- Home
- Automobile
- SUV Car : 4.6 మీటర్ల పొడవు, 210 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్.. లగ్జరీ సెవెన్ సీటర్ కారు వచ్చేస్తోంది
SUV Car : 4.6 మీటర్ల పొడవు, 210 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్.. లగ్జరీ సెవెన్ సీటర్ కారు వచ్చేస్తోంది
రెనాల్ట్ కంపెనీ 4.6 మీటర్ల పొడవు, 7 సీటింగ్ కెపాసిటీతో తన కొత్త 'బిగ్‌స్టర్' ఎస్‌యూవీని ఇండియాలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సూపర్ కారులోని స్పెషల్ ఫీచర్లు, ధర గురించి ఇక్కడ తెలుసుకుందాం.

రెనాల్ట్ బిగ్‌స్టర్ 7 సీటర్ ఎస్యూవీ
ఇండియాలో ఎస్యూవీ (SUV) కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెనాల్ట్ కంపెనీ తన కార్ల లైనప్‌ను పెంచాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే 3 వరుసల సీటింగ్ ఉండే కొత్త బిగ్‌స్టర్ (Bigster) ఎస్‌యూవీని వచ్చే ఏడాది ఇండియాలో లాంచ్ చేసేందుకు రెనాల్ట్ సిద్దమవుతోంది.
విదేశాల్లో డాసియా (Dacia) బ్రాండ్ పేరుతో అమ్ముడవుతున్న ఈ కారు, మన దగ్గర రెనాల్ట్ బ్రాండ్‌తో రాబోతోంది. కొత్త డస్టర్ కంటే పెద్దగా ఉండే ఈ ఎస్యూవీ, ఫ్యామిలీ కస్టమర్లను ఆకట్టుకునేలా 6, 7 సీటర్ ఆప్షన్లతో వస్తోందట.
రెనాల్ట్ బిగ్‌స్టర్ డిజైన్, స్పేస్
పేరుకు తగ్గట్టుగానే కొత్త రెనాల్ట్ బిగ్‌స్టర్ సుమారు 4.6 మీటర్ల పొడవు ఉంటుంది… అంటే విశాలమైన క్యాబిన్ కలిగివుంటుందన్నమాట. ఇక ఎల్ఈడీ లైట్లు, వెడల్పాటి ఫ్రంట్ బంపర్, ఎత్తైన డిజైన్, స్క్వేర్ వీల్ ఆర్చెస్, స్ట్రాంగ్ రూఫ్ రెయిల్స్ ఈ కారుకు అదిరిపోయే లుక్ ఇస్తాయి. ఈ ఎస్యూవీ 210 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుందని అంచనా.
ఫ్యామిలీకి తగ్గట్టుగా 6 సీటర్ మోడల్లో రెండో వరుసలో కెప్టెన్ సీట్లు ఇస్తారు. ఇక 7 సీటర్ మోడల్లో రెండో వరుసలో బెంచ్ సీట్ ఉంటుంది. మూడో వరుసలో కూర్చునే వారికి ఏసీ వెంట్స్, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉంటాయట. ఇలా కారులోని ప్రతిఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణం ఖాయమని రెనాల్ట్ చెబుతోంది.
రెండు రకాల ఇంజిన్ ఆప్షన్స్ తో రెనాల్ట్ బిగ్‌స్టర్ వస్తోంది
రెనాల్ట్ బిగ్‌స్టర్ కారులో ప్రధానంగా రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉండొచ్చు. మొదటిది 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు ఎలక్ట్రిక్ మోటార్లను కలిపిన స్ట్రాంగ్ హైబ్రిడ్ (Strong Hybrid) టెక్నాలజీ. 1.4 kWh బ్యాటరీతో పనిచేసే ఈ సిస్టమ్ గరిష్ఠంగా 160 HP పవర్‌ను, 172 Nm టార్క్‌ను ఇస్తుంది.
రెండో ఆప్షన్‌గా 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇస్తున్నారట. ఇది 160 HP పవర్‌ను, 270 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్‌తో పాటు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.
రెనాల్ట్ బిగ్‌స్టర్ ఫీచర్లు, సేఫ్టీ
బిగ్‌స్టర్ కారులో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, 2 జోన్ ఆటోమేటిక్ ఏసీ, వైర్లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు ఉంటాయి. ముందు సీట్లకు వెంటిలేషన్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
సేఫ్టీ పరంగా రెనాల్ట్ బిగ్‌స్టర్ లో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, లెవల్ 2 ADAS ఫీచర్లు ఆశించవచ్చు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్‌లో ఈ సూపర్ కారు ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
దీని ధర రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజార్, మహీంద్రా XUV7XO లాంటి 3-వరుసల ఎస్‌యూవీలకు ఇది గట్టి పోటీ ఇస్తుందని ఆటోమొబైల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. డీజిల్ ఇంజిన్ కాకుండా హైబ్రిడ్, టర్బో పెట్రోల్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

