సమ్మర్ వస్తోంది ఏసీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 30వేలలో బెస్ట్ ఏసీలు ఇవే..
ఎండకాలం వచ్చేస్తోంది. వాతావరణంలో అప్పుడే కొద్ది కొద్దిగా మార్పులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఏసీలు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. మరి అమెజాన్ వేదికగా రూ. 30 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఏసీలు, వాటి ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Discount on AC
ఏసీ అనగానే కనీసం రూ. 50 వేలు అయినా పెట్టాల్సిందే అన్న భావనలో ఉంటాం. అయితే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ప్రస్తుతం ఏసీలపై మంచి డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. దీంతో రూ.30 వేల లోపు కూడా ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి కొన్ని బెస్ట్ ఏసీలు, వాటిలో ఉన్న ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Panasonic 1 Ton 3 Star: పానసొనిక్ 1 టన్ 3 స్టార్ ఏసీ అసలు ధర రూ. 48,100కాగా అమెజాన్‌లో 33 శాతం డిస్కౌంట్‌తో రూ. 31,990కే లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఏసీ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్లిట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. 7 ఇన్ వన్ కన్వర్టబుల్ ట్రూ ఏఐ టెక్నాలజీని అందించారు. అలెక్సా, ఓకే గూగుల్ వంటి వాయిస్ కమాండ్స్‌తో కూడా ఈ ఏసీ పనిచేస్తుంది.
Hisense 1.5 Ton: 1.5 టన్ కెపాసిటీతో తీసుకొచ్చిన ఈ ఏసీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఏసీ అసలు ధర రూ. 48,000కాగా 38 శాతం డిస్కౌంట్‌తో రూ. 29,900కి అందుబాటులో ఉంది. ఇందులో 4 మోడ్స్ ఇంటెలిజెంట్‌తో కూడిన 4 ఇన్ వన్ కన్వర్టబుల్‌ను అందించారు. 4.85 కిలోవాట్స్ కూలింగ్ పవర్ ఈ ఏసీ సొంతం. స్లీప్ మోడ్, సెల్ఫ్ క్లీన్, క్విక్ చిల్ వంటి ఫీచర్లను ఇందులో అందించారు.
Godrej 1 Ton: ఈ ఏసీ అసలు ధర రూ. 42,990కాగా అమెజాన్‌లో 33 శాతంతో రూ. 28,990కే లభిస్తోంది. ఇందులో 5 ఇన్ వన్ కన్వర్టబుల్ కూలింగ్ టెక్నాలజీని అందించారు I-సెన్స్ టెక్నాలజీని అందించార. 3.5 కిలోవాట్స్ కూలింగ్ పవర్ ఈ ఏసీ సొంతం. 3 స్టార్ రేటింగ్‌తో ఈ ఏసీని తీసుకొచ్చారు.
Cruise 1.5 Ton 3 Star: రూ. 30 వేలలోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఏసీల్లో ఇదీ ఒకటి. ఈ ఏసీ అసలు ధర రూ. 47,900కాగా 39 శాతం డిస్కౌంట్‌తో రూ. 28,900కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఏసీలో ఇన్వర్టబుల్ స్ల్పిట్ టెక్నాలజీని అందించారు. 100 శాతం కాపర్ కన్వర్టబుల్ 4 ఇన్ 1 ను అందించారు. 1.5 టన్ కెపాసిటీ గల ఈ ఏసీ 4.8 కిలోవాట్స్ కూలింగ్ పవర్‌ను కలిగి ఉంటుంది.
Carrier 1 Ton 3 Star: ఈ ఏసీ అసలు ధర రూ. 56,900కాగా అమెజాన్‌లో 45 శాతం డిస్కౌంట్‌తో రూ. 31,490కి లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఏసీలో ఏఐ ఫ్లెక్సి కూల్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ ఫీచర్‌ను అందించారు.