Gold Price Hike: బంగారం ధరలకు రెక్కలు.. 10 గ్రాములపై ఏకంగా రూ.1,040 పెరుగుదల
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఇవాళ్టి రేటు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఒక్కరోజులోనే 10 గ్రాములపై వెయ్యికి పైగా పెరుగుదల కనిపించింది. 24 క్యారెట్లతో పాటు 22 క్యారెట్లు కూడా భారీగా పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్‌లో పసిడి ఎంత పలుకుతోంది?

పసిడి ప్రియులకు భారీ షాక్
బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇవాళ్టి ధరలు కాస్త షాక్ ఇచ్చేలా ఉన్నాయి. వరుస మార్పులతో కనిపిస్తున్న పసిడి ధర మరోసారి భారీగా పెరిగింది. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధరలో వెయ్యి రూపాయలకు పైగా పెరుగుదల నమోదైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1,040 పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,280కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాములకు రూ.950 పెరగడంతో.. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,37,750గా ఉంది.
ఈ పెరుగుదల దేశీయ మార్కెట్‌కే పరిమితం కాలేదు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధర పైకి కదిలింది. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 4,182 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
కిలో వెండి ధర ఎంతంటే..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధర పెరిగినప్పటికీ సిల్వర్ రేట్ మాత్రం ఇవాళ స్థిరంగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.2,45,000గా కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద ఉంది. చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,45,000గా కొనసాగుతోంది.
ఢిల్లీలో ధరలు ఇలా ఉన్నాయి
దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,50,450గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.1,37,900గా ఉంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,280గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,750 వద్ద కొనసాగుతోంది.
ఛార్జీలు కూడా వర్తిస్తాయి
ఇవాళ బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపించగా, వెండి ధరలు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉన్నాయి. అయితే బంగారం కొనుగోలు చేసే సమయంలో మార్కెట్ రేటుతో పాటు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు కూడా వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి.

