- Home
- Business
- Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Success Story: మట్టి కుండలో టీ అమ్మే చిన్న ఆలోచన...ఇప్పుడు వందల కోట్ల వ్యాపారంగా మారింది. ముగ్గురు యువకులతో మొదలైన ప్రయాణం...దేశాలు దాటి విస్తరించింది. 650 కి పైగా బ్రాంచ్ లతో ఏటా రూ.100 కోట్ల ఆదాయం సాధిస్తున్న బిజినెస్ సక్సెస్ స్టోరీ ఏంటో చూద్దాం.

ఐఏఎస్ కలను వదిలేసి పెట్టిన టీ కొట్టు
చాలామందికి టీ తాగడం ఒక అలవాటు. రోజుకు నాలుగైదు సార్లు తాగుతారు. కొంతమందైతే టీ కోసం చాలా దూరం వెళ్తుంటారు. కానీ ముగ్గురు స్నేహితులకు మాత్రం టీ…బిజినెస్ గా మారింది. అలాంటి, ఇలాంటి బిజినెస్ కాదు..కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా మూవీలాగా. అంటే వీళ్ల టీ బిజినెస్ కూడా దేశాలు దాటింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 650 బ్రాంచ్‌లున్న పెద్ద బిజినెస్ సామ్రాజ్యానికి పునాది వేసింది.
అనుభవ్ దూబే, ఆనంద్ నాయక్ ఇద్దరూ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవారు. ఆ ప్రభుత్వ ఉద్యోగాల కలను పక్కనపెట్టి, సొంతంగా బిజినెస్ చేయాలని డిసైడ్ అయ్యారు. తర్వాత వీళ్లతో రాహుల్ పాటిదార్ కూడా కలిశాడు. ఈ ముగ్గురూ కలిసి 2016లో ఇండోర్‌లో కేవలం రూ.3 లక్షలతో 'చాయ్ సుట్టా బార్' స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది రూ.100 కోట్ల ఆదాయం తెచ్చే టాప్ కంపెనీగా ఎదిగింది.
ఇండోర్ టు ఇంటర్నేషనల్
2016లో ఇండోర్‌లో ఒకే ఒక్క చిన్న షాపుతో మొదలైన ఈ కంపెనీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్లో 650కి పైగా బ్రాంచ్‌లను రన్ చేస్తోంది. కెనడా, నేపాల్, యూఏఈ (UAE) లాంటి విదేశాల్లో కూడా తమ బ్రాంచ్‌లను సక్సెస్‌ఫుల్‌గా ఓపెన్ చేసింది. ముగ్గురు ఫ్రెండ్స్, ఒక చిన్న ఐడియా, కేవలం రూ.3 లక్షల పెట్టుబడితో మొదలై.. ఈరోజు రూ.100 కోట్ల బ్రాండ్‌గా ఎదిగిన 'చాయ్ సుట్టా బార్' సక్సెస్ జర్నీ నేటి యువతకు ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్.
సెకండ్ హ్యాండ్ ఫోన్ల నుంచి టీ బిజినెస్ దాకా..
ఫుడ్ బిజినెస్‌లోకి రాకముందు, ఈ ఫ్రెండ్స్ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొని అమ్మేవాళ్లు. తర్వాత కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఇండియన్స్ ఎమోషన్‌తో ముడిపడి ఉన్న టీనే వాళ్ల బిజినెస్‌కు మెయిన్ పాయింట్‌గా ఎంచుకున్నారు. మన సంప్రదాయం ఉట్టిపడేలా తక్కువ ధరకే ఫుడ్, డ్రింక్స్ ఇవ్వడమే వీళ్ల టార్గెట్. పేరులో 'చాయ్ సుట్టా బార్' అని ఉన్నా, వీళ్ల కెఫేల్లో స్మోకింగ్ చేయడానికి అస్సలు పర్మిషన్ లేదు.
మట్టి కుండలో ఇచ్చే 'కుల్హడ్ చాయ్' వీళ్ల బ్రాండ్‌ను జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. మెల్లగా తులసి, అల్లం, చాక్లెట్, కేసర్ లాంటి ఫ్లేవర్లలో టీని పరిచయం చేశారు. వాటితో పాటు పాస్తా, బర్గర్, నూడుల్స్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ కూడా మెనూలో యాడ్ చేశారు.
'చాయ్ సుట్టా బార్' సక్సెస్ సీక్రెట్ ఇదే..
జనాలకు తక్కువ ధరకే టీ, స్నాక్స్ ఇవ్వడమే వీళ్ల బిజినెస్ మోడల్ సక్సెస్‌కు మెయిన్ రీజన్. ఇక్కడ ఒక కప్పు టీ కేవలం రూ.15, కాఫీ రూ.20 నుంచి అమ్ముతారు. కోల్డ్ కాఫీ, షేక్స్ రూ.70 నుంచి దొరుకుతాయి.
బ్రాంచ్‌లను పెంచడానికి వీళ్లు ఫ్రాంచైజీ మోడల్‌ను ఫాలో అయ్యారు. బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ముందే ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్లకు 15 రోజుల పాటు పూర్తి ట్రైనింగ్ ఇస్తారు. దీనివల్ల కంపెనీ తన సొంత ఖర్చుతో బ్రాంచ్‌లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే, చాలా తక్కువ టైమ్‌లో దేశవ్యాప్తంగా బ్రాంచ్‌లను పెంచగలిగింది. ఆలోచన, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ ముగ్గురు నిరూపించారు. నేటి యువతకు మార్గదర్శకులుగా నిలిచారు.

