Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే అందరూ ఓలా ఈవీ కొనేవారు. కానీ ఇప్పుడు ఓలాకే చుక్కలు చూపించింది హీరో విడా మోడల్. ఈ ఏడాది ప్రారంభంలో నెమ్మదిగా ఉన్న అమ్మకాలు, జూలై తర్వాత భారీగా పెరిగాయి. ఓలాకు చాలా గట్టిపోటీని ఇచ్చింది.

లక్ష అమ్మకాలు దాటిన స్కూటర్
భారత్‌లో ఎలక్ట్రిక్ బైక్స్ కొనే వారి సంఖ్య అధికంగా ఉంది. వీటి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈవీ అనగానే అందరికీ ఓలా బైక్ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు ఎన్నో ఈవీ బైక్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఓలా, బజాజ్, టీవీఎస్ వంటి బ్రాండ్‌లు కూడా ఈవీ బైక్స్ అమ్ముతున్నాయి. మూడేళ్ల క్రితం హీరో సంస్థ కూడా మొదలుపెట్టింది. హీరో విడా మోడల్ ఈ ఏడాది మంచి అమ్మకాలు సాధించింది. విడా బైక్స్ 2025లో లక్ష యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి.
హీరో విడా బైకులు
మూడేళ్లుగా ఈ బైక్ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. హీరో మోటోకార్ప్ ఈ ఏడాదిలో భారీగా అమ్మకాలు చేసింది. వాహన్ పోర్టల్ డేటా ప్రకారం, జనవరి 1 నుండి డిసెంబర్ 5 వరకు 1,00,383 విడా స్కూటర్లు డెలివరీ అయ్యాయి.
మొత్తం అమ్మకాలు
2022 నవంబర్ నుండి 2024 డిసెంబర్ వరకు 55,033 యూనిట్లు మాత్రమే అమ్మగలిగారు. కానీ 2025 మొదటి 11 నెలల 5 రోజుల్లోనే లక్ష అమ్మకాలు పూర్తయ్యాయి. ఇది మొత్తం అమ్మకాల్లో 65శాతం. ఈ ఏడాది విడా మోడల్ భారీగా అమ్ముడయ్యాయి.
అయిదు రోజుల్లో ఎన్ని అమ్ముడయ్యాయి?
ఈ సంవత్సరం ప్రారంభంలో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నా, జూలై అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. జనవరిలో 1,626 యూనిట్లు అమ్ముడవ్వగా, అక్టోబర్‌లో 16,017 యూనిట్లను అమ్మి రికార్డు సృష్టించింది. ఇక ఈ నెల డిసెంబర్ మొదటి 5 రోజుల్లో 1,984 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఓలాను దాటేసింది
ఈ హీరో బైక్… ఓలా బైక్ కు గట్టి పోటీ ఇచ్చింది. జనవరిలో 7వ స్థానంలో ఉన్న హీరో కంపెనీ, నవంబర్‌లో ఓలాను దాటి 4వ స్థానానికి చేరింది. 2025లో హీరో 8 శాతం మార్కెట్ వాటాతో టాప్ 5 కంపెనీలలో ఒకటిగా నిలిచింది.

