MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • EPFO: ఇక బాస్‌ పర్మిషన్ అవసరం లేదు.. స్మార్ ఫోన్ ఉంటే చాలు.. అరచేతిలో ఈపీఎఫ్‌వో సేవలు!

EPFO: ఇక బాస్‌ పర్మిషన్ అవసరం లేదు.. స్మార్ ఫోన్ ఉంటే చాలు.. అరచేతిలో ఈపీఎఫ్‌వో సేవలు!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)సేవలు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోనే పొందవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయింపు, యాక్టివేషన్ వంటి సేవలకు యాజమాన్యం ( HR) అనుమతి అవసరం లేదు. ఉమాంగ్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌ల ద్వారా స్వయంగా యూఏఎన్ పొందవచ్చు,

2 Min read
Author : Rajesh K
Published : Aug 07 2025, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
స్టార్ట్ ఫోన్ ఉండే చాలు.. పీఎఫ్ సేవలు చాలా స్మార్ట్ గురూ..
Image Credit : Getty

స్టార్ట్ ఫోన్ ఉండే చాలు.. పీఎఫ్ సేవలు చాలా స్మార్ట్ గురూ..

EPFO Update:ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ సభ్యుల కోసం పెద్ద అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇకపై యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయింపు, యాక్టివేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఉద్యోగికి ఈ సర్వీసులను స్మార్ట్ గా పొందవచ్చు. అది కూడా యాజమాన్యం ( HR) అనుమతి అవసరం లేకుండానే. అది ఎలాగో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హెచ్ ఆర్ ఫర్మిషన్ కి బై బై
Image Credit : Asianet News

హెచ్ ఆర్ ఫర్మిషన్ కి బై బై

కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు లేదా ఇప్పటికీ UAN లేని వారు ఇకపై HR అనుమతిని ఆశ్రయించాల్సిన పనిలేదు. తమ స్మార్ట్‌ఫోన్ ద్వారానే UAN పొందే, యాక్టివేట్ చేసుకునే అవకాశం కల్పించింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO). కంపెనీ యాజమాన్యం లేదా EPFO కార్యాలయంపై ఆధారపడాల్సిన అవసరం ఇకపై ఉండదు.

36
ఈ రెండు యాప్స్‌ ఉండే చాలు..
Image Credit : X

ఈ రెండు యాప్స్‌ ఉండే చాలు..

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)సేవలు పొందాలంటే మీ ఫోన్‌లో రెండు ముఖ్యమైన యాప్స్ అవసరం. 1.ఉమాంగ్ యాప్ (UMANG), 2. ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ (UIDAI Face RD App). ఈ రెండు యాప్‌లతో మీరు పూర్తి ప్రక్రియను పూర్తిచేయవచ్చు. భారతదేశంలో పనిచేస్తున్న విదేశీయులు, నేపాల్, భూటాన్ పౌరుల విషయంలో మాత్రం కంపెనీ యాజమాన్యం ద్వారానే UAN కేటాయింపు, యాక్టివేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

46
UAN ఎలా పొందాలి?
Image Credit : our own

UAN ఎలా పొందాలి?

ముందుగా ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి యూఏఎన్ అలాట్మెంట్ (UAN Allotment)లింక్‌పై క్లిక్ చేయండి. మీ ఆధార్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తిచేయండి. ఆ తరువాత మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది . దానిని ఎంటర్ చేసి ధృవీకరించండి. ఆధార్‌తో లింక్ ఉన్న UAN ఉంటే తెలియజేస్తుంది. లేకుంటే ఫేస్ అథెంటికేషన్ చేయాలని సూచిస్తుంది. ఆ తరువాత ముఖాన్ని స్కాన్ చేసిన తర్వాత కొత్త UAN నెంబర్ SMS రూపంలో వస్తుంది

56
UAN ఎలా యాక్టివేట్ చేయాలి?
Image Credit : Twitter

UAN ఎలా యాక్టివేట్ చేయాలి?

ఉమాంగ్ యాప్‌లో UAN Activation సెక్షన్‌కు వెళ్లండి. ఆ తరువాత UAN నంబర్, ఆధార్, మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తరువాత మీ ఫోన్ కు OTP వస్తుంది. దాని ఎంటర్ చేసి ధృవీకరించండి. తదుపరి ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయండి. ఫోన్‌కు టెంపరరీ పాస్‌వర్డ్ వస్తుంది. ఇలా యూఎఎన్ నెంబర్ యాక్టివ్ అవుతుంది.

66
ఇతర సేవలూ ఫోన్‌లోనే
Image Credit : our own

ఇతర సేవలూ ఫోన్‌లోనే

ఇతర సేవలకు కూడా ఫోన్‌లోనే చేసుకోవచ్చు. ప్రధానంగా UAN పాస్‌బుక్ తనిఖీ, KYC అప్‌డేట్, క్లెయిమ్ అప్లికేషన్, ఇలా ప్రాథమిక సేవలను ఉమాంగ్ యాప్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు.

ఏవైనా సమస్యలైతే? టెక్నికల్ ఇబ్బందులు ఎదురైతే ఉమాంగ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. వారి సపోర్ట్ టీమ్ తక్షణమే స్పందిస్తుందని EPFO చెబుతోంది.

 ఇలా EPFO సేవలకు హాజరు కావాలంటే ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే మీ ఫోన్‌ నుంచే UAN పొందండి, యాక్టివేట్ చేయండి, సేవలు వాడుకోండి. టెక్నాలజీ ద్వారా ఉద్యోగుల భవిష్య భద్రత మరింత స్మార్ట్ చేసుకోండి.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
భారత దేశం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
EPFO: ఒక్క క్లిక్‌తోనే మీ PF సమాచారం మొత్తం లభిస్తుంది: ఏం చేయాలంటే..
Recommended image2
EPFO: ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ అవుతోన్న వడ్డీ.. మీ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved