MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Automobile
  • Safety Cars : రూ.6 లక్షలలోపే 5-స్టార్ రేటింగ్ సేఫ్టీ కార్లు.. మీ ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్

Safety Cars : రూ.6 లక్షలలోపే 5-స్టార్ రేటింగ్ సేఫ్టీ కార్లు.. మీ ఫ్యామిలీ కోసం బెస్ట్ ఆప్షన్

తక్కువ బడ్జెట్‌లో మీ ఫ్యామిలీ సురక్షితంగా ప్రయాణించేందుకు మంచి కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఇండియాలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న బెస్ట్ కార్ల జాబితా మీకోసమే.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 29 2026, 08:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాప్ 5 సేఫ్టీ కార్లు ఇవే..
Image Credit : Gemini AI

టాప్ 5 సేఫ్టీ కార్లు ఇవే..

ఒకప్పుడు కొత్త కారు కొనేటప్పుడు మైలేజ్, ధరకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కుటుంబ భద్రతను దృష్టిలో ఉంచుకుని, చాలామంది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లనే ఎంచుకుంటున్నారు. మంచి విషయం ఏంటంటే ఇప్పుడు తక్కువ ధర కార్లలో కూడా ఇలాంటి సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
టాటా పంచ్ (TATA PUNCH)
Image Credit : Tatamotors

టాటా పంచ్ (TATA PUNCH)

భారత మార్కెట్లో బడ్జెట్‌లో దొరికే సురక్షితమైన కార్లలో టాటా పంచ్ ముఖ్యమైనది. దీని ప్రారంభ ధర రూ.5.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు ఇండియా NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
36
 నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)
Image Credit : Nissan official

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite)

ఇక రూ.5.65 లక్షల ప్రారంభ ధరతో లభించే నిస్సాన్ మాగ్నైట్ భద్రత విషయంలో గ్లోబల్ NCAP 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. నిస్సాన్ వెహికిల్స్ లో బలమైన బాడీ నిర్మాణం, ట్రాక్షన్ కంట్రోల్, వెహికిల్ డైనమిక్ కంట్రోల్, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి భద్రతా ఫీచర్లు ఉంటారు. అంతేకాదు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి టెక్నాలజీ ఫీచర్లు కలిగివుంటాయి.

46
టాటా ఆల్ట్రోజ్ (TATA Altroz)
Image Credit : tata motors

టాటా ఆల్ట్రోజ్ (TATA Altroz)

ఇక టాటా ఆల్ట్రోజ్ కూడా తక్కువ ధరలో మంచి సెప్టీ ఫీచర్లు కలిగిన కారు. దీని ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షలు మాత్రమే… కానీ ఇది ఇండియా NCAPలో 5-స్టార్ రేటింగ్ పొందింది. అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల వంటి ఫీచర్లు అందిస్తోంది. దీంతో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులను ఈ కారు ఆకర్షిస్తుంది.

56
 మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire)
Image Credit : stockPhoto

మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire)

కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మారుతి సుజుకి డిజైర్ ఒక ముఖ్యమైన ఆప్షన్. దీని ప్రారంభ ధర రూ.6.26 లక్షలు. ఈ కారు గ్లోబల్ NCAP, ఇండియా NCAP రెండింటిలోనూ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇందులో ABS, EBD, ESP, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.
66
టాటా నెక్సాన్ (TATA Nexon)
Image Credit : official website

టాటా నెక్సాన్ (TATA Nexon)

బడ్జెట్ ఇంకొంచెం పెంచుకోగలిగితే టాటా నెక్సాన్‌ను పరిశీలించవచ్చు. రూ.7.37 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ SUV, గ్లోబల్ NCAP, ఇండియా NCAP రెండింటిలోనూ 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, ISOFIX, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్‌ వంటి ఫీచర్లతో కుటుంబ వినియోగానికి ఇది నమ్మకమైన ఎంపికగా నిలుస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Engine: కార్లకు ఇంజన్ ముందే ఎందుకు పెడతారో తెలుసా? ఈ సీక్రెట్ లాజిక్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
Best Automatic Cars : క్లచ్ నొక్కి గేర్లు మార్చాల్సిన పనేలేదు.. రూ.10 లక్షల లోపు బడ్జెట్ లో బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే
Recommended image3
Maruti Suzuki : 35 కి.మీ మైలేజ్ తో నయా టాల్ బాయ్ కారు రెడీ.. కేవలం రూ.5 లక్షలకే వస్తుందా..!
Related Stories
Recommended image1
Car Cleaning Tips: వాషింగ్ సెంటర్ తో పనే లేదు.. 10 రూపాయలతో మీ కారును తళతళలా మెరిసేలా చేయండి
Recommended image2
Car Buying Guide : సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? అయితే జాగ్రత్త.. ఈ ఒక్కటి చెక్ చేయకపోతే బొక్కబోర్లా పడతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved