MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Crash : ఈ దసరాకి గోల్డ్ కొనాలని రెడీ అవుతున్నారా? మళ్లీ దిగొచ్చిన బంగారం ధర

Gold Price Crash : ఈ దసరాకి గోల్డ్ కొనాలని రెడీ అవుతున్నారా? మళ్లీ దిగొచ్చిన బంగారం ధర

Gold Price Crash: దసరా పండుగకు ముందు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇవాళ్టి గోల్డ్ రేటు కాస్త ఊరటనిచ్చింది. వరుసగా మారుతున్న ధరల్లో..గురువారం మరోసారి పసిడి ధరలు తగ్గాయి. దీంతో ఇప్పటికే నాలుగు రోజుల్లో బంగారం ధరలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 01 2026, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మార్కెట్లో దసరా సందడి
Image Credit : Getty

మార్కెట్లో దసరా సందడి

అక్టోబర్ నెల మొదలైంది. మరికొద్ది రోజుల్లో దసరా సందడి మొదలుకానుంది. పండుగలు, శుభకార్యాల సీజన్ కావడంతో ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.1,49,240కు చేరిన బంగారం
Image Credit : Getty

రూ.1,49,240కు చేరిన బంగారం

గురువారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.330 తగ్గింది. దీంతో గత నాలుగు రోజుల్లో కలిపి 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.3,500 వరకు తగ్గింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,240గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,36,800గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,390గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,36,950గా ఉంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,49,240గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,36,800 వద్ద కొనసాగుతోంది.

35
స్థిరంగా పసిడి
Image Credit : Getty

స్థిరంగా పసిడి

ఇక వెండి ధర విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్లో ఇవాళ ఎలాంటి మార్పు కనిపించలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.2,45,000గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి రూ.2,35,000గా ఉండగా.. ముంబై, బెంగళూరులోనూ ఇదే ధర కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద ఉంది.

45
ఔన్సు బంగారం ధర 4,175 డాలర్లు
Image Credit : Getty

ఔన్సు బంగారం ధర 4,175 డాలర్లు

అయితే అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్ మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అక్కడ గోల్డ్ ధర పెరిగింది. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర 4,175 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకునే మార్పులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, భౌగోళిక పరిస్థితులు దేశీయ గోల్డ్ రేట్లపై ప్రభావం చూపుతుంటాయి.

55
దిగొస్తున్న పసిడి
Image Credit : Getty

దిగొస్తున్న పసిడి

అక్టోబర్ ప్రారంభంలో బంగారం ధరలు వరుసగా కాస్త దిగొస్తున్నాయి. దసరా, దీపావళి వంటి పండుగల సీజన్ ముందున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో గోల్డ్ రేట్లు ఎలా కదులుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బంగారం కొనుగోలు చేసేవారు ఆ రోజు మార్కెట్ ధరతో పాటు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. ఏకంగా 16 రోజులు హాలిడేస్.. ఫుల్ లిస్ట్ ఇదిగో
Recommended image2
October 1 Rule Changes: ఎల్పీజీ సబ్సిడీ నుంచి ఎస్‌బీఐ ఏటీఎం వరకు.. అక్టోబర్ 1 నుంచి మారనున్న టాప్ 10 రూల్స్
Recommended image3
Gold Price Hike: కొంపముంచిన పసిడి.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం...కొనుగోలుదారులకు షాక్
Related Stories
Recommended image1
Gold Price Hike: కొంపముంచిన పసిడి.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం...కొనుగోలుదారులకు షాక్
Recommended image2
Gold price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...మూడో రోజు బంగారం ధరలకు బ్రేక్..దిగొచ్చిన గోల్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved