DA Hike: దీపావళి ముందే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతంలో భారీ జంప్ ఖాయం!
DA Hike 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం డీఏ పెంపుపై కేంద్ర కేబినెట్ భేటీలో త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. డీఏ 60% నుండి 63%కి పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో వేతనాల్లో భారీ జంప్ వుంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్కంఠ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జూలై 2026కి సంబంధించిన డీఆర్, డీఏ పెంపు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 60 శాతం డీఏను 63 శాతానికి పెంచే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై స్పష్టత వస్తుందని అందరూ భావిస్తున్నారు. దసరా పండుగ సమయంలో రావలసిన ఈ గుడ్ న్యూస్ కొద్దిగా ఆలస్యం కావడంతో, ఇప్పుడు అందరి చూపు కేబినెట్ భేటీ పైనే ఉంది.
డీఏ అంటే ఏమిటి? దాని లెక్కింపు ఎలా?
డెయిర్నెస్ అలవెన్స్ అనగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించడానికి ప్రభుత్వం అందించే జీతంలో ఒక భాగం. దీనిని బేసిక్ పే ఆధారంగా శాతాల రూపంలో లెక్కిస్తారు. ప్రస్తుతం ఇది 60 శాతంగా ఉంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే రూ.44,900 అయితే, ప్రస్తుత 60% లెక్కన రూ.26,940 వస్తోంది. ఒకవేళ డీఏ 3 శాతం పెరిగి 63 శాతానికి చేరితే, ఆ మొత్తం రూ.28,287కి పెరుగుతుంది. దీనివల్ల నెలకు రూ.1,347 అదనపు ప్రయోజనం లభిస్తుంది.
వివిధ బేసిక్ పే లెవల్స్‌పై జీతాల పెంపు అంచనా
ప్రభుత్వం 3 శాతం డీఏను పెంచితే వివిధ బేసిక్ పే ఉన్న ఉద్యోగులకు ఎంత లాభం వస్తుందనే దానిపై స్పష్టత ఉంది. రూ.18,000 బేసిక్ పే ఉన్న వారికి నెలకు రూ.540, రూ.25,000 బేసిక్ పే ఉన్న వారికి రూ.750, రూ.35,000 బేసిక్ పే ఉన్న వారికి రూ.1,050, రూ.50,000 బేసిక్ పే ఉన్న వారికి రూ.1,500 వరకు అదనంగా అందే అవకాశం ఉంది. ఈ పెంపు జూలై 1, 2026 నుంచి అమలులోకి వస్తే, అర్హులైన ఉద్యోగులకు ఎరియర్స్ కూడా అందే ఛాన్స్ ఉంది.
డీఏ రేటు నిర్ణయం వెనుక ఉన్న ప్రాతిపదిక
ఈ డీఏ పెంపునకు ప్రధాన ప్రాతిపదిక ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI-IW) 12 నెలల సగటు డేటా. లేబర్ బ్యూరో విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టు 2026లో ఈ ఇండెక్స్ 1.2 పాయింట్లు పెరిగి 154.4కి చేరుకుంది. ఈ ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగానే జూలై 2026కి సంబంధించి డీఏ 3 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది కేవలం అంచనా మాత్రమే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పెన్షనర్లకు కూడా వర్తించనున్న డీఆర్ ప్రయోజనం
ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా డియర్నెస్ రిలీఫ్ రూపంలో ఇదే వర్తింపు లభిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత పెరుగుతున్న జీవన వ్యయాలను ఎదుర్కొనేందుకు ఈ డీఆర్ వారికి ఎంతగానో సహాయపడుతుంది. ప్రభుత్వం 3 శాతం పెంచితే పెన్షనర్ల నెలవారీ పింఛనులో కూడా తగినంత పెరుగుదల కనిపిస్తుంది. అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు ఈ అంచనాలన్నీ కేవలం ప్రతిపాదనగానే ఉంటాయి.

