- Home
- Technology
- Gadgets
- Laptops: ఫెస్టివ్ సేల్‌లో ప్రైమ్‌బుక్ ధమాకా.. రూ. 24 వేల లోపే ల్యాప్‌టాప్.. ఆఫర్లు, ఫీచర్ల వివరాలు ఇవే
Laptops: ఫెస్టివ్ సేల్‌లో ప్రైమ్‌బుక్ ధమాకా.. రూ. 24 వేల లోపే ల్యాప్‌టాప్.. ఆఫర్లు, ఫీచర్ల వివరాలు ఇవే
Laptops Under 24000: ప్రైమ్‌బుక్ ఫెస్టివ్ సేల్‌లో భాగంగా రూ. 23,990 కే ల్యాప్‌టాప్ లభిస్తోంది. అలాగే, రూ. 3,000 డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో పాటు జెన్ 2, జెన్ 3 మోడల్స్ ఆఫర్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రూ. 24 వేలకే ల్యాప్‌టాప్ అంటే నమ్ముతారా? ప్రైమ్‌బుక్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ ఆఫర్
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల రేట్లు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో తక్కువ ధరకే ల్యాప్‌టాప్ దొరికితే ఎలా ఉంటుంది? అది కూడా దసరా దీపావళి పండగ పూట బడ్జెట్ ధరలో లభిస్తే భలేగా ఉంటుంది కదా.. భారతీయ స్వదేశీ బ్రాండ్ ప్రైమ్‌బుక్ (Primebook) సరిగ్గా ఇదే ప్లాన్ చేసింది. పండగ సీజన్ సేల్స్ ప్రారంభం కాకముందే తన ల్యాప్‌టాప్‌లపై మైండ్ బ్లాకింగ్ ఆఫర్లను అనౌన్స్ చేసింది.
సాధారణంగా రూ. 50 వేల వరకు ఉండే ఫీచర్లను రూ. 25 వేల ఆఫర్ ధరకే అందిస్తున్నట్లు కంపెనీ చెప్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌లో ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి హెవీ గేమింగ్ లేదా ఎడిటింగ్ కోసం కాకుండా, రోజూవారీ పనులకు, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఈ ల్యాప్‌టాప్ ఆఫర్లు, ప్రాసెసర్లు, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రైమ్‌బుక్ 2 నియో: కేవలం రూ. 23,990 లకే దొరికే బడ్జెట్ ల్యాప్‌టాప్
ఈ ఫెస్టివ్ సేల్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ ప్రైమ్‌బుక్ 2 నియో (Primebook 2 Neo). ఫ్లిప్‌కార్ట్‌లో దీని ప్రారంభ ధరను రూ. 23,990 గా నిర్ణయించారు. ఈ మోడల్‌పై కంపెనీ డైరెక్ట్‌గా రూ. 3,000 డిస్కౌంట్ ఇస్తోంది. ఇది కాకుండా ఇన్స్టంట్ బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ద్వారా మరో రూ. 1,500 నుంచి రూ. 2,000 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు.
ఈ ప్రైమ్‌బుక్ 2 నియో ల్యాప్‌టాప్‌లో MediaTek Helio G99 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్ బరువు కేవలం 990 గ్రాములు మాత్రమే ఉంటుంది. 11.6 ఇంచుల హెచ్ డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 29.6Wh బ్యాటరీ దీని సొంతం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7.5 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
ప్రైమ్‌బుక్ 2 ప్రో, మ్యాక్స్: పెద్ద స్క్రీన్, బిగ్ బ్యాటరీ
బాగా పెద్ద స్క్రీన్, ఎక్కువ ప్రొడక్టివిటీ కావాలనుకునే వారి కోసం కంపెనీ ప్రైమ్‌బుక్ 2 ప్రో (Primebook 2 Pro), ప్రైమ్‌బుక్ 2 మ్యాక్స్ (Primebook 2 Max) మోడల్స్‌ను తెచ్చింది.
• Primebook 2 Pro: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దీని ధర రూ. 26,990 గా ఉంది. రూ. 2,000 తగ్గింపు కూడా. ఇందులో MediaTek Helio G99 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ఉంటాయి.
• Primebook 2 Max: ఈ మోడల్ 128GB వేరియంట్ రూ. 27,990 కి (రూ. 3,000 తగ్గింపుతో) లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ ఇది ఒకే ధరకు దొరుకుతుంది. ఇందులో 15.6 ఇంచుల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. దీనిలోని 60.3Wh బ్యాటరీ ఏకంగా 12 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
ఈ రెండు మోడళ్లలో ఫుల్ హెచ్ డీ డిస్‌ప్లే, బ్యాక్‌లిట్ కీబోర్డ్, 1440p వెబ్‌క్యామ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ వర్క్, బ్రౌజింగ్ చేసే వారికి ఇవి చాలా హెల్ప్‌ఫుల్ గా ఉంటాయి.
నెక్స్ట్ లెవెల్ ఏఐ ఫీచర్లతో ప్రైమ్‌బుక్ 3 మ్యాక్స్
కొత్త జనరేషన్ హార్డ్‌వేర్, ఏఐ ఫీచర్లు కోరుకునే వారి కోసం కంపెనీ 'ప్రైమ్‌బుక్ 3 మ్యాక్స్' (Primebook 3 Max) మోడల్‌ను పరిచయం చేసింది. సేల్‌లో దీని 128GB మోడల్ దాదాపు రూ. 33,490 నుండి రూ. 33,990 మధ్యలో లభిస్తుంది.
ఇది పాత మోడల్స్ కంటే డిఫరెంట్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. ఇందులో MediaTek Genio 720 ప్రాసెసర్, 8GB LPDDR5 RAM, 128GB UFS స్టోరేజ్ ఉన్నాయి. 8th Gen MediaTek NPU ద్వారా ఇది 9 TOPS వరకు ఏఐ కంప్యూటింగ్ సపోర్ట్ ఇస్తుంది. 5MP కెమెరా, వైఫై 6, బ్లూటూత్ 5.3 వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 1.59 కేజీలు కాగా, 60.3Wh బ్యాటరీతో 12 గంటల ప్లేబ్యాక్ ఇస్తుంది.
ప్రైమ్‌ఓఎస్ విప్లవం: విండోస్ కాకుండా ఆండ్రాయిడ్ ఎలా పనిచేస్తుంది?
ఈ ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకత ఏమిటంటే ఇవి రెగ్యులర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడవవు. ప్రైమ్‌బుక్ తన సొంత 'PrimeOS'ను ఉపయోగిస్తుంది. ప్రైమ్‌బుక్ 2 సిరీస్‌లోని PrimeOS 3.0 అనేది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రూపుదిద్దుకుంది. పెద్ద స్క్రీన్, కీబోర్డ్, ట్రాక్‌పాడ్ వాడకానికి అనుగుణంగా దీనిని డిజైన్ చేశారు.
దీనివల్ల మనం ఫోన్‌లో వాడే ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ డైరెక్ట్‌గా ల్యాప్‌టాప్‌లోనే రన్ అవుతాయి. సొంత యాప్ స్టోర్ ద్వారా 50,000 కి పైగా ఆండ్రాయిడ్ యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. ఒకవేళ విండోస్ సాఫ్ట్‌వేర్స్ వాడాలనుకుంటే 'Cloud PC' ఆప్షన్ కూడా ఉంది. క్లౌడ్ పిసి ద్వారా విండోస్, లైనక్స్ ఎన్విరాన్మెంట్‌ను ఉపయోగించవచ్చు. అయితే దీనికి విడిగా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు, ఇంటర్నెట్ అవసరం పడతాయి.
ఈ ల్యాప్‌టాప్ ఎవరికి పర్ఫెక్ట్?
ల్యాప్‌టాప్ కొనేముందు మీ అవసరాలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది అందరికీ సెట్ అయ్యే సాధారణ విండోస్ ల్యాప్‌టాప్‌కు ప్రత్యామ్నాయం కాదు.
• ఎవరు కొనవచ్చు: ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులు, డాక్యుమెంట్ వర్క్, యూట్యూబ్ లేదా ఓటీటీ వీడియోలు చూసేవారు, సాధారణ ఆఫీస్ పని, ఆండ్రాయిడ్ యాప్స్ వాడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
• ఎవరు తీసుకోకూడదు: హెవీ విండోస్ సాఫ్ట్‌వేర్‌లు, ప్రోఫెషనల్ వీడియో ఎడిటింగ్, హెవీ గేమింగ్ లేదా కేవలం ఆండ్రాయిడ్‌లో లేని ప్రత్యేక యాప్‌లపై ఆధారపడేవారు ఈ ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండటమే మంచిది.
పండగ సేల్‌లో తక్కువ బడ్జెట్‌లో ప్రాథమిక అవసరాల కోసం ల్యాప్‌టాప్ కావాలనుకుంటే ప్రైమ్‌బుక్ ఆఫర్లు మంచి ఎంపికగా నిలుస్తాయని చెప్పాలి.

