MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • 8th Pay Commission: 8వ వేతన సంఘం కీలక భేటీ.. ఉద్యోగులకు జాక్‌పాట్.. జీతం ఎంత పెరగనుందంటే?

8th Pay Commission: 8వ వేతన సంఘం కీలక భేటీ.. ఉద్యోగులకు జాక్‌పాట్.. జీతం ఎంత పెరగనుందంటే?

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్. బెంగళూరులో 8వ వేతన సంఘం కీలక భేటీ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, రిపోర్ట్ సమయం వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 07 2026, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్: 8వ వేతన సంఘం కీలక సమావేశం
Image Credit : Asianet News

జీతాల పెంపుపై బిగ్ అప్‌డేట్: 8వ వేతన సంఘం కీలక సమావేశం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల చూపు ఇప్పుడు బెంగళూరు నగరం వైపు మళ్లింది. 8వ వేతన సంఘం (8th Pay Commission) కీలక సమావేశాలు అక్టోబర్ 7, 8 తేదీలలో బెంగళూరులో జరగనున్నాయి. దీని తర్వాత అక్టోబర్ 22, 23 తేదీలలో ముంబైలో కూడా భేటీలు జరగనున్నాయి. వేతన సంఘం సభ్యులు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులను నేరుగా కలుస్తున్నారు. వారి అభిప్రాయాలు, విజ్ఞప్తులను క్షేత్రస్థాయిలోనే సేకరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో వరుస భేటీలు
Image Credit : Asianet News

దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో వరుస భేటీలు

కేవలం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి మాత్రమే పరిమితం కాకుండా, వేర్వేరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగుల కోరికలను స్వయంగా తెలుసుకోవడం ఈ కమిటీ ప్రత్యేకత. ఇప్పటివరకు 14కు పైగా ముఖ్య ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ, వందలాది ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలతో విడివిడిగా చర్చలు జరిపింది.

ఇటీవల సెప్టెంబర్ 7-8 తేదీలలో చెన్నైలో, సెప్టెంబర్ 9న పుదుచ్చేరిలో, సెప్టెంబర్ 16-18 తేదీలలో ఛండీగఢ్‌లో సమావేశాలు పూర్తి చేసుకుంది. ఛండీగఢ్ భేటీలో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సంఘాలు పాల్గొన్నాయి.

35
18 నెలల వ్యవధిలో 11 నెలలు పూర్తి
Image Credit : chatgpt

18 నెలల వ్యవధిలో 11 నెలలు పూర్తి

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీర్మానం ప్రకారం 2025 నవంబర్ 3న ఈ కమిటీ ఏర్పాటైంది. రిపోర్ట్ సమర్పించడానికి కమిటీకి మొత్తం 18 నెలల సమయం ఇచ్చారు. ఇందులో దాదాపు 11 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు కేవలం 7 నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు.

ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్ టైమ్ మెంబర్‌గా, పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బెంగళూరు భేటీ కోసం ఆగస్టు 24న నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 18 లోపు అపాయింట్‌మెంట్ కోరాలని స్పష్టం చేశారు. అలాగే ముంబై భేటీకి దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 10 చివరి తేదీ.

45
జీతాల పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై చర్చలు
Image Credit : gemini

జీతాల పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై చర్చలు

ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలలో ప్రధానంగా జీతాల నిర్మాణం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పైనే చర్చలు నడుస్తున్నాయి. కొత్త వేతన సంఘంలో ప్రాథమిక వేతనం ఏ స్థాయిలో పెరుగుతుందో నిర్ణయించడానికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ చాలా కీలకం. అందుకే ఉద్యోగుల్లో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కొందరు ప్రతినిధులు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.83 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని కోరుతున్నారు.

కనీస ప్రాథమిక వేతనాన్ని ₹69,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి కరవు భత్యం సవరించాలని పెన్షనర్లు కోరుతున్నారు. అలాగే DA/DR 25 శాతానికి దాటితే దాన్ని బేసిక్ పేలో కలపాలని అడుగుతున్నారు. అయితే వీటిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.

55
వేతన సంఘం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది?
Image Credit : ChatGPT

వేతన సంఘం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది?

ఈ కమిటీ తన పూర్తిస్థాయి రిపోర్టును 2027 మొదటి భాగంలో, ప్రత్యేకించి మే 2027 నాటికి సమర్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 18 నెలల గడువు లెక్కన మే-జూన్ 2027 టార్గెట్ కాగా, కొందరు నిపుణులు ఫిబ్రవరి-మార్చి 2027 నాటికే రిపోర్ట్ రావచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే అధికారిక గడువు మాత్రం మే 2027 వరకు ఉంది. అవసరమైతే కమిటీ సమయాన్ని పొడిగించాలని కోరే అవకాశం కూడా ఉంది.

కమిటీ ఇచ్చే సిఫార్సులను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం జీతాల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. కొత్త జీతాల పెంపు జనవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తుందని, ఆలస్యమైతే అరియర్స్ రూపంలో నగదు అందుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. అధికారిక నవీకరణల కోసం ఉద్యోగులు 8వ వేతన సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సామాన్యుడిపై మ‌రో దెబ్బ‌.. ఈ సారి మొబైల్ రీచార్జ్‌ల వంతు, ఎంత పెర‌గ‌నున్నాయంటే
Recommended image2
Gold SIP: బంగారాన్ని ఎప్పుడూ ఇలానే కొనండి.. ఫ్యూచర్ కు ఇదే పెట్టుబడి, భరోసా
Recommended image3
Economic Crisis: కష్టకాలంలోనూ సేఫ్ జోన్‌లో ఉండాలా? ఈ నాలుగు గోల్డెన్ రూల్స్ మీ కోసమే..!
Related Stories
Recommended image1
Flipkart Big Billion Days Sale: రచ్చ లేపుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్.. 65 ఇంచుల టీవీపై రూ. 22,000 తగ్గింపు
Recommended image2
Laptops: ఫెస్టివ్ సేల్‌లో ప్రైమ్‌బుక్ ధమాకా.. రూ. 24 వేల లోపే ల్యాప్‌టాప్.. ఆఫర్లు, ఫీచర్ల వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved