LPG Gas Cylinder Price: తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు
LPG Gas Cylinder Price: ఆగస్టు 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు రూ. 33.50 తగ్గాయి. న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇంటి వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరల్లో రూ.33.50 తగ్గింపు
ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా వాణిజ్య ఉపయోగం కోసం వాడే 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. రూ.33.50 తగ్గింపును ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు నేషనల్ ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తూ ఢిల్లీ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1631.50గా నిర్ధారించాయి. అయితే, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపెనీలు తెలిపాయి.
🔻 LPG Price Cut Alert!
Oil marketing companies slash prices of 19kg commercial LPG cylinders by ₹33.50–₹34.50 across metros, effective Aug 1.
New rates:
Delhi – ₹1631.50
Mumbai – ₹1582.50
Kolkata – ₹1734.50
Chennai – ₹1789.00
No change in domestic LPG rates. #LPG…— DD News (@DDNewslive) August 1, 2025
KNOW
గతంలో కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ ధరల్లో మార్పులు
జులై 1న కూడా కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో రూ.58.50 తగ్గింపు ను ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మొత్తం రూ.176 తగ్గింపు నమోదు అయింది. ఏప్రిల్ 1న బెంగళూరులో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1836.50 ఉండగా, ఆగస్టు 1కి అది రూ.1704.50కి తగ్గింది.
గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు
ఇక 14.2 కిలోల గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఈ ధరలు అలాగే రూ.868.50 వద్ద నిలిచాయి. గృహ వినియోగం కోసం 14.2 కిలోల సిలిండర్ ధరలు ప్రధాన నగరాల్లో గత నెలతో పోలిస్తే ఏటువంటి మార్పు లేదు. న్యూ ఢిల్లీ లో ఈ సిలిండర్ ధర రూ. 853, ముంబైలో రూ. 852.50, చెన్నైలో రూ. 868.50, బెంగళూరులో రూ. 855.50, హైదరాబాద్‌లో రూ. 905 గా ఉన్నాయి.
అయితే, వ్యాపార అవసరాలకు ఉపయోగించే 19 కిలోల సిలిండర్ల ధరల్లో రూ. 33.50 వరకు తగ్గుదల చోటు చేసుకుంది. న్యూ ఢిల్లీ లో కామర్షియల్ సిలిండర్ ధర రూ. 1,631.50కి పడిపోయింది. ముంబైలో రూ. 1,582.50, చెన్నైలో రూ. 1,789, హైదరాబాద్‌లో రూ. 1,852 లకు తగ్గింది. ఇది వ్యాపార రంగానికి కొంత రిలీఫ్ ఇస్తుంది.
కమర్షియల్ ఎల్‌పీజీ ధర తగ్గింపుతో వ్యాపార రంగాని ఊతం
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధరల తగ్గింపుతో చిరు వ్యాపారాలకు ఊతం లభించనుంది. ప్రధానంగా ఆహార సేవల రంగం, హోటల్, రెస్టారెంట్‌లకు సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. నిర్వహణ వ్యయాలు తగ్గడంతో వ్యాపారులు తమ లాభాలను పెంచుకోవచ్చు లేదా ఈ ఆదా ప్రయోజనాలను వినియోగదారులకు అందించవచ్చు.
ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా ఎల్పీజీ ధరల్లో మార్పులు
ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్ ప్రభావం ఎల్పీజీ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రష్యా నుండి భారతదేశానికి ఆయిల్ దిగుమతులు తగ్గుతున్నాయి, అమెరికా సుమారు 25 శాతం టారిఫ్ లు విధించింది. ఎగుమతిపై పన్నులు విధించడం వంటి కారణాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ధరల్లో మార్పులు భారీగానే ఉంటాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
⛽ Friday Evening Fuel Price Update
U91: 152.9
P95: 162.9
P98: 169.9
E10: 151.9
DSL: 164.9
LPG: 85.5
🔗 For more information visit https://t.co/XHOmm4b3SYpic.twitter.com/8vVfBdeCzc— Refinery (@RefineryFYI) August 1, 2025