MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Recharge plan: అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 6 నెలల వ్యాలిడిటీ.. తక్కువ ధరలోనే. సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌

Recharge plan: అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 6 నెలల వ్యాలిడిటీ.. తక్కువ ధరలోనే. సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌

ప్రస్తుతం టెలికం రంగంలో తీవ్రపోటీ నెలకొంది. దీంతో కంపెనీలు యూజర్లను ఆకర్షించే క్రమంలో సరికొత్త ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ వరుసలో అనూహ్యంగా దూసుకొచ్చింది ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌. అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్స్‌తో యూజర్లను తనవైపు తిప్పుకుంటే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Narender Vaitla | Published : Mar 05 2025, 10:26 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Asianet Image

ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తన నెట్‌వర్క్‌ని శరవేగంగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఈ ఏడాది ప్రథమార్థంలో ఏకంగా లక్ష టవర్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 5జీ నెట్‌వర్క్‌ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సన్నాహాలు చేస్తోంది. గడిచిన నెలలో ఏకంగా 65,000 4జీ టవర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

23
Asianet Image

ఇలా ఓవైపు నెట్‌వర్క్‌ విస్తృతిని పెంచుతూనే మరోవైపు ఆకర్షణీయమైన రీఛార్జ్‌ ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే 70 రోజులు, 90 రోజులు, 150 రోజులు, 160 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే యూజర్లను దృష్టిలో పెట్టుకొని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్స్‌ను పరిచయం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 6 నెలల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. 
 

33
Asianet Image

రూ. 897తో ఈ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే యూజర్లు ఏకంగా 6 నెలల వ్యాలిడిటీ పొందుతారు. ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే ఆరు నెలల వరకు మళ్లీ రీఛార్జ్‌ చేయాల్సిన పని ఉండదు. ఇక బెనిఫిట్స్‌ విషయానికొస్తే ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 180 రోజుల పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. అదే విధంగా డేటా విషయానికొస్తే మొత్తం 90 జీబీ డేటా లభిస్తుంది. అయతే రోజువారీ ఎలాంటి లిమిట్ లేకుండా ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్నెట్‌ వేగం 40కేబీపీఎస్‌కు తగ్గుతుంది. 
 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories