MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • ఎలక్ట్రిక్ స్కూటర్లకు లైసెన్స్ ఎందుకు అవసరం ఉండదు.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా.?

ఎలక్ట్రిక్ స్కూటర్లకు లైసెన్స్ ఎందుకు అవసరం ఉండదు.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా.?

Electric Scooter: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. అయితే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 22 2026, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తక్కువ వేగం ఉన్న స్కూటర్లకు లైసెన్స్ అవసరం లేదు
Image Credit : Gemini AI

తక్కువ వేగం ఉన్న స్కూటర్లకు లైసెన్స్ అవసరం లేదు

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లను వాటి వేగం, మోటార్ సామర్థ్యం ఆధారంగా వర్గీకరించింది. కొన్ని స్కూటర్లు "లో-స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు" కేటగిరీలోకి వస్తాయి. సాధారణంగా గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. ఇలాంటి వాహనాలను తక్కువ ప్రమాదకర వాహనాలుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. అందుకే వాటికి ప్రత్యేక మినహాయింపులు కల్పించింది

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రభుత్వం ఈ సడలింపు ఎందుకు ఇచ్చింది?
Image Credit : Asianet News

ప్రభుత్వం ఈ సడలింపు ఎందుకు ఇచ్చింది?

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన వినియోగాన్ని నియంత్రించడం కోసం ఈవీలను ప్రోత్సహిస్తోంది. లో-స్పీడ్ స్కూటర్లు సాధారణంగా కాలనీలు, పట్టణ ప్రాంతాలు, చిన్న దూరాల ప్రయాణాలకు ఉపయోగపడతాయి. వీటి వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదాల అవకాశం కూడా తక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రజలు సులభంగా ఈ వాహనాలను ఉపయోగించేందుకు లైసెన్స్ నిబంధనలను సడలించింది.

Related Articles

Related image1
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Related image2
భార‌త్‌లో ప‌గ‌టిపూట కూడా బైక్ లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి.? ఈ నిబంధ‌న ఎందుకో తెలుసా.?
35
లైసెన్స్ లేకున్నా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
Image Credit : Google

లైసెన్స్ లేకున్నా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని చెప్పడం వల్ల ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని కాదు. ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా, ఇతర వాహనం అయినా రోడ్డు భద్రతా నియమాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి. ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, అతివేగంగా నడపకపోవడం, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించ‌డం వంటివి క‌చ్చితంగా పాటించాల్సిందే.

45
హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు వేరు నిబంధనలు
Image Credit : Google

హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు వేరు నిబంధనలు

అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఈ మినహాయింపు వర్తించదు. గంటకు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు సాధారణ మోటార్ వాహనాల కిందకు వస్తాయి. అలాంటి స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీఓ రిజిస్ట్రేషన్, వాహన బీమా, నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

55
విద్యార్థులు, యువతకు ప్రయోజనం
Image Credit : Google

విద్యార్థులు, యువతకు ప్రయోజనం

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సడలింపు వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న పట్టణాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా లాభపడుతున్నారు. లైసెన్స్ పొందడానికి సమయం, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసి ఉపయోగించగలుగుతున్నారు. అదే సమయంలో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడంలో కూడా ఈ విధానం కీలకంగా మారింది. అయితే లైసెన్స్ మినహాయింపు ఉన్నా, భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
EV scooter: ఫోన్ కంటే తక్కువ ధరలో స్కూటీ.. 150 కిలోమీటర్ల మైలేజ్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు
Recommended image2
మాటలతో కంట్రోల్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్.. రోడ్డుపై గుంతలు ఉంటే ముందే హెచ్చరిస్తుంది
Recommended image3
TVS iQube: ఓలా, ఏథ‌ర్‌ బ‌లాదూర్‌.. 10 ల‌క్ష‌ల మంది కొన్న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Related Stories
Recommended image1
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Recommended image2
భార‌త్‌లో ప‌గ‌టిపూట కూడా బైక్ లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి.? ఈ నిబంధ‌న ఎందుకో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved