Farming: మీకు భూమి ఉందా.? బంగారాన్ని పండించొచ్చు.!
ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా మానవ మనుగడం ఉండాలంటే వ్యవసాయం చేయాల్సిందే. ఇలాంటి ప్రత్యామ్నాయం లేని వ్యవసాయాన్ని మొదలు పెడితే ఊహించని లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక బెస్ట్ పంట గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
అల్లం సాగు
తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించాలంటే అల్లం సాగు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. అల్లం సాగు చేయడానికి ఎర్ర గరప నేలలు, ఆండ్రజన్ నేలలు బాగా ఉపయోగపడతాయి. నేల పీహెచ్ (pH) స్థాయి: 6.0–7.0 మధ్య ఉండాలి.
విత్తనాల ఎంపిక చేయాలి.?
ఆరోగ్యంగా ఉన్న మాత దుంపల నుంచి తీసిన విత్తనాలను ఉపయోగించాలి. 1 ఎకరానికి సుమారు 600–800 కిలోల విత్తన దుంపలు అవసరం. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేయాలి. వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ ఉండేలా విత్తనాలను విత్తాలి.
పంట ఎన్ని రోజులకు వస్తుంది.?
సాధారణంగా అల్లం సాగు వేసిన తర్వాత 8 నుంచి 10 నెలలు పడుతుంది. సేంద్రియ ఎరువులు (కంపోస్ట్, విరిజం) ఉపయోగిస్తే అధిక రాబడి వస్తుంది. తెగుళ్లు (రూట్ రాట్, లీఫ్ స్పాట్) నివారణకు అవసరమైన మందులని క్రమం తప్పకుండా ఉపయోగించాలి.
లాభాలు ఎలా ఉంటాయి.?
ఎకరం పెట్టుబడికి రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు కావాల్సి ఉంటుంది. ఎకరం సాగు చేస్తే 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో అల్లం ధర సుమారు రూ. 60 నుంచి రూ. 100 మధ్య ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే ఎకరానికి రూ. 6 నుంచి రూ. 10 లక్షలు దిగుబడి వస్తుంది. ఖర్చులన్నీ పోనూ రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు లాభం పొందొచ్చు.
మార్కెటింగ్
అల్లం ఉత్పత్తికి దేశీయంగా విస్తృత మార్కెట్ ఉంది. స్పైస్ కంపెనీలు, ఆయుర్వేద ఫార్మా సంస్థలు, ఎక్స్‌పోర్ట్ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ప్యాకింగ్ చేసి చిన్న మాల్స్, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌కి అమ్మినా అదనపు లాభం పొందొచ్చు. నేరుగా ప్రాసెసింగ్ కంపెనీలకు, ఎగుమతిదారులకు అమ్మే అవకాశం ఉంది. PMKSY, RKVY వంటి పథకాల ద్వారా సబ్సిడీలు దరఖాస్తు చేయవచ్చు. లాభాలు అనేవి మార్కెట్ పరిస్థితికి అనుగుణంగా మారుతుంటాయి.