MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • 10 గ్రాముల గోల్డ్‌కి ఎంత లోన్ వస్తుంది.? ఈఎంఐ ఎంత ఉంటుంది..

10 గ్రాముల గోల్డ్‌కి ఎంత లోన్ వస్తుంది.? ఈఎంఐ ఎంత ఉంటుంది..

Gold Loan: మన దగ్గర ఉన్న బంగారం అవసరమైన సమయాల్లో పెద్ద సాయం చేస్తుంది. 10 గ్రాముల బంగారంపై ఎంత లోన్ వస్తుందో మరి ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు ఈ స్టోరీలో ఉన్నాయి.  

1 Min read
Author : Pavithra D
Published : Feb 06 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగారం అమ్మకుండా డబ్బు ఎలా పొందాలి?
Image Credit : Gold Price\Twitter

బంగారం అమ్మకుండా డబ్బు ఎలా పొందాలి?

మన దగ్గర బంగారం ఉంటే అది కష్ట సమయాల్లో మనకు అవసరపడుతుంది. ఆ బంగారాన్ని అమ్మకుండా కూడా మనం డబ్బుగా మార్చుకోవచ్చు. అదే గోల్డ్ లోన్. మరి 10 గ్రాముల బంగారంపై ఎంత రుణం వస్తుంది.? ఇది బ్యాంక్ నియమాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత బంగారం ధర, స్వచ్ఛత కీలకం. కొన్ని గంటల్లోనే డబ్బు చేతిలో ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బరువు, స్వచ్ఛతే లోన్‌కు అవసరం..
Image Credit : X

బరువు, స్వచ్ఛతే లోన్‌కు అవసరం..

మొదట బ్యాంక్ బంగారాన్ని తనిఖీ చేస్తుంది. ఎన్ని క్యారెట్లు ఉందో చెక్ చేస్తారు. రాళ్లు, ఇతర మజూరి లాంటివి తీసేస్తారు. కేవలం స్వచ్ఛమైన బంగారం బరువే పరిగణలోకి వస్తుంది. 22 క్యారెట్ అయితే విలువ ఎక్కువ. విలువ ఎంతైతే లోన్ అంత. డిజైన్‌కు విలువ ఉండదు. బరువు, స్వచ్ఛతే ఫైనల్.

35
10 గ్రాముల బంగారం = ఎంత లోన్?
Image Credit : Getty

10 గ్రాముల బంగారం = ఎంత లోన్?

ఇప్పుడు మన దగ్గర 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ఉందనుకుందాం. మార్కెట్ విలువ సుమారు రూ. 1.4 లక్షలు. బ్యాంక్‌లు సాధారణంగా 75–85 శాతం వరకు లోన్ ఇస్తాయి. అంటే రూ. 90,000 నుంచి రూ. 1.2 లక్షల వరకు వస్తుంది. ఈ లెక్క బ్యాంక్‌లపై ఆధారపడి ఉంటుంది. రోజువారీ బంగారం ధరలు కూడా ఈ లోన్‌ను ప్రభావితం చేస్తాయి.

45
తక్కువ వడ్డీ – ఎక్కువ సౌకర్యం
Image Credit : Getty

తక్కువ వడ్డీ – ఎక్కువ సౌకర్యం

గోల్డ్ లోన్ వడ్డీ సాధారణంగా తక్కువగా ఉంటుంది. పర్సనల్ లోన్ కంటే చాలా తక్కువ. బ్యాంకుల్లో 8.5 శాతం నుంచి 12 శాతం వరకు ఉంటుంది. NBFCలలో కొంచెం ఎక్కువ కావచ్చు. తిరిగి చెల్లించడానికి ఆప్షన్లు ఉంటాయి. EMIగా చెల్లించవచ్చు. లేదా వడ్డీ మాత్రమే చెల్లించవచ్చు. మెచ్యూరిటీలో మొత్తం కట్టే ఆప్షన్ కూడా ఉంది.

55
సమయానికి చెల్లిస్తే బంగారం సేఫ్
Image Credit : X

సమయానికి చెల్లిస్తే బంగారం సేఫ్

ఉదాహరణకు రూ. 1 లక్ష లోన్ తీసుకుంటే.. 10 శాతం వడ్డీ ఉంటే EMI సుమారు రూ. 9 వేలు. వడ్డీ మాత్రమే చెల్లిస్తే నెలకు రూ. 850.. అలా ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. సమయానికి డబ్బు చెల్లించకపోతే బ్యాంక్ బంగారాన్ని వేలం వేయవచ్చు. కాబట్టి ముందే ప్లాన్ చేసుకోవాలి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali Gold Buying: దీపావళికి బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టపోతారు
Recommended image2
Post Office: ప్ర‌ధాని మోదీ కూడా ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడుతున్నారు.. మీరు కూడా ట్రై చేస్తారా.?
Recommended image3
LPG New Rules October 1: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్
Related Stories
Recommended image1
Gold Earrings: 1గ్రాములో బంగారు చెవిపోగులు
Recommended image2
Gold studs: అరగ్రాము గోల్డ్‌లో వచ్చే పెండెంట్లు, స్టడ్స్ ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved