MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • Bajaj Freedom 125: ప్రపంచంలో తొలి CNG బైక్‌.. కేవలం రూ. 10 వేలు చెల్లించి మీ సొంతం చేసుకోండి.

Bajaj Freedom 125: ప్రపంచంలో తొలి CNG బైక్‌.. కేవలం రూ. 10 వేలు చెల్లించి మీ సొంతం చేసుకోండి.

సీఎన్‌జీ అంటే కేవలం త్రీ వీలర్‌, ఫోర్‌ వీలర్స్‌కి మాత్రమే పరిమితం అనుకునే వాళ్లం. కానీ ఇప్పుడు ఏకంగా బైక్‌లు కూడా సీఎన్‌జీ వేరియంట్‌లో వస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టూ వీలర్‌ సంస్థ బజాజ్‌ ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ను లాంచ్‌ చేసింది. బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 పేరుతో ఈ బైక్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ బైక్‌ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..  

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 20 2025, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌గా పేరుగాంచింది బజాజ్‌ 125 ఫ్రీడమ్‌. ఈ బైక్‌ను ఇలా లాంచ్‌ చేశారో లేదో అల అమ్మకాలు జరిగాయి. అమ్మకాలపరంగా సరికొత్త రికార్డును సృష్టించిందీ బైక్‌. పెట్రోల్‌ ధరలు భారీగా పెరగడంతో ఈ బైక్‌కు మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే తక్కువ ధరలో, మంచి మైలేజ్‌ ఇస్తుండడంతో చాలా మంది ఈ సీఎన్‌జీ బైక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

24
Bajaj CNG Bike

Bajaj CNG Bike

బజాజ్‌ ఫ్రీడమ్‌ 125 సెన్‌04 డ్రమ్‌ బైక్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 89 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఈ బైక్‌ ఆన్‌రోడ్‌ ధర విషయానికొస్తే రూ. 1.3 లక్షల వరకు అవుతుంది. అయితే మీరు ఈ బైక్‌ను కేవలం రూ. 10 వేల డౌన్‌పేమెంట్‌ చెల్లించి సొంతం చేసుకోవచ్చు. మిగతా రూ. 93,657ని ఫైనాన్స్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ లోన్‌ మొత్తాన్ని మీరు తిరిగి చెల్లించే క్రమంలో నెలకు రూ. 3 వేల చొప్పున ఈఎమ్‌ఐ సెట్‌ చేసుకోవచ్చు. దీంతో మీరు మూడేళ్లపాటు ఈఎమ్‌ఐని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సులభ వాయిదాల్లో మీరు ఈ సీఎన్‌జీ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. 
 

34
Bajaj CNG Bike

Bajaj CNG Bike

ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ బైక్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. ఇందులో శక్తివంతమైన 125 సీసీ ఇంజన్‌ను అందించారు. ఈ బైక్‌ మెరుగైన పవర్‌తో పాటు మంచి మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్‌ సుమారు 90 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. డిజైన్‌ పరంగా కూడా మంచి స్టోర్టీ లుక్‌లో ఈ బైక్‌ను రూపొందించారు. అందుకే ఫ్యామిలీస్‌తో పాటు యువతను కూడా ఈ బైక్‌ ఆకట్టుకుంటుందని కంపెనీ చెబుతోంది. 

ఇది కూడా చదవండి: ఎన్నిసార్లు కింద పడ్డా ఈ ఫోన్‌కి ఏం కాదు.. రూ. ఆరు వేలలో అదిరిపోయే ఫీచర్లు..

44
Bajaj CNG Bike

Bajaj CNG Bike

జాజ్‌ ఫ్రీడమ్‌ 125 బైక్‌లో డిజిటల్‌ డిస్‌ప్లే, ఎల్‌ఈడీ లైట్స్‌తో పాటు కంఫర్టబుల్‌గా ఉండే సీటింగ్‌ను అందించారు. దీంతో ఎక్కువ దూరమైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. ఈ బైక్‌ 9.4 పీఎస్ పవర్, 9.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కలిపి, స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 2 కిలోల సీఎన్జీ ట్యాంక్ ఉన్నాయి. సీఎన్‌జీ, పెట్రోల్‌ కలిపి ఈ బైక్‌ మొత్తం 300 కిలోమీటర్లు వెళ్లగలదు.  

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
BMW ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్
Recommended image2
Hero HF Deluxe: రూ. 70 వేల‌లో 70 కిలోమీట‌ర్ల మైలేజ్‌.. డెలివ‌రీ బాయ్స్ ఈ బైక్ కొంటే పండ‌గే
Recommended image3
New Bajaj Chetak : మార్కెట్ షేక్ చేస్తున్న కొత్త చేతక్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved