- Home
- Business
- BSNL: ఆపరేషన్ సింధూర్‌కి గౌరవంగా బీఎస్ఎన్ఎల్ శౌర్య సమర్పణ ఆఫర్: సైన్యం కోసం విరాళం కూడా ఇందులో ఉంది
BSNL: ఆపరేషన్ సింధూర్‌కి గౌరవంగా బీఎస్ఎన్ఎల్ శౌర్య సమర్పణ ఆఫర్: సైన్యం కోసం విరాళం కూడా ఇందులో ఉంది
BSNL: పాక్ ఉగ్రమూకల అంతు చూసేందుకు భారత్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కి గౌరవసూచకంగా బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. శౌర్య సమర్పణ పేరుతో విడుదల చేసిన ఈ రీఛార్జ్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
బీఎస్ఎన్ఎల్ శౌర్య సమర్పణ ఆఫర్
ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే ప్రజల ఆదరణ పొందింది. తక్కువ ధరకే చక్కటి ఆఫర్లు అందిస్తూ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు భారతీయ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కి గౌరవసూచకంగా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. దీని పేరు బీఎస్ఎన్ఎల్ శౌర్య సమర్పణ ఆఫర్.
బీఎస్ఎన్ఎల్ శౌర్య సమర్పణ వ్యాలిడిటీ ఎంత?
బీఎస్ఎన్ఎల్ శౌర్య సమర్పణ ఆఫర్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అంటే 11 నెలలు ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ ఆఫర్ ఉపయోగించుకోవచ్చన్న మాట. ఆ ఆఫర్ ని రీఛార్జ్ చేసుకుంటే 11 నెలలు అన్‌లిమిటెడ్ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు, 24 GB డేటా లభిస్తుంది.
సైన్యానికి విరాళంగా 2.5 % డబ్బు
బీఎస్ఎన్ఎల్ శౌర్య సమర్పణ ఆఫర్ రీఛార్జ్ చేసుకోవాలంటే రూ.1,499 చెల్లించాలి. ఇది దాదాపు ఒక సంవత్సరం ప్లాన్. దీనిలో 5% మొత్తాన్ని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు, సైన్యానికి అందిస్తోంది. అంటే రీఛార్జ్ మొత్తంలో 2.5 % డబ్బును సైన్యానికి విరాళంగా ఇస్తుంది. అదే విధంగా దేశాన్ని గౌరవిస్తూ ఈ ఆఫర్ రీఛార్జ్ చేయించుకున్నందుకు గాను వినియోగదారునికి మరో 2.5 % డబ్బును బహుమతిగా ఇస్తుంది.
బీఎస్ఎన్ఎల్ శౌర్య సమర్పణ ఆఫర్ నెలకు రూ.137 మాత్రమే
రూ.1,499 చెల్లించి బీఎస్ఎన్ఎల్ శౌర్య సమర్పణ ఆఫర్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారునికి రూ.37.50 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ప్రతి రీఛార్జ్ పై సైన్యానికి మరో రూ.37.50 బహుమతిగా బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ పీరియడ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంది.
బీఎస్ఎన్ఎల్ శౌర్య సమర్పణ ఆఫర్ రీఛార్జ్ చేసుకుంటే దాదాపు ఏడాది పాటు ఎలాంటి రీఛార్జ్ టెన్షన్స్ లేకుండా ఉండొచ్చు. రూ.1,499 ఖర్చు పెడితే 11 నెలలకు నెలకు రూ.137 ఖర్చు పెట్టినట్టు అవుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ బీఎస్ఎన్ఎల్ సేవలు
బీఎస్ఎన్ఎల్ ఇటీవలి కాలంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. తక్కువ ధరకే రీఛార్జ్‌లు అందించడంతో పాటు టవర్ల సంఖ్యను భారీగా పెంచింది. దీంతో గ్రామీణ ప్రాంతంలోనైనా నెట్‌వర్క్ అందుబాటులో ఉంటోంది. మీరుగాని బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లోకి మారాలన్నా, బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాలన్నా ఇదే మంచి టైం. సైన్యానికి సాయం చేసినట్టు అవుతుంది. తక్కువ ధరకు రీఛార్జ్ లభిస్తుంది.