MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: పండగ వేళ పసిడి షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

Gold Price Hike: పండగ వేళ పసిడి షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

Gold Price Hike: పండగ వేళ పసిడి కొనాలనుకుంటున్నారా? dహైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తులంపై రూ.380 వరకు పెరుగుదల నమోదైంది. మరి 22 క్యారెట్ల బంగారం ధర ఎంత? వెండి రేటులో ఏమైనా మార్పు వచ్చిందా?

1 Min read
Author : Nandini Arava
Published : Oct 19 2026, 11:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పసిడి ప్రియులకు మళ్లీ షాక్
Image Credit : Asianet News

పసిడి ప్రియులకు మళ్లీ షాక్

పండగల సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు మరోసారి షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు పైకి కదిలాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై రూ.380 పెరగడంతో ధర రూ.1,48,040కు చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాములపై రూ.350 పెరగడంతో ప్రస్తుతం రూ.1,35,700 వద్ద కొనసాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అన్నీ తనిఖీ చేయాలి
Image Credit : Asianet News

అన్నీ తనిఖీ చేయాలి

పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం నగలు కొనాలనుకునేవారు ఈ ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. బంగారం ధరలో స్వల్ప మార్పు కనిపించినా, ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేటప్పుడు ఆ ప్రభావం ఖర్చుపై పడుతుంది. అందుకే నగలు కొనేముందు ఆరోజు మార్కెట్ రేటును తెలుసుకోవడంతో పాటు, 22 క్యారెట్లా, 24 క్యారెట్లా అనేది స్పష్టంగా పరిశీలించాలి. ఆభరణాల విషయంలో స్వచ్ఛతతో పాటు హాల్‌మార్క్ వివరాలను కూడా తనిఖీ చేయాలి.

33
యథాతథంగానే వెండి
Image Credit : iSTOCK

యథాతథంగానే వెండి

మరోవైపు వెండి కొనుగోలు చేసేవారికి మాత్రం ధరల్లో ఊరట కనిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి రూ.2,40,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి రేటు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. అయితే కొనుగోలుదారులు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఉంది. మార్కెట్లో ప్రకటించే బంగారం, వెండి ధరలకు అదనంగా పన్నులు వర్తిస్తాయి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు 3 శాతం జీఎస్టీతో పాటు తయారీ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. నగల డిజైన్‌ను బట్టి ఈ తయారీ ఛార్జీలు మారవచ్చు. అలాగే నగరం, స్థానిక మార్కెట్ పరిస్థితులను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. అందుకే పండగ వేళ పసిడి కొనాలనుకునేవారు ఒకటి కంటే ఎక్కువ దుకాణాల్లో ధరలు, తయారీ ఛార్జీలు పోల్చి చూసిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ న్యూస్.. జీతాల పెంపు, డిఏ విలీనంపై 5 కీలక డిమాండ్లు
Recommended image2
Top 10 Countries With Most Billionaires: అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే, భారత్ స్థానం ఎంతంటే?
Recommended image3
Gold Price Hike: పసిడి ప్రియులకు మరో షాక్...తగ్గుతూ ఒక్కసారిగా బాంబ్ పేల్చిన బంగారం
Related Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు మరో షాక్...తగ్గుతూ ఒక్కసారిగా బాంబ్ పేల్చిన బంగారం
Recommended image2
Today Gold Price: పసిడి ధరల పతనం ఆగినట్టేనా? కొనుగోలుదారులకు ఊరట దక్కినట్లేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved