MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • EPFO: ఈపీఎఫ్ఓ కొత్త సైట్ వచ్చేసింది.. మారిన UAN యాక్టివేషన్ రూల్స్, కొత్త ప్రాసెస్ ఇదే

EPFO: ఈపీఎఫ్ఓ కొత్త సైట్ వచ్చేసింది.. మారిన UAN యాక్టివేషన్ రూల్స్, కొత్త ప్రాసెస్ ఇదే

EPFO Passbook Portal: ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. జూన్ 26 నుంచి జరిగిన అప్‌గ్రేడ్ తర్వాత సర్వీసులు పునరుద్ధరించారు. కొత్తగా వచ్చిన మార్పులు, మీ బ్యాలెన్స్ ఎలా చూసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 12 2026, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
EPFO: మళ్లీ పనిచేస్తున్న పీఎఫ్ పాస్‌బుక్ పోర్టల్.. మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
Image Credit : Gemini

EPFO: మళ్లీ పనిచేస్తున్న పీఎఫ్ పాస్‌బుక్ పోర్టల్.. మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. గత వారం రోజులుగా షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కోసం తాత్కాలికంగా నిలిపివేసిన పీఎఫ్ పాస్‌బుక్ పోర్టల్‌ను అధికారులు మళ్లీ రీస్టార్ట్ చేశారు. అంటే, ఇక నుంచి పీఎఫ్ ఖాతాదారులు ఎప్పటిలాగే తమ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ స్టేట్‌మెంట్లను ఆన్‌లైన్‌లో ఈజీగా చూసుకోవచ్చు.

డేటాబేస్ కలపడం, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ పనుల కోసం జూన్ చివరి వారం నుంచి ఈ పోర్టల్‌ను తాత్కాలికంగా ఆపేశారు. ఇప్పుడు అప్‌గ్రేడ్ ప్రాసెస్ పూర్తి కావడంతో మళ్లీ పోర్టల్ లైవ్‌లోకి వచ్చింది. అయితే, ప్రస్తుతం రీసెంట్‌గా ప్రాసెస్ చేసిన అకౌంటింగ్ సంవత్సరాల ట్రాన్సాక్షన్లు మాత్రమే పోర్టల్‌లో కనిపిస్తున్నాయని అధికారులు ఒక నోటీసులో స్పష్టం చేశారు. పాత సంవత్సరాల డేటా కూడా త్వరలోనే అప్‌డేట్ అవుతుందని, దీని కోసం యూజర్లు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సర్వీసులను మెరుగుపరచడమే టార్గెట్
Image Credit : Gemini AI

సర్వీసులను మెరుగుపరచడమే టార్గెట్

ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ పనితీరును మరింత పెంచడానికి, సెక్యూరిటీని స్ట్రాంగ్ చేయడానికి, నమ్మకాన్ని పెంపొందించడానికి జూన్ 26 నుంచి ఈ మైగ్రేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. మెంబర్స్, ఎంప్లాయర్స్ కోసం సర్వీసులను విడతల వారీగా రీస్టార్ట్ చేసినప్పటికీ, అదనపు వెరిఫికేషన్లు, వాలిడేషన్ చెక్స్ వల్ల పీఎఫ్ క్లెయిమ్‌లు, ఇతర సర్వీస్ రిక్వెస్ట్‌లలో రాబోయే రెండు వారాల పాటు కొద్దిగా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని సంస్థ తెలిపింది.

Related Articles

Related image1
Mutton Health Risks: మీరు తినే మటన్‌లో ఈ పార్ట్స్ ఉన్నాయా? అయితే మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే
Related image2
Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?
36
జూలై 15 నుంచి అకౌంట్లలోకి వడ్డీ పైసలు
Image Credit : Gemini AI

జూలై 15 నుంచి అకౌంట్లలోకి వడ్డీ పైసలు

ఆర్థిక సంవత్సరం 2025-26 కు గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8.25 శాతం వార్షిక వడ్డీని జూలై 15 నుంచి సబ్‌స్క్రైబర్ల అకౌంట్లలో వేయడానికి ఈపీఎఫ్ఓ రెడీ అవుతోంది. కరెక్ట్‌గా వడ్డీ క్రెడిట్ అయ్యే టైమ్‌కంటే ముందే ఈ పోర్టల్ అందుబాటులోకి రావడం విశేషం. ఈ నెల ప్రారంభంలోనే అప్‌గ్రేడ్ చేసిన యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను కూడా ఫేజ్ ల వారీగా అందుబాటులోకి తెచ్చారు.

46
యూఏఏన్ యాక్టివేషన్ ప్రాసెస్‌లో మార్పులు
Image Credit : Asianet News

యూఏఏన్ యాక్టివేషన్ ప్రాసెస్‌లో మార్పులు

యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) యాక్టివేషన్ ప్రాసెస్‌లో ఈపీఎఫ్ఓ ఒక కీలక మార్పు చేసింది. ఇకపై పాత పద్ధతిలో యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ద్వారా యూఏఎన్ యాక్టివేట్ చేయడం కుదరదు. దీని కోసం మెంబర్స్ కచ్చితంగా ఉమాంగ్ (UMANG) మొబైల్ యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా మాత్రమే యాక్టివేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

56
ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా?
Image Credit : Gemini

ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా?

మీ ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ బ్యాలెన్స్‌ను అఫీషియల్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సులువుగా చెక్ చేసుకోవచ్చు. లేదా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా చూడొచ్చు. ఇవేవీ కాదనుకుంటే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి 9966044425 కు కేవలం ఒక మిస్డ్ కాల్ ఇచ్చి కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

66
ఈపీఎఫ్ఓ ఈ పాస్‌బుక్ ఎలా ఓపెన్ చేయాలో స్టెప్ బై-స్టెప్ ప్రాసెస్..
Image Credit : Pixabay

ఈపీఎఫ్ఓ ఈ పాస్‌బుక్ ఎలా ఓపెన్ చేయాలో స్టెప్ బై-స్టెప్ ప్రాసెస్..

• స్టెప్ 1: మొదట ఈపీఎఫ్ఓ మెంబర్ పాస్‌బుక్ అఫీషియల్ పోర్టల్‌లోకి వెళ్ళండి.

• స్టెప్ 2: హోంపేజీ డాష్‌బోర్డ్‌లో కుడి వైపున ఉన్న 'E-passbook' ఐకాన్‌పై క్లిక్ చేయండి.

• స్టెప్ 3: ఇది మిమ్మల్ని ఆన్‌లైన్ పాస్‌బుక్ లింక్‌కి రీడైరెక్ట్ చేస్తుంది.

• స్టెప్ 4: అక్కడ మీ UAN నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.

• స్టెప్ 5: ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి 'Sign-in' పై క్లిక్ చేయండి.

• స్టెప్ 6: ఇప్పుడు మీ స్క్రీన్ పై పీఎఫ్ పాస్‌బుక్ కనిపిస్తుంది. దాన్ని చూసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral News: బీటెక్ చ‌దివి, 20 కిలోల బ‌రువు ఎత్త‌గ‌లిగితే ఉద్యోగం.. వైర‌ల్ అవుతోన్న జాబ్ పోస్ట్
Recommended image2
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? రూ.3లక్షలకు చేరువలో వెండి
Recommended image3
Gold Price Hike: పండుగ రోజే బంగారం షాక్.. ఒక్కరోజులో రూ.1,210 పెరుగుదల
Related Stories
Recommended image1
Mutton Health Risks: మీరు తినే మటన్‌లో ఈ పార్ట్స్ ఉన్నాయా? అయితే మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే
Recommended image2
Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved