నమోదైన ఈ ధరలు విజయవాడ, విశాఖపట్నం వంటి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే స్థానిక వ్యాపారులు, జువెలరీ షాపులను బట్టి స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు.

ఇక బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద ఉంది. అంటే బంగారం కొనుగోలు చేసేవారికి కొంత ఉపశమనం లభించినా.. వెండి ధరలో మాత్రం కొత్తగా తగ్గుదల కనిపించడం లేదు.

34
మరి అసలు బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
Image Credit : Getty

మరి అసలు బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు చాలా కీలకం. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ, వడ్డీ రేట్లపై అంచనాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల ధోరణి పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. డాలర్ బలపడినప్పుడు ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు బంగారం ఖరీదైనదిగా మారే అవకాశం ఉంటుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడికి డిమాండ్‌పై ప్రభావం పడవచ్చు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, భవిష్యత్తులో రేట్లు ఎలా ఉండొచ్చన్న అంచనాలు కూడా బంగారం ధరల కదలికలకు కారణమవుతాయి.

సాధారణంగా బంగారం నుంచి వడ్డీ ఆదాయం రాదు. అందుకే వడ్డీ రేట్లపై అంచనాలు మారినప్పుడు పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులను పెంచడం లేదా తగ్గించడం చేస్తుంటారు. అంతర్జాతీయంగా నెలకొనే ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడుల ప్రవాహం కూడా పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే ధరలు తగ్గుతున్నాయనే కారణంతో బంగారం ఇంకా తప్పకుండా తగ్గుతుందని భావించకూడదు. మార్కెట్ పరిస్థితులు మారితే ధరలు మళ్లీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

44
మరి బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? తులం బంగారం ధర రూ.లక్షకు చేరుతుందా?
Image Credit : Asianet News

మరి బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? తులం బంగారం ధర రూ.లక్షకు చేరుతుందా?

ఇదే ఇప్పుడు కొనుగోలుదారుల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ప్రస్తుత ధరల తగ్గుదల కొనసాగితే మరింత ఊరట లభించవచ్చని కొందరు ఆశిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఎప్పుడు ఎంత తగ్గుతాయో కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అంతర్జాతీయ మార్కెట్, డాలర్ విలువ, వడ్డీ రేట్ల అంచనాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు వంటి అంశాలపై ధరలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల తులం బంగారం ధర త్వరలోనే రూ.లక్షకు చేరుతుందని ఇప్పుడే నిర్ణయించలేం. భారీ తగ్గుదల కొనసాగాలంటే అంతర్జాతీయ మార్కెట్‌లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకోవాల్సి ఉంటుంది.

ఇక బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు మరో విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. పది గ్రాముల ధర తగ్గిందని చూసి అదే మొత్తం నగల షాపులో చెల్లించాల్సి వస్తుందని అనుకోకండి. ఆభరణాల ధరకు మేకింగ్ ఛార్జీలు, వర్తించే జీఎస్టీ, ఇతర ఛార్జీలు అదనంగా చేరవచ్చు. కాబట్టి నగలు కొనుగోలు చేసే ముందు తుది బిల్లును పరిశీలించాలి. హాల్‌మార్క్, స్వచ్ఛత వివరాలను కూడా నిర్ధారించుకోవాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
EPFO New Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 4 బిగ్ సూపర్ అప్‌డేట్స్ వస్తున్నాయి !
Recommended image2
Chicken Prices: చికెన్, గుడ్ల ధరలకు రెక్కలు.. కిలోకు రూ. 50, గుడ్డుపై రూ. 4 పెరిగే ఛాన్స్.. కారణమేంటి?
Recommended image3
Gold price Today: ఇవాళ మళ్లీ పెరిగిన బంగారం...గ్రాము మీద ఎంత పెరిగిందో తెలుసా?
Related Stories
Recommended image1
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Recommended image2
Gold Price Hike: పండుగల వేళ పసిడి ధరల పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved