MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • 'జంప్‌డ్‌ డిపాజిట్‌ స్కామ్‌' పేరుతో కొత్త రకం మోసం.. యూపీఐ ద్వారా డబ్బులు పంపించి.

'జంప్‌డ్‌ డిపాజిట్‌ స్కామ్‌' పేరుతో కొత్త రకం మోసం.. యూపీఐ ద్వారా డబ్బులు పంపించి.

సైబర్‌ నేరాలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు, మీడియా ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఓ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా మోసం.? ప్రజలను ఎలా బురిడి కొట్టిస్తున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Narender Vaitla
Published : Jan 10 2025, 12:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
cyber crime

cyber crime

మారిన కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారింది. మారి టెక్నాలజీ మనుషుల శ్రమను తగ్గించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదే సమయంలో ఈ టెక్నాలజీని దుర్వినియం చేస్తూ కేటుగాళ్లు అమాయకులను దోచుకుంటారు. డిజిటల్‌ అరెస్ట్‌, ఓటీపీ స్కామ్‌, ఓఎల్‌ఎక్స్‌ స్కామ్‌ ఇలా రకరకాల పేర్లతో మోసాలకు దిగుతున్నారు.

దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు రంగంలోకి దిగుతున్నాయి. డిజిటల్‌ అరెస్ట్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాలర్‌ ట్యూన్స్‌ ద్వారా కూడా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇదిలా ఉంటే తాజాగా కొత్త రకం మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. జంప్‌డ్‌ డిపాజిట్‌ స్కామ్‌ పేరుతో అమాయకులను నిండా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవల ఇలాంటి మోసాల బారినపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంతకీ ఏంటీ జంప్‌డ్‌ డిపాజిట్‌ స్కామ్‌.? ఈ స్కామ్‌ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

34

యూపీఐ ద్వారా..

ప్రస్తుతం యూపీఐ సేవలు భారీగా విస్తరించిన విషయం తెలిసిందే. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్‌ల వరకు డిజిటల్ పేమెంట్స్‌ను యాక్సెప్ట్‌ చేస్తున్నాయి. ఇదిగో ఈ యూపీఐని అస్త్రంగా మార్చుకొని మోసాలకు పాల్పాడుతున్నారు. ఈ స్కామ్‌ ఎలా జరుగుతుందంటే. ముందుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి యూపీఐ ద్వారా కొంత మొత్తంలో డబ్బులు పంపిస్తారు. దీంతో బ్యాలెన్స్‌ చేసుకోవడానికి ప్రయత్నించారో అంతే సంగతులు. 

డబ్బులు వచ్చాయన్న ఆతృతతో బ్యాలెన్స్‌ చెక్‌ చేసేందుకు పిన్‌ ఎంటర్‌ చేస్తుంటారు. అయితే బ్యాలెన్స్‌ చెక్‌ చేసే సమయంలోనే యూపీఐ ఐడీలకు పేమెంట్స్‌ లింక్‌లను పంపిస్తున్నారు. దీంతో పిన్‌ ఎంటర్‌ చేయగానే మీ ఖాతాలోని డబ్బు వేరే వాళ్ల అకౌంట్‌లోకి వెళ్లిపోతుంది. 

44

ఈ జాగ్రత్తలు.. 

ఈ కొత్తరకం స్కామ్‌ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్‌లను స్పందించకూడదు. ముఖ్యంగా ఫేక్‌ పేమెంట్స్‌ లింక్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అకౌంట్‌ నుంచి డబ్బులు పోతే వెంటనే 1930 నెంబర్‌కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలి. సంఘటన జరిగిన రెండు గంటల్లోపు ఫిర్యాదు చేస్తే అధికారులు మీ అమౌంట్‌ను ఫ్రీజ్‌ చేసే అవకాశాలు ఉంటాయి. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved