- Home
- Technology
- Digital Photo Frame: అప్‌డేట్ అవ్వండి బ్రో.. ఇంకా అవే పాత ఫోటో ఫ్రేమ్‌లు ఉపయోగిస్తారా.?
Digital Photo Frame: అప్‌డేట్ అవ్వండి బ్రో.. ఇంకా అవే పాత ఫోటో ఫ్రేమ్‌లు ఉపయోగిస్తారా.?
Digital Photo Frame: కాలం మారుతోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ సైతం మారుతోంది. సాధారణ వస్తువులు కూడా స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఫొటో ఫ్రేమ్ కూడా స్మార్ట్‌గా మారిపోయాయి.

డిజిటల్ ఫోటో ఫ్రేమ్
ప్రతీ ఒక్కరి ఇళ్లలో ఫోటో ఫ్రేమ్‌లు కనిపించడం సర్వసాధారణం. అయితే ప్రస్తుత టెక్ యుగంలో ఈ ఫొటో ఫ్రేమ్‌లు కూడా డిజిటల్‌గా మారిపోయాయి. అమెజాన్‌లో ఇలాంటి ఓ ఫొటో ఫ్రేమ్‌పై మంచి డిస్కౌంట్ లభిస్తోంది. AKImart పేరుతో అందుబాటులో ఉన్న ఈ డిజిటల్ ఫొటో ఫ్రేమ్ అసలు ధర రూ. 12,999 కాగా ఏకంగా 63 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో అమెజాన్‌లో ఈ ప్రొడక్ట్‌ను కేవలం రూ. 4799కే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది. ఇంతకీ డిజిటల్ ఫోటో ఫ్రేమ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? అసలు ఇది ఎలా పనిచేస్తుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.
హై డెఫినిషన్ టచ్‌స్క్రీన్
AKImart డిజిటల్ ఫ్రేమ్ 1280*800 రిజల్యూషన్‌తో ఉంది, దీని ద్వారా ఫొటోలను హై క్వాలిటీలో చూడొచ్చు. IPS టెక్నాలజీతో కలర్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. టచ్‌స్క్రీన్ ఉండడంతో ఫ్రేమ్ సెట్అప్ చేసుకోవచ్చు. ఫొటోలను స్లైడ్ చేయొచ్చు.
ఫొటోలు, వీడియోలు ఎలా షేర్ చేయాలి.?
FRAMEO యాప్ ద్వారా మీరు ఫోటోలు, చిన్న వీడియోలను (15 సెకన్ల వరకు) ప్రపంచంలో ఎక్కడి నుంచైనా షేర్ చేయొచ్చు. దీంతో మీ కుటుంబ సభ్యులు మీ అద్భుతమైన క్షణాలను కొన్ని సెకన్లలోనే చూడగలరు. ఫ్రేమ్‌లో 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచవచ్చు. ఫోటోలు, వీడియోలను ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన ఫంక్షన్లు
ఫ్రేమ్ ఆటోమాటిక్‌గా ఫోటోలను రొటేట్ చేసి చూపిస్తుంది. డిటాచబుల్ హోల్డర్‌తో ఫొటోలను అడ్డం లేదా పొడవులో చూడొచ్చు. క్యాప్షన్, వాతావరణం, క్లాక్ వంటి వివరాలను చూడొచ్చు. ప్లే ఆర్డర్, ఇమేజ్ జూమ్, ఇమేజ్ హైడ్/పబ్లిష్, బ్రైట్‌నెస్ సెట్ చేయడం, స్లీప్ మోడ్ వంటి అనేక ఫంక్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
సులభమైన సెట్‌అప్, ఉపయోగం
సులభమైన ఇంటర్‌ఫేస్ డిజైన్ వల్ల అన్ని వయసుల వారు ఫ్రేమ్‌ను తేలికగా ఉపయోగించవచ్చు. కేవలం కొన్ని స్టెప్స్‌లో సెట్‌అప్ పూర్తి చేసి, ఇంట్యుటివ్ టచ్‌స్క్రీన్ ద్వారా ఫోటోలు, వీడియోలను చూడొచ్చు. పుట్టినరోజు, వివాహం వంటి సందర్భాల్లో ఈ డిజిటల్ ఫ్రేమ్ బహుమతిగా ఇవ్వవచ్చు.