MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Top EV Scooters : ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవి స్కూటర్ ఇదే... టాప్ 10 లిస్ట్ ఇదిగో

Top EV Scooters : ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవి స్కూటర్ ఇదే... టాప్ 10 లిస్ట్ ఇదిగో

సెప్టెంబర్ 2026లో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ వీలర్ల లిస్ట్‌లో టీవీఎస్ ఐక్యూబ్ టాప్ ప్లేస్ కొట్టేసింది. ఇక బజాజ్ చేతక్, హీరో విడా కూడా టాప్ లో నిలిచాయి. మరి ఏ స్కూటర్స్ సేల్స్ ఎన్నో తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Oct 26 2026, 09:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే...
Image Credit : x

సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే...

ప్రస్తుతం పెట్రోల్ ధరలు క్రమంగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. కొత్తగా వాహనం కొనాలకునేవారు ఈవి వైపే మొగ్గు చూపుతున్నారు… దీంతో సేల్స్ అమాంతం పెరుగుతున్నాయి. ఫ్యామిలీ అవసరాలకోసమే కాదు ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు కూడా ఈవి స్కూటర్లను కొంటున్నారు… మంచి పెర్పార్మెన్స్ కలిగిన స్కూటర్స్ సేల్స్ పెరుగుతున్నాయి.

ఇండియాలో గత నెల (సెప్టెంబర్ 2026) ఎలక్ట్రిక్ టూ వీలర్ల సేల్స్‌లో టీవీఎస్ ఐక్యూబ్ నంబర్ వన్ స్థానంలో నిలిచి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం ఒక్క నెలలోనే ఏకంగా 45,320 ఐక్యూబ్ స్కూటర్లను కంపెనీ డెలివరీ చేసింది. సెప్టెంబర్ 2025లో అమ్మిన 30,820 యూనిట్లతో పోలిస్తే ఇది 47% ఎక్కువ. అలాగే ఆగస్టు 2026లో అమ్ముడైన 42,882 యూనిట్లతో చూసుకుంటే 6% గ్రోత్ కనిపించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సెకండ్ ప్లేస్ లో బజాజ్ చేతక్
Image Credit : x

సెకండ్ ప్లేస్ లో బజాజ్ చేతక్

ఈ లిస్ట్‌లో బజాజ్ చేతక్ 42,394 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 2025లో అమ్మిన 30,558 యూనిట్లతో పోలిస్తే ఇది 39% ఎక్కువే అయినా, ఆగస్టులో అమ్మిన 52,248 యూనిట్లతో చూస్తే 19% తగ్గింది.

ఇక హీరో విడా 28,862 యూనిట్లతో మూడో ప్లేస్ దక్కించుకుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 15,329గా ఉన్న దీని సేల్స్ ఇప్పుడు 88% పెరిగాయి. ఆగస్టు (25,558 యూనిట్లు)తో పోలిస్తే 13% మంత్లీ గ్రోత్ సాధించింది.

ఆ తర్వాత ఏథర్ రిజ్టా 19,813 యూనిట్లతో నాలుగో స్థానంలో ఉంది. గత ఏడాది సెప్టెంబర్ (18,919 యూనిట్లు) కంటే ఇది 5% ఎక్కువ. కానీ ఆగస్టు (22,586 యూనిట్లు)తో పోలిస్తే 12% తగ్గింది.

కొత్తగా వచ్చిన టీవీఎస్ ఆర్బిటర్ 17,027 యూనిట్లతో ఐదో ప్లేస్‌లో నిలిచింది. ఆగస్టు (14,641 యూనిట్లు)తో పోలిస్తే 16% గ్రోత్ సాధించింది.

సర్వే చేసిన 16 ఈ-మోడల్స్ మొత్తం 1,86,693 యూనిట్లు డెలివరీ అయ్యాయి. ఈ లిస్ట్‌లో ఓలా ఎలక్ట్రిక్ వివరాలు లేవు… కాబట్టి మిగతా కంపెనీల డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.

35
టాప్ 10లో ఉన్న మిగతా మోడల్స్ సేల్స్ రిపోర్ట్
Image Credit : x

టాప్ 10లో ఉన్న మిగతా మోడల్స్ సేల్స్ రిపోర్ట్

ఆరో స్థానంలో ఉన్న గ్రీవ్స్ మాగ్నస్ 10,532 యూనిట్లను డెలివరీ చేసింది. ఇది గత ఏడాది సెప్టెంబర్ (6,179) కంటే 70%, ఆగస్టు (9,772) కంటే 8% ఎక్కువ.

ఏడో ప్లేస్‌లో ఉన్న ఏథర్ 450 మోడల్ 6,168 యూనిట్లు అమ్ముడైంది. ఇది ఆగస్టు సేల్స్ (6,891 యూనిట్లు) కంటే 10% తక్కువ (గత ఏడాది 450S, 450X, 450 అపెక్స్ విడివిడిగా లెక్కించినందున వార్షిక గ్రోత్ లెక్కించలేదు).

ఎనిమిదో స్థానంలో ఉన్న రివర్ ఇండీ 6,057 యూనిట్లు డెలివరీ చేసి గత ఏడాది (1,960) కంటే 209% భారీ గ్రోత్ సాధించింది. అయితే ఆగస్టు (6,567 యూనిట్లు)తో చూస్తే ఇది 8% తక్కువ.

తొమ్మిదో ప్లేస్‌లో ఉన్న కొత్త మోడల్ ఏథర్ కోణార్క్ ఆగస్టులో కేవలం 217 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, సెప్టెంబర్‌లో ఏకంగా 1,808% గ్రోత్‌తో 4,140 యూనిట్లకు దూసుకెళ్లింది.

పదో స్థానంలో ఉన్న గ్రీవ్స్ రియో 2,047 యూనిట్లు అమ్ముడైంది. ఇది గత ఏడాది (545 యూనిట్లు) కంటే 276%, ఆగస్టు (1,911 యూనిట్లు) కంటే 7% ఎక్కువ.

45
టాప్ కంపెనీల పరిస్థితి ఇదే..
Image Credit : x

టాప్ కంపెనీల పరిస్థితి ఇదే..

లిస్ట్‌లోని మొత్తం సేల్స్‌లో టాప్ 5 మోడల్స్ వాటాయే 82.2% ఉంది. బజాజ్ చేతక్‌తో పోలిస్తే టీవీఎస్ ఐక్యూబ్ తన లీడ్‌ను మరింత పెంచుకుంది. అదే సమయంలో పాపులర్ బైక్ కంపెనీల నుంచి టాప్ 3లో నిలిచిన ఏకైక బ్రాండ్‌గా హీరో విడా సత్తా చాటింది.

కంపెనీల వారీగా చూస్తే.. టీవీఎస్ (ఐక్యూబ్ & ఆర్బిటర్) మొత్తం 62,347 యూనిట్లను డెలివరీ చేసి మార్కెట్‌లో 33.4% షేర్‌ను దక్కించుకుంది. బజాజ్ (చేతక్ & యులు) 43,194 యూనిట్లు అమ్మి 23.1% వాటాను సొంతం చేసుకుంది. ఏథర్ (రిజ్టా, 450 & కోణార్క్) 30,121 యూనిట్లను డెలివరీ చేసి 16.1% షేర్ సాధించింది.

హీరో (విడా) 28,862 యూనిట్లను డెలివరీ చేసి 15.5% వాటాను పట్టుకుంది. గ్రీవ్స్ (మాగ్నస్, రియో, నెక్సస్) 13,441 యూనిట్లతో 7.2% షేర్ దక్కించుకుంది. రివర్ (ఇండీ) 6,057 యూనిట్లతో 3.2% వాటాను పొందింది. హోండా క్యూసీ1 (1,464 యూనిట్లు), యాక్టివా ఈ మోడల్స్ కలిపి మొత్తం 1,605 యూనిట్లు అమ్ముడై 0.9% షేర్ నమోదు చేశాయి. ఇవి కాకుండా సుజుకి ఈ-యాక్సెస్ (573 యూనిట్లు), యమహా ఈసీ06 (493 యూనిట్లు) మిగతా వాటాను పంచుకున్నాయి.

55
పండుగ సీజన్ సేల్స్
Image Credit : x

పండుగ సీజన్ సేల్స్

ప్రభుత్వ వాహన్ (Vahan) పోర్టల్ డేటా ప్రకారం.. సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా సుమారు 2.05 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్లు రిజిస్టర్ అయ్యాయి. మొత్తం టూ వీలర్ల రిజిస్ట్రేషన్లలో ఇది 11%. కంపెనీల వారీగా చూస్తే టీవీఎస్ సుమారు 54,000, బజాజ్ 48,500 వాహనాలను రిజిస్టర్ చేశాయి. ఏథర్ 30,500, హీరో విడా 24,300, ఓలా ఎలక్ట్రిక్ 13,450 వాహనాలను రిజిస్టర్ చేశాయి.

ఫాడా (FADA) రిలీజ్ చేసిన నవరాత్రి పండుగ సీజన్ డేటా ప్రకారం.. పండుగ 10 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 75,758 ఎలక్ట్రిక్ టూ వీలర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది పండుగ సీజన్ సేల్స్‌తో పోలిస్తే ఇది 33.41% ఎక్కువ.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
TVS Jupiter Vs Honda Activa : ఈ రెండింట్లో బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్ ఏది?
Recommended image2
బైక్ ఫుట్‌రెస్ట్ కింద చిన్న ఇనుప కడ్డీలు ఎందుకు ఉంటాయి? వాటి ఉపయోగం ఏంటంటే
Recommended image3
Helmet : ఫ్రెండ్స్‌తో హెల్మెట్ షేర్ చేసుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త
Related Stories
Recommended image1
EV Car : ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారా? బ్యాటరీ ఆదా చేసే టిప్స్ మీకోసమే
Recommended image2
EV Car : సింగిల్ ఛార్జ్‌తో 600 కి.మీ నాన్ స్టాప్ జర్నీ.. 2 టన్నుల బరువునైనా మోసే సూపర్ ఈవి కారు ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved