MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Recharge Plan: రూపాయికే సిమ్‌.. అన్‌లిమిటెడ్ కాల్స్ రోజుకు 1 జీబీ డేటా

Recharge Plan: రూపాయికే సిమ్‌.. అన్‌లిమిటెడ్ కాల్స్ రోజుకు 1 జీబీ డేటా

Recharge Plan: బీఎస్ఎన్ఎల్‌ (BSNL) మరోసారి ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకునే వినియోగదారుల కోసం ‘ఫ్రీడమ్ ప్లాన్ 2.0’ను అందుబాటులోకి తెచ్చింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 13 2026, 09:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ.1కే సిమ్.. తొలి రీఛార్జ్ కూడా ఉచితం
Image Credit : Getty

రూ.1కే సిమ్.. తొలి రీఛార్జ్ కూడా ఉచితం

బీఎస్ఎన్ఎల్ కొత్తగా కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి ఈ ఆఫర్ ప్రత్యేకంగా ఉపయోగపడనుంది. కేవలం రూ.1 చెల్లిస్తే సిమ్ కార్డును పొందవచ్చు. అంతేకాదు, సాధారణంగా రీఛార్జ్ కోసం చెల్లించాల్సిన మొత్తాన్ని ఈ ప్రమోషన్‌లో భాగంగా మినహాయిస్తున్నారు. సిమ్ యాక్టివేషన్ అనంతరం అందించే ఫ్రీడమ్ ప్లాన్‌లో 24 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ సమయంలో వినియోగదారులు ఎలాంటి అదనపు రీఛార్జ్ చేయకుండానే కాల్స్, ఎస్ఎంఎస్‌లు, డేటాను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ప్రత్యేక ప్రయోజనం కొత్త బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ సిమ్ ఉపయోగిస్తున్నవారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
24 రోజుల పాటు కాల్స్, డేటా, ఎస్ఎంఎస్‌లు
Image Credit : stockPhoto

24 రోజుల పాటు కాల్స్, డేటా, ఎస్ఎంఎస్‌లు

ఫ్రీడమ్ ప్లాన్‌లో భాగంగా 24 రోజులపాటు అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌లో అన్‌లిమిటెడ్‌గా కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. డేటా విషయానికి వస్తే ప్రతిరోజూ 1 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తున్నారు. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత వేగం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్‌లను పంపుకునే ప్రయోజనం కూడా ఉంటుంది. ఈ విధంగా తక్కువ ఖర్చుతో కొత్త కనెక్షన్ తీసుకునే వారికి మొదటి 24 రోజులకు కాల్స్, డేటా, మెసేజింగ్ అవసరాలను ఒకే ప్లాన్ ద్వారా తీర్చుకునే అవకాశం లభిస్తోంది.

Related Articles

Related image1
Highway: ఇక‌పై ఆ దేశాల‌కు కారులో వెళ్లిపోవ‌చ్చు.. 1360 కి.మీల భారీ ర‌హ‌దారి నిర్మాణం
Related image2
రూ.499, రూ.799 అంటూ ధరలను 9తోనే ఎందుకు ముగిస్తారు? ఇందులో ఎంత సైకాల‌జీ ఉందో తెలుసా?
35
గతేడాది ఆఫర్‌తో పోలిస్తే ఏం మారింది?
Image Credit : BSNL\Twitter

గతేడాది ఆఫర్‌తో పోలిస్తే ఏం మారింది?

బీఎస్ఎన్ఎల్ గత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ‘ఆజాదీ కా ప్లాన్’ పేరుతో రూ.1 ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అప్పట్లో ఆ ప్లాన్‌కు 30 రోజుల వ్యాలిడిటీ ఉండేది. రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ అందించేవారు. ఇప్పుడు తీసుకొచ్చిన ‘ఫ్రీడమ్ ప్లాన్ 2.0’లో ప్రయోజనాల్లో కొన్ని మార్పులు చేశారు. వ్యాలిడిటీని 30 రోజుల నుంచి 24 రోజులకు తగ్గించారు. రోజువారీ హైస్పీడ్ డేటాను కూడా 2 జీబీ నుంచి 1 జీబీకి పరిమితం చేశారు. అయితే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల ప్రయోజనాలు కొనసాగుతున్నాయి. అందువల్ల గతేడాది ఆఫర్‌తో పోలిస్తే ఈసారి తక్కువ వ్యాలిడిటీ, తక్కువ రోజువారీ డేటా లభిస్తున్నప్పటికీ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు రూ.1 ప్రారంభ ధరను కొనసాగించారు.

45
రూ.2,399 ప్లాన్‌తో 412 రోజుల వ్యాలిడిటీ
Image Credit : stockPhoto

రూ.2,399 ప్లాన్‌తో 412 రోజుల వ్యాలిడిటీ

ఫ్రీడమ్ ఆఫర్‌తో పాటు ప్రస్తుత వినియోగదారులకు ఉపయోగపడే మరో ప్రయోజనాన్ని కూడా బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రూ.2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్ 365 రోజుల కాలపరిమితితో వస్తుంది. అయితే ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12, 2026 మధ్య రీఛార్జ్ చేసుకునే వారికి అదనంగా 47 రోజులు లభిస్తాయి. దీంతో మొత్తం వ్యాలిడిటీ 412 రోజులకు చేరుతుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్ వంటి ప్రయోజనాలు కొనసాగుతాయి. తరచూ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఏడాదికి పైగా సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది.

55
సెప్టెంబర్ 12 వరకు మాత్రమే ఆఫర్లు
Image Credit : X

సెప్టెంబర్ 12 వరకు మాత్రమే ఆఫర్లు

బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఈ రెండు ప్రత్యేక ప్రయోజనాలు పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తాయి. రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ ఆఫర్‌ను సెప్టెంబర్ 12, 2026 వరకు పొందవచ్చు. అలాగే రూ.2,399 వార్షిక ప్లాన్‌పై 47 రోజుల అదనపు వ్యాలిడిటీ కూడా ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 మధ్య చేసే రీఛార్జ్‌లకే వర్తిస్తుంది. 4జీ సేవలను విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడంతో పాటు ప్రస్తుత వినియోగదారులను ఎక్కువ కాలం తమ నెట్‌వర్క్‌లో కొనసాగించేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
పెట్టుబ‌డి పెట్టే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు..
Recommended image2
Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
Recommended image3
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Related Stories
Recommended image1
Highway: ఇక‌పై ఆ దేశాల‌కు కారులో వెళ్లిపోవ‌చ్చు.. 1360 కి.మీల భారీ ర‌హ‌దారి నిర్మాణం
Recommended image2
రూ.499, రూ.799 అంటూ ధరలను 9తోనే ఎందుకు ముగిస్తారు? ఇందులో ఎంత సైకాల‌జీ ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved