- Home
- Business
- Gold Price: బంగారం కొనడానికి ఇదే సరైన సమయం.. వచ్చే ఏడాదిలో తులం ధర ఎంత కానుందో తెలుసా?
Gold Price: బంగారం కొనడానికి ఇదే సరైన సమయం.. వచ్చే ఏడాదిలో తులం ధర ఎంత కానుందో తెలుసా?
బంగారం ధరల్లో స్థిరత్వం ఉండడం లేదు. ఎప్పుడు తగ్గుతున్నాయో, ఎప్పుడు పెరుగుతున్నాయో తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బంగారం ధర ఓ రేంజ్‌లో పెరుగుతోంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తులం బంగారం రూ. లక్ష దాటేసింది. అయితే తాజాగా మళ్లీ బంగారం ధర తగ్గుముఖం పట్టింది. అయితే రానున్న రోజుల్లో గోల్డ్ రేట్స్ మళ్లీ పెరగనున్నాయా.?

Gold Price
తులం బంగారం ధర రూ. లక్ష దాటగానే అంతా ఉలిక్కిపడ్డారు. ఇక బంగారం కొనడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఒక్కసారిగా బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 98 వేల వద్ద కొనసాగుతోంది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలు మళ్లీ పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం బంగారం ధరలు చూస్తున్న చాలా మందికి గతంలో పెట్టుబడి పెట్టి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గత మార్చిలో బంగారం ధర తక్కువ స్థాయిలో ఉండగా, అప్పటి నుంచి ఇది భారీగా పెరిగింది. 2024 మొదట్లో బంగారం ధర 2,000 డాలర్లు (ఒక ఔన్స్‌కు) మాత్రమే ఉండేది. కేవలం 15 నెలల్లో ఇది 3,500 డాలర్ల వరకు వెళ్లిపోయింది. ధరలు వేగంగా పెరగడం వల్ల చాలా మంది బంగారం అంటేనే భయపడ్డారు.
అయితే వచ్చే ఏడాది బంగారం ధరలు చుక్కలు చూపించడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. జేపీ మోర్గాన్ విశ్లేషకుల ప్రకారం 2026 రెండో త్రైమాసికంలో బంగారం ధర 4,000 డాలర్లను తాకుతుందని అభిప్రాయపడుతున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే తులం బంగారం ధర రూ. 1.35 లక్షల నుంచి రూ. 1.4 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. బంగారాన్ని టాప్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించడమే ఇందుకు కారణంగా అంచనా వేస్తున్నారు.
బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణాలు:
* అమెరికాలో ఆర్థిక మాంద్యం రానుందని అంచనా.
* టారిఫ్ పాలసీల వల్ల అమెరికన్ మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతోంది.
* స్టాగ్‌ఫ్లేషన్ (తక్కువ వృద్ధి + ఎక్కువ ద్రవ్యోల్బణం) పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది.
* ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా బంగారం డిమాండ్ పెరిగే అవకాశాల ఉండడం.
* 2025లో బంగారం మీద ETF పెట్టుబడి 715 టన్నుల వరకు ఉండొచ్చని అంచనా. దీని వల్ల బంగారం ధరలు 22% పెరగవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది.
ఇప్పుడు ఏం చేస్తే మంచిది.?
కొందరు పెట్టుబడిదారులు భావిస్తున్నట్లు బంగారం ధరలు బారీగా పతనడం కావడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఇప్పటికైనా బంగారంలో పెట్టుబడి పెట్టడం అనేది మంచి చర్య అని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో కనీసం 10%–15% బంగారం కోసం కేటాయించాలని అంటున్నారు.