- Home
- Business
- Car Loan: న్యూ ఇయర్‌లో కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులివే
Car Loan: న్యూ ఇయర్‌లో కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులివే
Car Loan: ఒకప్పుడు కారు అనేది విలాస వస్తువు. కానీ ఇప్పుడు అవసరంగా మారింది. బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తుండడంతో చాలా మంది కారు కలను నిజం చేసుకుంటున్నారు. కారు రుణంపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ వసూలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్బీఐ కార్ లోన్ వడ్డీ రేట్లు
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీకే కారు లోన్‌లు అందిస్తున్నాయి. ఈ బ్యాంక్ 8.70 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్ అందిస్తోంది. మీ సిబిల్ స్కోర్ బాగుంటే లోన్ మొత్తం తక్కువగా ఉంటే వడ్డీ రేటు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. కస్టమర్ ప్రొఫైల్ ఆధారంగా ఎస్బీఐ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా కార్ లోన్ వివరాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా 8.15 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో కార్ లోన్ ఇస్తోంది. ఇది ప్రభుత్వ రంగ బ్యాంక్ కావడంతో తక్కువ వడ్డీ రేట్ల కోసం చూస్తున్నవారికి మంచి ఎంపికగా చెప్పొచ్చు. సిబిల్ స్కోర్ బాగుంటే.. ఈ రేటు ఇంకా ప్రయోజనకరంగా మారుతుంది.
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల కార్ లోన్ రేట్లు
ప్రైవేట్ బ్యాంకులలో ఐసీఐసీఐ బ్యాంక్ 8.5 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో కార్ లోన్ ఇస్తోంది. లోన్ మొత్తం, సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ మారుతుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విషయానికి వస్తే.. 8.55 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో కార్ లోన్ అందిస్తోంది. కస్టమర్ ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా రేట్లు నిర్ణయిస్తారు.
అతి తక్కువ వడ్డీ ఇస్తున్న కెనరా బ్యాంక్
కారు లోన్‌లను అత్యంత తక్కువ వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకుల్లో కెనరా మొదటి వరుసలో ఉంది. ఈ బ్యాంకు 7.70 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో కార్ లోన్ అందిస్తోంది. లోన్ మొత్తం, సిబిల్ స్కోర్, రిపేమెంట్ కాలం వంటి అంశాలపై వడ్డీ రేటు మారే అవకాశం ఉంటుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
కారు లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లోన్ తీసుకునే ముందు కేవలం వడ్డీ రేటు మాత్రమే కాకుండా. ప్రాసెసింగ్ ఫీజు, లోన్ కాలపరిమితి, ఈఎంఐ భారం వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఇక మొత్తం రుణం కాకుండా కొంత మొత్తాన్ని డౌన్ పేమెంట్ చెల్లిస్తే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

