MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: హర్మూజ్ సంక్షోభం ప్రభావం..రూ.1.50 లక్షల దిశగా బంగారం ధరలు

Gold Price Hike: హర్మూజ్ సంక్షోభం ప్రభావం..రూ.1.50 లక్షల దిశగా బంగారం ధరలు

Gold Price Hike: దేశంలో బంగారం ధరలు మరోసారి ఎగబాకాయి. ఈ మధ్య కాలంలో మళ్లీ పసిడి రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదే కొనసాగితే రూ.లక్షా యాభైవేలు దాటే అవకాశం కనిపిస్తోంది.

1 Min read
Author : Nandini Arava
Published : Aug 05 2026, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు భారీ షాక్
Image Credit : chatgpt

పసిడి ప్రియులకు భారీ షాక్

దేశంలో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు ఇప్పుడు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలోని అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలను మరింత పైకి తీసుకెళ్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర త్వరలోనే రూ.1.50 లక్షల మార్క్‌ను చేరుకునే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,45,750కు చేరిన బంగారం
Image Credit : iSTOCK

రూ.1,45,750కు చేరిన బంగారం

ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,750 పెరిగి రూ.1,45,750కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,600 పెరిగి రూ.1,33,600 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, తిరువనంతపురం వంటి నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ధరలకు అదనంగా జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుందని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు కిలో వెండి ధర రూ.2.35 లక్షల వద్ద కొనసాగుతోంది.

34
అమెరికా-ఇరాన్ మధ్య  తీవ్రరూపం దాల్చిన ఘర్షణలు
Image Credit : chatgpt

అమెరికా-ఇరాన్ మధ్య తీవ్రరూపం దాల్చిన ఘర్షణలు

బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ తీవ్రరూపం దాల్చిన ఘర్షణలే. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరాన్‌లోని కీలక విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తుండగా, ఇరాన్ కూడా తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తోంది. దీంతో ప్రపంచ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.

44
భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం
Image Credit : iSTOCK

భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం

ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్, ఒమన్ వంటి దేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అయితే పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉండటంతో బంగారం ధరలు భవిష్యత్తులో కూడా అధిక స్థాయిలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Recommended image2
Amazon Flipkart Festive Sale : పండగ్ సేల్ లో భారీ డిస్కౌంట్లు చూసి కొనేస్తున్నారా? ఈ ట్రిక్స్ తో మనీ సేవ్ చేసుకోండి
Recommended image3
Gold Price Hike: పండుగల వేళ పసిడి ధరల పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
Related Stories
Recommended image1
Gold Price Fall: తగ్గిన బంగారం ధరలు.. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మళ్లీ పెరుగుతాయా?
Recommended image2
Gold Rate Today: చర్చలకు సిద్ధమైన అమెరికా-ఇరాన్..ఇవాళ స్థిరంగా బంగారం ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved