- Home
- Automobile
- Dasara Offers : దసరా పండగరోజు బైక్ కొంటున్నారా? లక్ష లోపు ధరలో 80 కి.మీ మైలేజ్ ఇచ్చే 5 సూపర్ బైక్స్ ఇవే
Dasara Offers : దసరా పండగరోజు బైక్ కొంటున్నారా? లక్ష లోపు ధరలో 80 కి.మీ మైలేజ్ ఇచ్చే 5 సూపర్ బైక్స్ ఇవే
దసరా పండగపూట కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే లక్ష రూపాయల లోపు బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ధరలు, వాటి ఫీచర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

దసరాకి బైక్ ఆఫర్స్
దసరా అనేది తెలుగువారి పెద్దపండగ. అందుకే ప్రతీ పండక్కి ఏదైనా కొత్తపని చేయాలని చాలామంది భావిస్తారు. ఇక మొదటిసారి బైక్ కొనేవారు పండగరోజు కొనడం శుభసూచకంగా భావిస్తారు… అందుకే పండగపూట సేల్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఈ పండుగ టైమ్‌లో కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేసుకుంటారు.
రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో ఉంచుకుని చాలామంది తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ కోసం చూస్తుంటారు. ఈ క్రమంలో దసరా పండగ సందర్భంగా లక్ష రూపాయల లోపు దొరికే టాప్ 5 సూపర్ బైక్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.
టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ లిస్ట్‌లో టీవీఎస్ స్పోర్ట్ ఎప్పుడూ ముందుంటుంది. తక్కువ బరువు, కాంపాక్ట్ డిజైన్ వల్ల సిటీ ట్రాఫిక్‌లో దీన్ని చాలా ఈజీగా నడపొచ్చు.
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కు గరిష్ఠంగా గా 80 కి.మీ సర్టిఫైడ్ మైలేజ్ ఇస్తుంది. సాధారణ రోడ్లపై 70 కి.మీ వరకు మైలేజ్ వస్తుంది.
ధర : దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 59,100 నుంచి రూ. 59,950 వరకు ఉంటుంది.
ఫీచర్స్ : కంపెనీ ఇందులో 109.7 సీసీ ఇంజిన్, 10 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఇచ్చింది. దీని బరువు 112 కిలోలు ఉంటుంది.
బజాజ్ ప్లాటినా 100
మధ్యతరగతి కుటుంబాలు, రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారిలో బజాజ్ ప్లాటినాకు మంచి క్రేజ్ ఉంది. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించినా నడుం నొప్పి రాకుండా ఉండేలా కంపెనీ ఇందులో చాలా స్మూత్ సస్పెన్షన్ సిస్టమ్‌ను డిజైన్ చేసింది.
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కు సుమారు 75 కి.మీ వరకు సర్టిఫైడ్ మైలేజ్ ఇస్తుంది.
ధర : దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 70,511 గా ఉంది.
ఫీచర్స్ : ఇందులో 99.59 సీసీ ఇంజిన్, 11 లీటర్ల పెద్ద పెట్రోల్ ట్యాంక్ ఉన్నాయి. ఈ బైక్ బరువు 117 కిలోలు.
బజాజ్ సీటీ 110
గుంతలు, మట్టి రోడ్లపై నడపడానికి, పల్లెటూళ్లలో ఎక్కువ బరువులు మోయడానికి తగ్గట్టుగా కంపెనీ ఈ బైక్‌ను చాలా స్ట్రాంగ్ అండ్ రగ్గడ్ బాడీతో డిజైన్ చేసింది.
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కు సుమారు 70 కి.మీ సర్టిఫైడ్ మైలేజ్ ఇస్తుంది. రెగ్యులర్ వాడకంలో 60 నుంచి 70 కి.మీ వరకు మైలేజ్ వస్తుంది.
ధర : దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 74,930 గా ఉంది.
ఫీచర్స్ : ఇందులో 115.45 సీసీ పవర్‌ఫుల్ ఇంజిన్, 11 లీటర్ల పెద్ద పెట్రోల్ ట్యాంక్ ఇచ్చారు. దీని బరువు 124 కిలోలు.
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్
సామాన్యుల బడ్జెట్‌లో కాస్త స్టైలిష్ లుక్, ప్రీమియం ఫీల్, సేఫ్టీ కోరుకునే వారికి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బెస్ట్ ఆప్షన్. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్‌తో కంపెనీ ఇందులో అదనపు బ్రేకింగ్ సేఫ్టీని అందిస్తోంది.
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కు సుమారు 70 కి.మీ వరకు అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది.
ధర : దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 72,500 నుంచి రూ. 75,200 వరకు ఉంటుంది.
ఫీచర్స్ : ఇందులో 109.7 సీసీ ఇంజిన్, 10 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉన్నాయి. ఈ బైక్ బరువు 115 కిలోలు.
హీరో స్ప్లెండర్ ప్లస్
ఇండియాలో అత్యంత నమ్మకమైన, అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ లెజెండరీ బైక్ లేకుండా బడ్జెట్ బైక్స్ లిస్ట్ పూర్తి కాదు. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, ఎప్పుడు ఎక్కడ అమ్మినా మంచి రీసేల్ వాల్యూ రావడం దీని అతిపెద్ద బలం.
మైలేజ్ : లీటర్ పెట్రోల్‌కు సుమారు 70 నుంచి 73 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది.
ధర : దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 75,000 నుంచి రూ. 79,000 మధ్య ఉంటుంది.
ఫీచర్స్ : కంపెనీ ఇందులో 97.2 సీసీ i3S టెక్నాలజీ ఇంజిన్, 9.8 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఇచ్చింది.

