MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • రూ.15 లక్షల పెట్టుబడి.. రూ.22 లక్షల ఆదాయం! FD కన్నా చాలా బెటర్ స్కీమ్ ఇది

రూ.15 లక్షల పెట్టుబడి.. రూ.22 లక్షల ఆదాయం! FD కన్నా చాలా బెటర్ స్కీమ్ ఇది

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించాలని మీరు అనుకుంటే మీకు సరైన స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC) పథకం. ఇందులో ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 27 2025, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రూ.1,000 లతో ఈ స్కీమ్‌లో చేరొచ్చు
Image Credit : Gemini

రూ.1,000 లతో ఈ స్కీమ్‌లో చేరొచ్చు

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) అనేది ఒక చక్కటి ప్రభుత్వ పథకం. ఇది మీరు పెట్టిన పెట్టుబడికి 5 సంవత్సరాల్లో స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. ఈ ప్రభుత్వ పథకాన్ని దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసులలో ఎక్కడైనా మీరు ప్రారంభించవచ్చు. కనీసం రూ.1000తో ఇందులో మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్ లో గొప్ప విషయం ఏంటంటే ఇందులో గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. లిమిట్ లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ట్యాక్స్ కూడా కట్టక్కరలేదు..
Image Credit : social media

ట్యాక్స్ కూడా కట్టక్కరలేదు..

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఐదేళ్ల పాటు 7.7 శాతం వార్షిక వడ్డీ పొందవచ్చు. ఈ వడ్డీని ఏటా కలుపుతారు. మెచ్యూరిటీ సమయంలో మొత్తం చెల్లిస్తారు.

అయితే కొన్ని పథకాలు ఎక్స్‌టెన్షన్ చేసినట్లుగా 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ సమయంలో ఈ పథకాన్ని పునరుద్ధరించలేరు. కావాలనుకుంటే మీరు కొత్త ఎన్ఎస్‌సీలో పెట్టుబడి పెట్టాలి.

36
5 సంవత్సరాలకు ఎంత లాభం
Image Credit : social media

5 సంవత్సరాలకు ఎంత లాభం

ఎన్ఎస్‌సీలో రూ.15 లక్షల పెట్టుబడిపై 5 సంవత్సరాల్లో ఎంత లాభం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.15 లక్షల పెట్టుబడిపై సంవత్సరానికి 7.7% చక్రవడ్డీ వస్తుంది. 5 సంవత్సరాలకు మెచ్యూరిటీ మొత్తం రూ.21,73,551. ఇందులో వడ్డీయే కేవలం రూ.6,73,551 ఉంటుంది.

46
రూ.1.5 లక్షలకు మాత్రమే పన్ను మినహాయింపు
Image Credit : iSTOCK

రూ.1.5 లక్షలకు మాత్రమే పన్ను మినహాయింపు

ఎన్ఎస్‌సీలో పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు రూ.1.5 లక్షల పెట్టుబడిపై మాత్రమే లభిస్తుంది. మొదటి 4 సంవత్సరాలకు ఎన్ఎస్‌సీ నుండి వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెడతారు. కాబట్టి పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దానిని తిరిగి పెట్టుబడి పెట్టలేం. కాబట్టి వడ్డీ ఆదాయంపై పన్ను స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు.

56
సంపాదించిన వడ్డీకి ట్యాక్స్ ఫైల్ చేయాలి
Image Credit : social media

సంపాదించిన వడ్డీకి ట్యాక్స్ ఫైల్ చేయాలి

ఎన్ఎస్‌సీలో చేసిన పెట్టుబడి 5 సంవత్సరాల తర్వాత అసలు, వడ్డీతో కలిపి వస్తుంది. ట్యాక్స్ పే చేసేటప్పుడు ప్రతి సంవత్సరం ఐటీఆర్(ITR)లో ఎన్ఎస్‌సీ ద్వారా సంపాదించిన వడ్డీని ఆదాయంగా చూపించాలని గుర్తుంచుకోవాలి.

66
7.7 శాతం వడ్డీ
Image Credit : iSTOCK

7.7 శాతం వడ్డీ

మీరు ఎన్ఎస్‌సీలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి 7.7 శాతం వడ్డీని పొందుతున్నారని అనుకుందాం. ప్రతి సంవత్సరం రూ.7,700 ఆదాయాన్ని ITRలో చూపించడం తప్పనిసరి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ప్రభుత్వ పథకాలు
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
SIP vs Government Schemes: రిటైర్మెంట్ డబ్బును ఈ స్కీమ్స్ లో పెట్టుబడిగా పెడితే డబ్బే డబ్బు
Recommended image2
Government Schemes పెట్టుబడికి ఇవే టాప్ ప్రభుత్వ పథకాలు.. ఇంతకు మించి వడ్డీ మరెక్కడా దొరకదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved