MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • Telangana First Airport: నిజాం కాలంలోనే నైట్ ల్యాండింగ్.. తెలంగాణ ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ ఏదో తెలుసా?

Telangana First Airport: నిజాం కాలంలోనే నైట్ ల్యాండింగ్.. తెలంగాణ ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ ఏదో తెలుసా?

Telangana First Airport: భారత స్వాతంత్ర్యానికి ముందే తెలంగాణలో విమానాలు ఏగిరాయి. మరి తెలంగాణలో మొదటి ఎయిర్‌పోర్ట్ ఏదో మీకు తెలుసా? నిజాం కాలం నాటి రికార్డులు, డెక్కన్ ఎయిర్‌వేస్ ఆసక్తికర విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 08 2026, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలంగాణ ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ బేగంపేట హిస్టరీ
Image Credit : Gemini

తెలంగాణ ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ బేగంపేట హిస్టరీ

తెలంగాణ అనగానే మనకు ఇప్పుడు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RGIA) గుర్తుకొస్తుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదిరిపోయే టెక్నాలజీతో ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌లలో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. కానీ, హైదరాబాద్ సిటీ నడిబొడ్డున దశాబ్దాల పాటు విమానాల రాకపోకలతో సందడిగా ఉన్న మన తెలంగాణ ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ ‘బేగంపేట ఎయిర్‌పోర్ట్’ గురించి మీకు తెలుసా? 1930ల్లోనే మిలియన్ల మంది ప్రయాణికులను చేరవేస్తూ, భారతదేశ విమానయాన చరిత్రలోనే ఓ రేంజ్ రికార్డులు క్రియేట్ చేసిన బేగంపేట ఎయిర్‌పోర్ట్ క్రేజీ జర్నీ వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నిజాం రాజుల కాలంలోనే సూపర్ ఎయిర్‌పోర్ట్
Image Credit : Gemini AI

నిజాం రాజుల కాలంలోనే సూపర్ ఎయిర్‌పోర్ట్

బేగంపేట ఎయిర్‌పోర్ట్ కేవలం ఒక ఎయిర్‌పోర్ట్ మాత్రమే కాదు, హైదరాబాద్ హిస్టరీలో ఒక ల్యాండ్‌మార్క్. హైదరాబాద్ చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1930లో ‘హైదరాబాద్ ఏరో క్లబ్’ ఏర్పాటుతో దీనిని స్టార్ట్ చేశారు. 1930ల కాలంలో చాలా దేశాల్లో కనీసం రన్‌వేలు కూడా సరిగ్గా లేని టైమ్‌లోనే, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ‘నైట్ ల్యాండింగ్’ ఎక్విప్‌మెంట్ ఉండేదంటే నమ్ముతారా? నిజాం రాజులు తమ పర్సనల్, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ట్రావెల్ కోసం దీనిని వాడేవారు. ఆ తర్వాత 1937లో ఇక్కడ ఒక గ్రాండ్ టెర్మినల్ బిల్డింగ్‌ను కూడా కట్టారు.

36
టాటా, నిజాంల ‘డెక్కన్ ఎయిర్‌వేస్’ క్రేజీ స్టోరీ
Image Credit : Getty

టాటా, నిజాంల ‘డెక్కన్ ఎయిర్‌వేస్’ క్రేజీ స్టోరీ

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో కేవలం 9 ఎయిర్‌లైన్స్ మాత్రమే ఉండేవి. అందులో అత్యంత పాపులర్ అండ్ ప్రీమియర్ ఎయిర్‌లైన్ ‘డెక్కన్ ఎయిర్‌వేస్ లిమిటెడ్’. దీనిని 1945లో నిజాం ప్రభుత్వం, టాటా ఎయిర్‌లైన్స్ కలిసి జాయింట్ వెంచర్‌గా స్థాపించాయి. ఈ కంపెనీలో నిజాం ప్రభుత్వానికి ఏకంగా 71 శాతం వాటా ఉంటే, మిగిలిన షేర్లు టాటా సన్స్, ఇతరుల దగ్గర ఉండేవి. జూలై 1946లో మూడు విమానాలతో ఈ ఎయిర్‌లైన్ కమర్షియల్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది.

మద్రాస్ నుంచి ఢిల్లీకి.. హైదరాబాద్, నాగ్‌పూర్, భోపాల్, గ్వాలియర్ మీదుగా వారానికి రెండు సార్లు విమానాలు నడిపేవారు. అలాగే హైదరాబాద్-బెంగళూరు మధ్య కూడా సర్వీసులు ఉండేవి. మార్చి 1947 కల్లా వీరి ఫ్లీట్‌లో 7 విమానాలు చేరాయి. అప్పటికే మద్రాస్-ఢిల్లీ ఫ్లైట్‌తో పాటు ప్రతిరోజూ హైదరాబాద్-బాంబే ఫ్లైట్ కూడా రన్ చేశారు. జూలై 1946 నుండి మే 1947 మధ్య కాలంలోనే ఈ ఎయిర్‌లైన్ ఏకంగా 11 వేల మంది ప్రయాణికులను, 51 టన్నుల కార్గోను, దాదాపు 7 టన్నుల మెయిల్‌ను చేరవేసి రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత 1953లో ఎయిర్ కార్పొరేషన్స్ యాక్ట్ కింద ఈ డెక్కన్ ఎయిర్‌వేస్‌ను మరో ఏడు ఎయిర్‌లైన్స్‌తో విలీనం చేసి ‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’గా మార్చారు.

46
క్లింటన్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’ ల్యాండింగ్ ఇక్కడే
Image Credit : Getty

క్లింటన్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’ ల్యాండింగ్ ఇక్కడే

కాలక్రమేణా బేగంపేట ఎయిర్‌పోర్ట్ రేంజ్ పెరిగిపోయింది. ప్రయాణికుల రద్దీ ఏడాదికి 45 శాతం చొప్పున పెరిగింది. ఇది అప్పట్లో ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్‌లోనే అత్యధికం. క్లోజ్ చేసే టైమ్‌కు ఇది ఇండియాలోనే 6వ బిజీయెస్ట్ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది. ఇక్కడ రోజుకు 20 వేల మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేసేవారు. 16 ఇంటర్నేషనల్, 10 డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దాదాపు 300 విమానాలు రోజు ఇక్కడ ల్యాండ్ అయ్యేవి. ఏరోబస్ A320, బోయింగ్ 737 వంటి పెద్ద విమానాలను హ్యాండిల్ చేయడానికి ఇక్కడ 13 పార్కింగ్ బేలు, ఓల్డ్ బ్లాక్ వైపు 5 నైట్ పార్కింగ్ బేలు ఉండేవి.

ఈ ఎయిర్‌పోర్ట్ హిస్టరీలోనే ఒక క్రేజీ మూమెంట్ ఏంటంటే.. 2000 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు, ఆయన అఫీషియల్ విమానం ‘ఎయిర్ ఫోర్స్ వన్’ బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే పైనే ల్యాండ్ అయ్యింది. 2005 ఫిబ్రవరిలో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ఎయిర్ బస్ A340 విమానంతో హైదరాబాద్ టు ఫ్రాంక్‌ఫర్ట్ మధ్య డైరెక్ట్ నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను కూడా ఇక్కడి నుంచే రన్ చేసింది.

56
శంషాబాద్‌కు షిఫ్ట్.. కొత్త అవతారంలో బేగంపేట
Image Credit : Getty

శంషాబాద్‌కు షిఫ్ట్.. కొత్త అవతారంలో బేగంపేట

ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడం, సిటీ మధ్యలో ఉండటంతో రన్‌వే విస్తరణకు స్కోప్ లేకపోవడంతో.. కొత్త ఎయిర్‌పోర్ట్ అవసరం పడింది. దీంతో మార్చి 23, 2008న శంషాబాద్‌లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అవ్వడంతో బేగంపేటలో కమర్షియల్ ఫ్లైట్స్ ఆపరేషన్స్ పూర్తిగా క్లోజ్ అయ్యాయి. కానీ బేగంపేట ఎయిర్‌పోర్ట్ కథ అక్కడితో అయిపోలేదు. ప్రస్తుతం ఈ విమానాశ్రయాన్ని జనరల్ అండ్ మిలిటరీ ఏవియేషన్ కోసం వాడుతున్నారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌గా, వీఐపీ విమానాల రాకపోకల కోసం, ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్స్ కోసం ఇది రన్ అవుతోంది. అలాగే ఇక్కడ నార్తన్ పార్ట్ ప్రోహిబిటెడ్ ఎయిర్‌స్పేస్ కావడం వల్ల, ట్రైనీ పైలట్లు ఎయిర్‌పోర్ట్‌కు కేవలం సౌత్ వైపు మాత్రమే ట్రైనింగ్ ఫ్లైట్స్ నడుపుతుంటారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, ఏషియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ, రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీలు ఇక్కడి నుంచే పైలట్ ట్రైనింగ్ ఇస్తున్నాయి.

66
ఇండియా ఏవియేషన్ ఎయిర్ షోస్
Image Credit : Getty

ఇండియా ఏవియేషన్ ఎయిర్ షోస్

కమర్షియల్ ఫ్లైట్స్ ఆగిపోయిన తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్ట్ సివిలియన్ ఎయిర్ షోలకు అడ్డాగా మారింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎఫ్ఐసీసీఐ సంయుక్తంగా నిర్వహించిన ఇండియాలోనే మొట్టమొదటి సివిలియన్ ఎయిర్ షో ‘ఇండియా ఏవియేషన్ 2008’ ఇక్కడే అక్టోబర్ 15-18 మధ్య గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత 2010లో జరిగిన సెకండ్ ఎడిషన్‌లో ఫ్రాన్స్ పార్ట్‌నర్ కంట్రీగా, యూఎస్ ఫోకస్ కంట్రీగా వ్యవహరించాయి. దాదాపు 200 మంది ఎగ్జిబిటర్లు, 12,000 చదరపు మీటర్ల ఏరియాలో ఈ ఈవెంట్ జరిగింది.

భారతదేశంలోనే మొదటిసారి ‘Antonov An-148’ విమానాన్ని ఇక్కడే ప్రదర్శించారు. 5 వేల మందికి పైగా బిజినెస్ విజిటర్లు, వందల మంది సీఈఓలు ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఆ తర్వాత 2012లో కూడా ఇక్కడే థర్డ్ ఎడిషన్ ఎయిర్ షో సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఏది ఏమైనా, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బేగంపేట ఎయిర్‌పోర్ట్ హిస్టరీ మాత్రం ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అని చెప్పాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
ప్రయాణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image2
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Recommended image3
Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆ ప‌న్నీర్‌పై ఏడాది నిషేధం
Related Stories
Recommended image1
Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
Recommended image2
Best Beer in India: ఇండియాలో బెస్ట్ బీర్ ఏది? బీర్ లవర్స్ టాప్ 5 ఫేవరెట్స్ ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved