MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Best 5G Phones: రూ.12,000 బడ్జెట్‌లో 3 సూపర్ 5G ఫోన్లు.. దీపావళికి భారీ తగ్గింపు ధరలు

Best 5G Phones: రూ.12,000 బడ్జెట్‌లో 3 సూపర్ 5G ఫోన్లు.. దీపావళికి భారీ తగ్గింపు ధరలు

Best 5G Phones: దీపావళికి తక్కువ బడ్జెట్లో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? లేదా మీ బంధువులు, స్నేహితులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే రూ.12,000 బడ్జెట్‌లో దొరికే 3 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 28 2026, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
CMF ఫోన్ 1 (CMF Phone 1)
Image Credit : CMF by Nothing Twitter

CMF ఫోన్ 1 (CMF Phone 1)

కొత్త డిజైన్, స్టైలిష్ లుక్ కోరుకునే వారికి 'Nothing' సబ్-బ్రాండ్ తీసుకొచ్చిన CMF Phone 1 బెస్ట్ గిఫ్ట్. దీని స్క్రూ డిజైన్, మార్చుకోవడానికి వీలుండే బ్యాక్ ప్యానెల్ మార్కెట్‌లోని మిగతా ఫోన్ల కంటే దీనికి మంచి అట్రాక్టివ్ లుక్ ఇస్తాయి.

ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.67 అంగుళాల Super AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. MediaTek Dimensity 7300 5G ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్.. రోజువారీ వాడకానికి, మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు చాలా బాగా సెట్ అవుతుంది.

కెమెరా విషయానికొస్తే, వెనుకవైపు 50MP Sony మెయిన్ కెమెరా, ముందువైపు 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఎక్కువసేపు వాడుకోవడానికి వీలుగా 5000mAh బ్యాటరీ కూడా ఇచ్చారు. దీని ధర సుమారు రూ.14,999 వరకు ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మోటరోలా మోటో G85 5G (Motorola Moto G85 5G)
Image Credit : Motorola India/X

మోటరోలా మోటో G85 5G (Motorola Moto G85 5G)

ప్రీమియం లుక్ ఉన్న ఫోన్ కావాలనుకునే వారికి Motorola Moto G85 5G మంచి ఆప్షన్. తక్కువ ధరలోనే ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఉండే కర్వ్‌డ్ డిస్‌ప్లే, వీగన్ లెదర్ ఫినిష్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ ఫోన్‌లో Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్‌తో కూడిన 6.67 అంగుళాల 3D కర్వ్‌డ్ pOLED (120Hz) డిస్‌ప్లే ఇచ్చారు. ఇది Qualcomm Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

కెమెరా పరంగా చూస్తే, OIS టెక్నాలజీతో కూడిన 50MP Sony LYTIA 600 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు క్లియర్‌గా ఫోటోలు తీసే 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. OIS ఫీచర్ ఉండటం వల్ల వీడియోలు, ఫోటోలు తీసేటప్పుడు కెమెరా షేక్ అవ్వకుండా ఉంటుంది.

అలాగే, Dolby Atmos సపోర్ట్ ఉన్న స్పీకర్లు, 5000mAh బ్యాటరీ దీనికి అదనపు ఆకర్షణ. ఫెస్టివల్ ఆఫర్‌లో దీని ధర రూ.15,999 గా ఉంది.

33
వివో T3x 5G (Vivo T3x 5G)
Image Credit : Vivo website

వివో T3x 5G (Vivo T3x 5G)

ఇంట్లో ఉండే పెద్దవాళ్లకు, పేరెంట్స్‌కు, మొబైల్‌లో ఎక్కువసేపు వీడియోలు చూసేవారికి Vivo T3x 5G బాగా సెట్ అవుతుంది. పదే పదే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఇందులో పెద్ద బ్యాటరీ ఇచ్చారు.

ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల Full HD+ (120Hz) స్క్రీన్, Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ ఉన్నాయి. ఇందులోని 6000mAh మెగా బ్యాటరీ ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. అలాగే, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

ఫోటోల కోసం 50MP రియర్ కెమెరా, మంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇందులో ఉన్నాయి. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ కేవలం 7.99mm మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.12,499 గా ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329
AUSAUS
(52.3 ov)186/4
Day 2 - Session 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
DA Hike: ఉద్యోగులకు దీపావళి కానుక.. 3 శాతం డిఏ పెంపు.. జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Recommended image2
ఇండియ‌న్ రైల్వే సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాత్రి 11 త‌ర్వాత మొబైల్ ఛార్జింగ్ బంద్
Recommended image3
Jio IPO Listing: జియో ఫ్లాట్‌ఫామ్స్ బ్లాక్‌బస్టర్ ఎంట్రీ.. షేర్ మార్కెట్‌లో రికార్డు ప్రీమియంతో లిస్టింగ్
Related Stories
Recommended image1
మీ బాల్కనీని సీతాకోకచిలుకల తోటగా మార్చే చిట్కాలు.. ఎలాంటి మొక్కలు పెంచాలంటే..
Recommended image2
Shani Transit: శని సంచారంతో వచ్చే 218 రోజుల పాటు ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved