- Home
- Automobile
- Best Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs యమహా XSR 155.. మైలేజ్, స్పీడ్, కంఫర్ట్, ధర విషయాల్లో ఏది బెస్ట్?
Best Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs యమహా XSR 155.. మైలేజ్, స్పీడ్, కంఫర్ట్, ధర విషయాల్లో ఏది బెస్ట్?
యమహా XSR 155, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌ల మైలేజ్, స్పీడ్, బరువు, ఫీచర్లు, ధరలను ఇక్కడ పోల్చి చూద్దాం... రైడింగ్ కి ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుందో తెలుసుకుందాం.

రెట్రో లుక్‌లో రెండు బైక్‌లు.. ఏది బెస్ట్?
పాతకాలం స్టైల్లో ఉండే కొన్ని బైక్స్ ఇప్పుడు చాలా పాపులర్. ఈ విషయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ముందుంటాయి. అయితే యమహా వంటి కంపెనీలు కూడా పాతకాలం మోడల్స్ ను పోలిన రెట్రో లుక్ బైక్‌లను తీసుకువస్తున్నాయి. ఇలాంటి బైక్స్ ని ఇష్టపడేవారికి ఈ రెండు కంపెనీల్లో అనేక ఆప్షన్స్ లభిస్తాయి.
అయితే ప్రస్తుతం రెట్రో బైక్స్ విషయంలో యమహా XSR 155, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మధ్య గ ట్టి పోటీ నెలకొంది. ఈ రెండింటి డిజైన్, పెర్ఫార్మెన్స్, రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో ప్రత్యేకంగా ఉంటాయి. ఇంజిన్ కెపాసిటీ, మైలేజ్, స్పీడ్, బరువు, కంఫర్ట్ విషయాల్లో రెండింటికీ తేడాలున్నాయి. మరి రోజువారీ ప్రయాణాలకు, లాంగ్ డ్రైవ్‌లకు ఏది సెట్ అవుతుందో చూద్దాం.
ఇంజిన్, స్పీడ్.. ఏది ముందుంది?
యమహా XSR 155 బైక్ 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 10,000 rpm వద్ద 18.4 hp పవర్‌ను, 7,500 rpm వద్ద 14.2 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
మరోవైపు హంటర్ 350 బైక్ 349cc ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6,100 rpm వద్ద 20.2 hp పవర్‌ను, 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ను ఇస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
హంటర్ 350 ఎక్కువ టార్క్ ఇస్తుంది కానీ స్పీడ్‌లో XSR 155 ముందుంది. 0-100 కి.మీ వేగాన్ని XSR 155 కేవలం 11.66 సెకన్లలో అందుకుంటే, హంటర్ 350కి 15.15 సెకన్లు పట్టింది. అంటే యమహా XSR తొందరగా స్పీడ్ అందుకుంటుంది.. మెరుపువేగంతో దూసుకెళ్లగలదన్నమాట.
మైలేజ్.. XSR 155 దే పైచేయి
పెట్రోల్ ఖర్చు చూసుకునేవారికి మైలేజ్ చాలా ముఖ్యం. ఈ విషయంలో యమహా XSR 155 అదరగొడుతుందట. రోడ్ టెస్ట్‌లో XSR 155 సిటీలో 50.3 కి.మీ, హైవేపై 51.7 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
రాాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 మైలేజ్ విషయం వెనకబడింది… సిటీలో 30.6 కి.మీ, హైవేపై 39.8 కి.మీ మైలేజ్ నమోదు చేసింది. దీన్నిబట్టి మైలేజ్‌లో XSR 155 క్లియర్‌గా ముందుంది. అయితే ట్రాఫిక్, రోడ్డు కండిషన్, డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి మైలేజ్ మారుతుంది.
బరువు, సీట్ హైట్.. ఏది ఈజీ?
ఈ రెండు బైక్‌ల బరువులో చాలా తేడా ఉంది. యమహా XSR 155 బరువు కేవలం 137 కిలోలు. హంటర్ 350 బరువు 181 కిలోలు. అంటే హంటర్ 350 కంటే XSR 155 సుమారు 44 కిలోలు తక్కువ.
దీంతో సిటీ ట్రాఫిక్‌లో XSR 155ను హ్యాండిల్ చేయడం ఈజీ. కానీ హంటర్ 350 సీట్ హైట్ 790 mm కాగా, XSR 155 సీట్ హైట్ 810 mm. కాబట్టి తక్కువ ఎత్తు ఉన్నవారికి హంటర్ 350 కంఫర్ట్‌గా ఉంటుంది.
రైడింగ్ పొజిషన్ చూస్తే XSR 155 కొంచెం స్పోర్టీగా, హంటర్ 350 రిలాక్స్‌డ్‌గా ఉంటాయి.
ఫీచర్లు, సస్పెన్షన్.. ఎలా ఉన్నాయి?
యమహా XSR 155 మోడ్రన్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కాల్/మెసేజ్ అలర్ట్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఫుల్ LED లైట్స్ ఉన్నాయి. VVA టెక్నాలజీ, USD ఫ్రంట్ ఫోర్క్ కూడా ఇచ్చారు.
హంటర్ 350 ట్రెడిషనల్ డిజైన్, సింపుల్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో డిజిటల్-అనలాగ్ మీటర్, డ్యూయల్ ఛానల్ ABS, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఉన్నాయి. కొన్ని వేరియంట్లలో ట్రిప్పర్ నావిగేషన్ కూడా దొరుకుతుంది.
సస్పెన్షన్ పరంగా హంటర్ 350 గుంతల రోడ్లపై మంచి కంఫర్ట్ ఇస్తుంది. XSR 155 సస్పెన్షన్ కొంచెం హార్డ్‌గా ఉంటుంది.
ధర, ముగింపు.. ఎవరికి ఏది సెట్ అవుతుంది?
యమహా XSR 155 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.50 లక్షలు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వేరియంట్లను బట్టి రూ.1.38 లక్షల నుంచి రూ.1.71 లక్షల వరకు ఉంది.
ఇవి అంచనా ధరలు మాత్రమే, కొనేముందు ఆఫర్లు చెక్ చేసుకోవాలి.
మొత్తంగా స్పీడ్, మైలేజ్, తక్కువ బరువు, మోడ్రన్ ఫీచర్లు కావాలనుకునేవారికి యమహా XSR 155 బెస్ట్ ఆప్షన్. ఎక్కువ టార్క్, తక్కువ సీట్ హైట్, రిలాక్స్‌డ్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునేవారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 పర్ఫెక్ట్ ఛాయిస్. మీ అవసరం, డ్రైవింగ్ స్టైల్‌ను బట్టి సరైన బైక్ ఎంచుకోండి.





