ఫ్యామిలీతో వెళ్లడానికి బెస్ట్ స్కూటర్ ఏది? హోండా యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్?
ఫ్యామిలీతో రోజూ ప్రయాణించడానికి మంచి స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అయితే మార్కెట్లో యాక్టివా 5G, టీవీఎస్ జూపిటర్ ఎక్కువగా పోటీ పడుతున్నాయి. ఈ రెండింట్లో ఏది కొంటే మంచిదనే అనుమానం ఎక్కువ మందికి వస్తోంది.

ఫ్యామిలీకి సెట్ అయ్యే స్కూటర్ ఏది?
ఫ్యామిలీ కోసం మంచి స్కూటర్ తీసుకోవాలనుకుంటున్నారా? సీటింగ్ కంఫర్ట్, స్పేస్, స్టెబిలిటీ వంటివి చూసి కొనుక్కోవాలంటే. ఈ విషయంలో టీవీఎస్ జూపిటర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా పొడవుగా ఉన్నవాళ్లు స్కూటర్ నడిపేటప్పుడు మోకాళ్లకు హ్యాండిల్ తగలకుండా దీని డిజైన్ బాగా సెట్ అవుతుంది. హోండా యాక్టివా 5Gతో పోలిస్తే జూపిటర్‌లో కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
హోండా యాక్టివా 5Gతో పోలిస్తే టీవీఎస్ జూపిటర్‌లో బయట నుంచే పెట్రోల్ కొట్టించుకునే వీలు, లో-ఫ్యూయల్ వార్నింగ్, అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. దీని సీటు కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అలాగే, జూపిటర్ ZX వేరియంట్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కూడా ఉంది. రోజూ వాడుకునేవాళ్లకు ఈ ఫీచర్లు భలే ఉపయోగపడతాయి.
ప్రయాణంలో ఫుల్ కంఫర్ట్
జూపిటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. దీనివల్ల గుంతల రోడ్లపై వెళ్లినా కుదుపులు లేకుండా జర్నీ స్మూత్‌గా ఉంటుంది. ఇందులో వాడిన 12 అంగుళాల టైర్లు బ్యాలెన్స్, కంట్రోల్‌కు బాగా హెల్ప్ అవుతాయి. సిటీ ట్రాఫిక్‌లో రోజూ తిరిగేవాళ్లకు ఇది మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
ఈ రెండు స్కూటర్లను కంపేర్ చేస్తే, టీవీఎస్ జూపిటర్‌లో కాళ్లు పెట్టుకోవడానికి స్థలం (లెగ్‌రూమ్) ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్లేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. కానీ సీటు కింద బూట్ స్పేస్ విషయంలో యాక్టివా 5G దే పైచేయి. జూపిటర్‌లో కేవలం 17 లీటర్ల స్పేస్ మాత్రమే దొరుకుతుంది. అంటే లెగ్‌రూమ్ ప్లస్ అయినా, స్టోరేజ్ విషయంలో కాస్త వెనుకబడింది.
ఏ స్కూటర్ తీసుకోవాలి?
పొడవుగా ఉన్నవాళ్లు, కాళ్లు పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్, కంఫర్టబుల్ సీటు కావాలనుకునేవాళ్లు కచ్చితంగా టీవీఎస్ జూపిటర్ వైపు చూడొచ్చు. ఒకవేళ మీకు బూట్ స్పేస్ ఎక్కువ కావాలంటే మాత్రం హోండా యాక్టివా 5G బెస్ట్ ఆప్షన్. ఫ్యామిలీ అవసరాలు, నడిపేవాళ్ల హైట్, బడ్జెట్ బట్టి మీకు నచ్చిన ఫీచర్లు ఉన్న స్కూటర్‌ను సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్.













