MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Automobile
  • Car Buying Guide : సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? అయితే జాగ్రత్త.. ఈ ఒక్కటి చెక్ చేయకపోతే బొక్కబోర్లా పడతారు

Car Buying Guide : సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? అయితే జాగ్రత్త.. ఈ ఒక్కటి చెక్ చేయకపోతే బొక్కబోర్లా పడతారు

తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనుకునేవారికి సెకండ్ హ్యాండ్ బెస్ట్ ఆప్షన్. కానీ చిన్నచిన్న అజాగ్రత్త వల్ల సెకండ్ హ్యాండ్ కారు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే కారు కొనేముందు డాక్యుమెంట్లు సరిగ్గా చెక్ చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 24 2026, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా?
Image Credit : gemini ai

సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా?

సామాన్య మధ్యతరగతి ప్రజలు కొత్త కారు కొనేకంటే తక్కువ ధరలో వచ్చే సెకండ్ హ్యాండ్ కారును కొనేందుకే ఇష్టపడతారు. తక్కువ బడ్జెట్ లోనే మంచిమంచి కార్లు మార్కెట్లో లభిస్తుంటాయి. ఇంజిన్ పనితీరు, కారు కండీషన్ ను టెస్ట్ డ్రైవ్ చేసి తెలుసుకోవచ్చు లేదంటే తెలిసిన మెకానిక్ తో చెక్ చేయించవచ్చు. ఇంకా పర్పెక్ట్ గా చెక్ చేసుకోవాలంటే కార్ 24, స్పిన్ని వంటి సంస్థలు ఇన్పెక్షన్ చేసిపెడతాయి. కానీ కారు డాక్యుమెంట్ సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసుకునే బాధ్యత కొనేవారిపైనే ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లోన్ ఉన్న కారు కొన్నారో అంతే సంగతి..!
Image Credit : X

లోన్ ఉన్న కారు కొన్నారో అంతే సంగతి..!

సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు డాక్యుమెంట్స్ సరిగ్గా చెక్ చేసుకోకుంటే చిక్కులు తప్పవు. అందుకే ఆ కారు లోన్ ఇంకా కట్టాల్సి ఉన్నా లేదా డాక్యుమెంట్స్ సరిగ్గా లేకున్నా అస్సలు కొనొద్దు. ఇలాంటి కారు కొంటే బ్యాంకు లేదా చట్టపరమైన సంస్థలు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మొత్తం డబ్బులు చెల్లించి కూడా కొనుగోలు చేసినవారు తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉంది.

35
బ్యాంకు NOC, ఫామ్ 35 అడగండి
Image Credit : X

బ్యాంకు NOC, ఫామ్ 35 అడగండి

వాహనం లోన్ మొత్తం తిరిగి చెల్లించేశానని అమ్మకందారుడు చెబితే కేవలం ఆ నోటిమాటలు నమ్మొద్దు. బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ జారీ చేసిన ఒరిజనల్ NOC, ఫామ్ 35 కాపీని కచ్చితంగా అడగాలి. ఈ పత్రాలు ఉంటేనే లోన్ చెల్లింపు పూర్తయినట్లు… బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థకు ఈ వాహనంపై ఎలాంటి హక్కులు లేవని అర్థం. ఇవి లేకుండా RC నుంచి బ్యాంకు పేరును తొలగించడం కుదరదు… అంటే ఈ వాహనంపై సర్వహక్కులు సదరు బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ కలిగివున్నట్లు. 

45
సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు ఈ చెక్‌లిస్ట్ ఫాలో అవ్వండి
Image Credit : PR

సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు ఈ చెక్‌లిస్ట్ ఫాలో అవ్వండి

  • సెకండ్ హ్యాండ్ వాహనం కొనేముందు తప్పకుండా RC (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్), ఓనర్‌షిప్ డాక్యుమెంట్లు సరిచూడండి.
  • కారు సర్వీస్ హిస్టరీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు గమనించండి. 
  • కారు ఓడో మీటర్‌ను పరిశీలించండి. ఇది ట్యాంపర్ చేశారేమో చెక్ చేయండి. 
  • కనీసం 5-10 కిలోమీటర్ల దూరం కారుని టెస్ట్ డ్రైవ్ చేయండి.
  •  మీకు తెలిసిన మెకానిక్‌తో వాహనాన్ని ఒకసారి చూపించండి.
55
సెకండ్ హ్యాడ్ కారు రిజిస్ట్రేషన్ కు ఈ పేపర్స్ ఉండాల్సిందే
Image Credit : AI

సెకండ్ హ్యాడ్ కారు రిజిస్ట్రేషన్ కు ఈ పేపర్స్ ఉండాల్సిందే

వాహనాన్ని మీ పేరు మీదకు మార్చేటప్పుడు బ్యాంకు NOC, సంబంధిత పత్రాలను RTOకి సమర్పించారో లేదో నిర్ధారించుకోండి. ఇలా చేస్తేనే వాహన రికార్డుల నుంచి హైపోథికేషన్ పూర్తిగా తొలగిపోతుంది... అంటే లోన్ ఇచ్చిన సంస్థలకు ఆ వాహనంపై ఎలాంటి హక్కులు ఉండవు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన సమస్యలు రాకుండా ఉంటాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Engine: కార్లకు ఇంజన్ ముందే ఎందుకు పెడతారో తెలుసా? ఈ సీక్రెట్ లాజిక్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Recommended image2
Best Automatic Cars : క్లచ్ నొక్కి గేర్లు మార్చాల్సిన పనేలేదు.. రూ.10 లక్షల లోపు బడ్జెట్ లో బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే
Recommended image3
Maruti Suzuki : 35 కి.మీ మైలేజ్ తో నయా టాల్ బాయ్ కారు రెడీ.. కేవలం రూ.5 లక్షలకే వస్తుందా..!
Related Stories
Recommended image1
Car Cleaning Tips: వాషింగ్ సెంటర్ తో పనే లేదు.. 10 రూపాయలతో మీ కారును తళతళలా మెరిసేలా చేయండి
Recommended image2
Car Tips: కారు సైడ్ అద్దాలు ఎలా సెట్ చేసుకోవాలో 90 శాతం మందికి తెలియదు.. మ‌రి మీకు.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved