MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • EPF: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు పండగలాంటి వార్త.. ఫోన్‌పే, గూగుల్‌ పేతో పీఎఫ్‌ అమౌంట్‌ విత్‌డ్రా

EPF: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు పండగలాంటి వార్త.. ఫోన్‌పే, గూగుల్‌ పేతో పీఎఫ్‌ అమౌంట్‌ విత్‌డ్రా

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉంటుంది. ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు పీఎఫ్‌ అకౌంట్‌ కచ్చితంగా ఉంటుంది. ప్రతీ నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం, సదరు సంస్థ కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంటుంది. ఈ మొత్తంపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ అందిస్తుంటుంది. ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త మార్పులు చేస్తున్న ఈపీఎఫ్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.. 
 

Narender Vaitla | Published : Mar 06 2025, 11:30 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

కనీసం 20 మంది ఉద్యోగులు ఉన్న ప్రతీ సంస్థ తప్పనిసరిగా ఈపీఎఫ్‌లో నమోదు చేసుకోవాలి. అలాగే రూ. 15 వేల కంటే ఎక్కువ వేతనం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రతీ ఉద్యోగికి పీఎఫ్‌ అకౌంట్‌ నెంబర్‌ ఉంటుంది. నెలనెల ఈ అకౌంట్‌లో డబ్బు జమ అవుతుంటుంది. ఉద్యోగి పదవి విరమణ తర్వాత ఈ పీఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగి తన పీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. 
 

24
Asianet Image

ఇందుకోసం ఉద్యోగులు ఈపీఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం కాస్త పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో క్లెయిమ్స్‌ రిజక్ట్‌ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. 2024 ఈపీఎఫ్‌ యాన్యువల్ రిపోర్ట్‌ ప్రకారం ప్రతీ మూడు క్లెయిమ్‌లకు ఒకటి రిజెక్ట్‌ అవుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీఎఫ్‌ విత్‌డ్రా సమస్యలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 

34
Asianet Image

పీఎఫ్‌ విత్‌డ్రా సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్గనైజేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇకపై నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు. మరో రెండు నెలల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో యూజర్లు యూపీఐ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ ఖాతాదారులు గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎమ్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌తో పీఎఫ్‌ అకౌంట్‌ను లింక్‌ చేసుకొని తమ సేవింగ్స్‌ను వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. 
 

44
Asianet Image

ఇందులో భాగంగానే ఈపీఎఫ్‌ఓ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతోంది. అలాగే పీఎఫ్‌ మొత్తాన్ని నేరుగా ఏటీఎమ్‌ ద్వారా కూడా విత్‌డ్రా చేసుకునే వీలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈపీఎఫ్‌ 3.0లో భాగంగా 2025 జూన్‌ నుంచి ఏటీఎమ్‌ ద్వారా పీఎఫ్‌ సొమ్ములను విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వారాల సమయం పడుతుండగా కొత్తగా తీసుకొస్తున్న మార్పులతో క్షణాల్లోనే మీ సేవింగ్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories