Royal Enfield Hunter 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350: ధర తగ్గిందోచ్!
మిడ్ సెగ్మెంట్ లో కుర్రకారు బాగా ఇష్టపడే ద్విచక్రవాహనాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ ఒకటి. దూరప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. యూత్ ఫేవరెట్ బైక్ అయిన హంటర్ 350 మోడల్ భారీ తగ్గింపు ధరతో అందిస్తున్నారు. సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధర రూ.1.70 లక్షల నుంచి మొదలవుతుంది. కానీ, హంటర్ 350 మోడల్‌ను కంపెనీ తక్కువ ధరకే అందిస్తోంది. దాని ధర, ఫీచర్స్ తెలుసుకుందాం రండి.

లాంగ్ డ్రైవ్స్ ప్రత్యేకం
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే అందరికీ ఇష్టమే. బైక్ కొంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉండాలనుకుంటారు. ప్రతిరోజు వాడటానికి లేదా లాంగ్ రైడ్స్‌కి ఎన్‌ఫీల్డ్ బెస్ట్. రీసెంట్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ రిలీజ్ చేసిన బైక్ హంటర్ 350. ఈ బైక్ ధర చాలా తక్కువ. స్టైలిష్ లుక్, మంచి పర్ఫార్మెన్స్ దీని సొంతం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ధర
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొనాలంటే ఇదే మంచి టైమ్. ఎందుకంటే కొనేవాళ్లకి ఇప్పుడు కంపెనీ మంచి ఆప్షన్స్ ఇస్తోంది. బేసిక్ మోడల్ హంటర్ 350 రెట్రో ఫ్యాక్టరీ ధర కేవలం రూ.1,49,900 మాత్రమే.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఫీచర్స్
ఈ బైక్ 20.2 bhp పవర్, 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. కాబట్టి ప్రమాదాలు జరిగే ఛాన్స్ తక్కువ. అంతేకాదు, ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు.
హంటర్ 350 మెట్రో వేరియంట్ ఫీచర్స్
మెట్రో వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇందులో రెండు టైర్లకు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ J-ప్లాట్‌ఫార్మ్ మీద తయారు చేశారు. రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ సూపర్ ఉంటుంది.