MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • pulsar N125: రూ. 90 వేలకే సూపర్‌ బైక్‌.. స్టైలిష్‌ లుక్‌, స్టన్నింగ్ ఫీచర్స్‌..

pulsar N125: రూ. 90 వేలకే సూపర్‌ బైక్‌.. స్టైలిష్‌ లుక్‌, స్టన్నింగ్ ఫీచర్స్‌..

ప్రముఖ టూ వీలర్‌ కంపెనీ బజాజ్‌కి చెందిన పల్సర్‌ బైక్‌కి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా యువతకు ఈ బైక్‌ అంటే చాలా ఇష్టం. కొంటే పల్సర్‌ కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. ఎక్కువ సీసీతో కూడిన బైక్‌లను లాంచ్‌ చేస్తూ వచ్చిన పల్సర్‌ తాజాగా తక్కువ సీసీ బైక్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త స్టైలిష్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది..  

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 02 2025, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Bajaj Bike

Bajaj Bike

బజాజ్‌ కంపెనీ మార్కెట్లోకి రెండు కొత్త బైక్‌లను తీసుకొచ్చింది. స్పోర్టీలుక్‌ కోరుకునే యువత కోసం ఈ బైక్‌ను తీసుకొచ్చారు. పల్సర్‌ ఎన్‌125, పల్సర్‌ ఎన్‌ఎస్‌125 పేరుతో కొత్త బైక్‌లను తీసుకొచ్చారు. ఈ బైక్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

23
PulserN125

PulserN125

పల్సర్‌ ఎన్‌125 ఫీచర్లు ఎలా ఉన్నాయంటే: 

ఈ బైక్‌లో 124.58 సీసీ ఇంజన్‌ను అందించారు. 5 స్పీడ్‌ మ్యాన్యువల్‌తో తీసుకొచ్చిన ఈ బైక్‌లో 9.5 లీటర్స్‌ కెపాసిటీతో కూడిన ఫ్యూయల్ ట్యాంక్‌ కెపాసిటీని అందించారు. ధర విషయానికొస్తే ఈ బైక్‌ ఎక్స్ షోరూమ్‌ ధర రూ. 94,644కి అందుబాటులో ఉంది. ఇక ఇందులోనే డిస్క్‌-బ్లూటూత్ వేరియంట్ ధర రూ. 98,654గా నిర్ణయించారు. ఈ బైక్‌ 7 రంగుల్లో అందుబాటులో ఉంది. 

ఇందులో 124.53 సీసీతో కూడిన ఎయిర్‌ కూల్డ్‌ ఇంజన్‌ను అందించారు. ఇది 12బీహెచ్‌పీ వద్ద 8500 ఆర్‌పీఎమ్‌, 11 ఎన్‌ఎమ్‌ వద్ద 6000 ఆర్‌పీఎమ్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్‌ విషయానికొస్తే ఈ బైక్‌ లీటర్‌ పెట్రోల్‌కు 60 కి.మీలు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే కనీసం 56 వరకు ఇవ్వొచ్చని రివ్యూలు చెబుతున్నాయి. 
 

33
Bajaj-ns125

Bajaj-ns125

బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌125: 

బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్ 125లో సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. దీని ఎక్స్ షో రూమ్ ధర రూ .1,06,739గా ఉంది. ఈ బైక్‌లో శక్తివంతమైన 124.45 సీసీ ఇంజిన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అప్ డేటెడ్ ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లను అందించారు. హాలోజెన్ టర్న్ ఇండికేటర్ల స్థానంలో ఎల్ఇడి ఇండికేటర్లను అందించారు. డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్‌లో స్పీడోమీటర్, రియల్ టైమ్ ఫ్యూయల్ వినియోగం, ఏ గేర్‌లో ఉన్నారో చెప్పే ఇండికేటర్‌ వంటి ఫీచర్లను అందించారు. 

ఇక ఇందులో బజాజ్ రైడ్ కనెక్ట్ అప్లికేషన్ ద్వారా ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ కనెక్టివిటీని ఆప్షన్‌ను ఇచ్చారు. అలాగే మొబైల్ ఛార్జింగ్‌ కోసం యూఎస్‌బీ పోర్టును కూడా ఇచ్చారు. ఇంజన్‌ విషయానికొస్తే.. 124.45 సిసి, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఇచ్చారు. ఇది 8,500 ఆర్ పిఎమ్ వద్ద 12 బిహెచ్ పి గరిష్ట శక్తిని, 7,000 ఆర్ పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌ బాక్స్‌తో వచ్చే ఈ బైక్‌ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్స్ ఉంటాయి. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
BMW ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్
Recommended image2
Hero HF Deluxe: రూ. 70 వేల‌లో 70 కిలోమీట‌ర్ల మైలేజ్‌.. డెలివ‌రీ బాయ్స్ ఈ బైక్ కొంటే పండ‌గే
Recommended image3
New Bajaj Chetak : మార్కెట్ షేక్ చేస్తున్న కొత్త చేతక్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved