MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • TVS Jupiter Vs Honda Activa : ఈ రెండింట్లో బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్ ఏది?

TVS Jupiter Vs Honda Activa : ఈ రెండింట్లో బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్ ఏది?

ఈ దీపావళికి కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ 110, హోండా యాక్టివా 110 టాప్ ప్లేస్‌లో ఉన్నాయి… మరి వీటిలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే స్కూటర్ ఏదో ఇక్కడ తెలుసుకొండి.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 26 2026, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టీవీఎస్ జూపిటర్ vs హోండా యాక్టివా
Image Credit : x

టీవీఎస్ జూపిటర్ vs హోండా యాక్టివా

మన దేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా 110cc గేర్‌లెస్ స్కూటర్లనే వాడుతుంటారు. ఇందులోనూ టీవీఎస్ జూపిటర్ 110, హోండా యాక్టివా 110 మధ్య గట్టి పోటీ ఉంది. అయితే TVS Jupiter ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.73,400… Honda Activa ధర సుమారు రూ.75,400… రెండింటి మధ్య కేవలం రూ.2,000 మాత్రమే తేడా ఉంది. ఇలా ఒకే ధరలో లభించే ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జూపిటర్ vs యాక్టివా: ఈఎంఐ లెక్కలు
Image Credit : x

జూపిటర్ vs యాక్టివా: ఈఎంఐ లెక్కలు

పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడానికి, ఆఫీస్ ప్రయాణాలకు టివిఎస్, హోండా స్కూటర్లు బాగా సెట్ అవుతాయి… అందుకే చాలామంది వీటినే కొంటుంటారు. జూపిటర్ డ్రమ్ వేరియంట్ రూ.73,400 నుంచి స్పెషల్ ఎడిషన్ రూ.86,900 వరకు ఉంది. అదే యాక్టివా బేస్ మోడల్ రూ.75,400, డీలక్స్ రూ.85,300, స్మార్ట్ మోడల్ రూ.89,800 పలుకుతోంది.

ఈ రెండు స్కూటర్ల ఆన్-రోడ్ ధర రూ.85,000 అనుకుందాం… ఇందులో రూ.10,000 డౌన్ పేమెంట్ కట్టినా మిగతా రూ.75,000కు 10% వడ్డీతో 36 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు సుమారు రూ.2,420 కట్టాల్సి వస్తుంది. అదే 48 నెలలు పెట్టుకుంటే ఈఎంఐ రూ.1,900కి తగ్గుతుంది, కానీ రూ.4,000 అదనంగా వడ్డీ పడుతుంది.

36
ఇంజిన్ పెర్ఫార్మెన్స్: ట్రాఫిక్‌లో ఏది బెస్ట్?
Image Credit : x

ఇంజిన్ పెర్ఫార్మెన్స్: ట్రాఫిక్‌లో ఏది బెస్ట్?

టివిఎస్ జూపిటర్‌లో 113.3cc ఇంజిన్ ఉంది. ఇది 8 bhp పవర్‌ను, 'iGO అసిస్ట్' మైక్రో-హైబ్రిడ్ బూస్ట్‌తో 9.8 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇక హోండా యాక్టివాలోని 109.5cc ఇంజిన్ 7.8 PS పవర్‌ను, 9.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఉదాహరణకు ఇద్దరు పెద్దవాళ్లు, పిల్లలు స్కూల్ బ్యాగ్‌తో ఫ్లైఓవర్లు ఎక్కేటప్పుడు జూపిటర్ సులభంగా 50-55 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. మరోవైపు యాక్టివా ఇంజిన్ చాలా స్మూత్‌గా, సైలెంట్‌గా ఉంటుంది. కొత్తగా స్కూటర్ నడిపేవాళ్లకు ఇది బాగా సెట్ అవుతుంది. రెండూ 105-106 కిలోల బరువు ఉండటంతో ఇరుకు సందుల్లో కూడా ఈజీగా తిప్పొచ్చు.

46
మైలేజ్, నెలవారీ పెట్రోల్ ఖర్చు
Image Credit : x

మైలేజ్, నెలవారీ పెట్రోల్ ఖర్చు

సిటీ ట్రాఫిక్‌లో జూపిటర్ లీటరుకు 45 నుంచి 50 కి.మీ మైలేజ్ ఇస్తుంది. యాక్టివా 48 నుంచి 55 కి.మీ మైలేజ్ ఇస్తుంది. నెలకు 1,000 కి.మీ ప్రయాణం, లీటర్ పెట్రోల్ ధర రూ.110-120 గా లెక్కేసుకుందాం. జూపిటర్‌కు (48 kmpl) 20.8 లీటర్ల పెట్రోల్ (రూ.2200 - 2,400) అవసరం అవుతుంది. యాక్టివాకు (52 kmpl) 19.2 లీటర్ల పెట్రోల్ (సుమారుగా రూ.2000) పడుతుంది.

56
స్టోరేజ్ స్పేస్, ఫ్యామిలీ ఫీచర్లు
Image Credit : x

స్టోరేజ్ స్పేస్, ఫ్యామిలీ ఫీచర్లు

టీవీఎస్ జూపిటర్‌లో 33 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఇందులో రెండు హెల్మెట్లు ఈజీగా పెట్టుకోవచ్చు. యాక్టివాలో 18 లీటర్ల స్పేస్ మాత్రమే ఉంటుంది, ఒక హెల్మెట్ పడుతుంది.

జూపిటర్‌లో పెట్రోల్ కొట్టించడానికి బండి దిగాల్సిన అవసరం లేదు. చీర కట్టుకున్న మహిళలకు, పిల్లలను తీసుకెళ్లేవారికి ఇది చాలా కంఫర్ట్. జూపిటర్ టాప్ మోడల్స్‌లో సెమీ-డిజిటల్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, వెడల్పాటి ఫుట్‌బోర్డ్ ఉన్నాయి. యాక్టివా క్లస్టర్ సింపుల్‌గా ఉన్నా, దాని 'స్మార్ట్' మోడల్‌లో కీ-లెస్ రిమోట్ ఫీచర్ ఇచ్చారు.

మెయింటెనెన్స్ ఖర్చు, రీసేల్ వాల్యూ

10,000 కి.మీ సర్వీసింగ్‌కు జూపిటర్‌కు రూ.800 నుంచి రూ.1,200 వరకు ఖర్చవుతుంది. యాక్టివాకు రూ.700 నుంచి రూ.900 వరకు అవుతుంది. హోండా సర్వీస్ సెంటర్లు చిన్నచిన్న పట్టణాల్లో కూడా ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. హోండా 10 ఏళ్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని (3 ఏళ్లు స్టాండర్డ్ + 7 ఏళ్లు ఆప్షనల్) అందిస్తోంది.

ఇక రీసేల్ వాల్యూ విషయానికొస్తే, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో యాక్టివాకు విపరీతమైన డిమాండ్ ఉంది. 3, 4 ఏళ్ల తర్వాత అమ్మేసినా మంచి రేటు వస్తుంది. జూపిటర్‌కు కూడా మంచి రేటు వచ్చినా, యాక్టివా స్థాయిలో ఉండదు.

66
మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్?
Image Credit : x

మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్?

స్కూల్ బ్యాగులు, కూరగాయల సంచులు, రెండు హెల్మెట్లు పెట్టుకోవడానికి, బరువు లాగడానికి టీవీఎస్ జూపిటర్ 110 బెస్ట్ ఆప్షన్. యాక్టివాతో పోల్చితే అదనపు పెట్రోల్ ఖర్చు అనేది దీని ఫీచర్ల ముందు పెద్ద లెక్క కాదు.

స్మూత్ రైడింగ్, మంచి మైలేజ్, రీసేల్ వాల్యూ, పల్లెటూర్లలో కూడా సర్వీస్ సపోర్ట్ కావాలంటే హోండా యాక్టివా 110 సేఫ్ ఛాయిస్. హైవే ప్రయాణాలకు ఎక్కువ పవర్ కావాలనుకుంటే సుజుకి యాక్సెస్ 125 లేదా యాక్టివా 125 వైపు వెళ్లొచ్చు. కానీ రోజువారీ ఫ్యామిలీ అవసరాలకు మాత్రం టీవీఎస్ జూపిటర్ టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
బైక్ ఫుట్‌రెస్ట్ కింద చిన్న ఇనుప కడ్డీలు ఎందుకు ఉంటాయి? వాటి ఉపయోగం ఏంటంటే
Recommended image2
Helmet : ఫ్రెండ్స్‌తో హెల్మెట్ షేర్ చేసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త
Recommended image3
Best CNG Cars : 36.47 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే.. మీ బడ్జెట్‌కు ఏది సెట్ అవుతుందో చూడండి
Related Stories
Recommended image1
Honda Activa : ఒక్క నెలలో 262689 అమ్మకాలా..! ఆ స్కూటర్‌ ఏదో తెలుసా?
Recommended image2
TVS: 145 కిలోమీట‌ర్ల మైలేజ్‌, టైప్‌సీ ఛార్జ‌ర్‌.. టీవీఎస్ నుంచి అదిరిపోయే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved