Gold Price: బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం.. భారీగా పతనమైన ధరలు.
భారతీయులను, బంగారాన్ని విడదీసి చూడలేం. అంతలా మన సంస్కృతిలో, ఆచారాల్లో బంగారం భాగమైంది. ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. కాగా బంగారం ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. తులం బంగారం ఏకంగా రూ. లక్ష దాటేసి అందరినీ షాక్‌కి గురి చేసింది. అయితే తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.

Gold Rate Today
2025 మొదటి నుంచి బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రతీ రోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర ఏకంగా రూ. లక్ష దాటేసింది. దీంతో రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరగడం ఖాయమనే వాదనలు వినిపించాయి.
ఈ ఏడాది చివరి నాటికి తులం బంగారం ధర రూ. లక్షన్నరకు చేరుతుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందరులు చేస్తూ బంగారం ధర ఒక్కసారిగా తగ్గుతోంది.
గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు క్షీణిస్తున్నాయి. ప్రతీ రోజూ బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. గురువారం ఒక్క రోజే తులం బంగారంపై ఏకంగా రూ. 2180 తగ్గడం విశేషం. దీంతో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 87,750కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 89,750గా ఉంది.
ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే బుధవారం తులం గోల్డ్ ధర రూ. 97,910గా ఉండగా ఈరోజు రూ. 95,730కి దిగొచ్చింది. దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఆకాశాన్నంటిన బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండడంతో గోల్డ్ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
తులం బంగారం ధర రూ. 70 వేలు కానుందా.?
బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో తులం బంగారం ధర రూ. 70 నుంచి రూ. 75 వేల మధ్యలో ఉండేది. యఅయితే ఏడాదిలో ఏకంగా 25 శాతం ధరలు పెరిగాయి.
Gold Price
అయితే తాజా పరిణామాలు చూస్తుంటే బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు 40 శాతం మేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 3300 డాలర్లు ఉండగా అది అతి త్వరలోనే 2500 డాలర్లకు పతనం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.