BSNL: ఎయిర్టెల్, జియోలను ఢీకొట్టేలా బీఎస్ఎన్ఎల్ రూ.599 ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ తో ఎక్కువ డేటా, వ్యాలిడిటీ, మొదలైన సౌకర్యాలు పొందొచ్చు. ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
మీరు బడ్జెట్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్‌ను ఓ సారి పరిశీలించండి. జియో, ఎయిర్టెల్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ చాలా తక్కువ ధరకే కాకుండా చాలా మంచి బెనిఫిట్స్‌తో వస్తుంది.

ఎయిర్టెల్, జియో ప్లాన్స్ ధర ఎంతంటే..?
జియో 84 రోజుల ప్లాన్ సింపుల్ ప్లాన్ రూ.448 నుంచి మొదలవుతుంది. అదే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, డేటాతో కూడిన ప్లాన్ రూ.799 నుంచి మొదలవుతుంది. ఇదే 84 రోజుల ప్లాన్ ఎయిర్టెల్ లో అయితే రూ.979 ధరతో వస్తుంది. ఇందులో రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాల్స్, 2GB డేటా ఉంటుంది. దీంతో పాటు OTT బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కానీ ఎయిర్టెల్, జియోతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ 84 రోజుల ప్లాన్ చాలా చౌకగా ఉంది. బీఎస్ఎన్ఎల్ రూ.600 కంటే తక్కువ ధరకే 3GB డేటా, కాల్స్, SMS బెనిఫిట్స్‌తో 84 రోజుల ప్లాన్‌ను అందిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ రూ.599 ప్లాన్
బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో రూ.599 ప్లాన్ గురించి సమాచారం ఇచ్చింది. దాని ప్రకారం కేవలం రూ.599కే కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ లభిస్తాయి. అంతేకాకుండా 84 రోజులకు రోజుకు 3GB డేటా కూడా లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ రూ.599కే రోజుకు 3GB డేటాతో ప్లాన్‌ను అందిస్తోంది.

ఎయిర్టెల్, జియో కంటే సూపర్ ప్లాన్ ఇది
ఎయిర్టెల్ రోజుకు 3GB డేటాతో కూడిన ప్రధాన రీఛార్జ్ ప్లాన్స్ రూ.449, రూ.838, రూ.1798 ధరలలో ఉన్నాయి. అతి తక్కువ ధర రూ.449 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
జియో కూడా రూ.449 ప్లాన్‌ను 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఇందులో రోజుకు 3GB డేటా ఉంటుంది. కానీ ఈ రెండు కంపెనీల ప్లాన్స్ కూడా బీఎస్ఎన్ఎల్‌తో పోలిస్తే ఖరీదైనవే.

జియో, ఎయిర్టెల్ లో 84 రోజుల ప్లాన్ ఏంటి?
జియోలో రూ.1,199 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో పాటు OTT బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 90 రోజులకు లభిస్తుంది.
ఎయిర్టెల్ అయితే రూ.1,798 ప్లాన్‌ను 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఇందులో కస్టమర్లకు రోజుకు 3GB డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, వింక్‌లో ఉచిత హలోట్యూన్స్, నెట్‌ఫ్లిక్స్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
అందువల్ల జియో, ఎయిర్టెల్ తో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ చాలా తక్కువ ధరకే ఎక్కువ డేటా, వ్యాలిడిటీ తదితర బెనిఫిట్స్ ఇస్తోంది.
