MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars Under 3 Lakhs: తక్కువ బడ్జెట్ లోనే సొంత కారు కల తీరిపోతుంది.. ఒకసారి వీటిపై లుక్కేయండి

Cars Under 3 Lakhs: తక్కువ బడ్జెట్ లోనే సొంత కారు కల తీరిపోతుంది.. ఒకసారి వీటిపై లుక్కేయండి

Cars Under 3 Lakhs: కారు కొనాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ కొత్త కారు కొనాలంటే బోలెడు ఖర్చు. అందుకే జస్ట్ రూ.3 లక్షలకే సెకండ్ హ్యాండ్ లో కారు దొరికేస్తుంది. మీకోసం మారుతి ఆల్టో 800 - రెనాల్ట్ క్విడ్ వరకు ఆప్షన్లు ఉన్నాయి. కొనేముందు ఇవి చెక్ చేయండి.

4 Min read
Author : Nandini Arava
Published : Oct 21 2026, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
రూ.3 లక్షల్లో కారు కొనొచ్చా? ఇవిగో టాప్ 5 ఆప్షన్స్!
Image Credit : Asianet News

రూ.3 లక్షల్లో కారు కొనొచ్చా? ఇవిగో టాప్ 5 ఆప్షన్స్!

సొంత కారు కొనాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ కొత్త కారు కొనాలంటే ధర, ఇన్సూరెన్స్, ఈఎంఐలు తడిసి మోపెడవుతాయి. ఇలాంటి టైమ్‌లో సెకండ్ హ్యాండ్ కార్లు బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా రూ.3 లక్షల లోపు దొరికే చిన్న కార్లను సిటీలో తిరగడానికి, ఆఫీస్‌కు వెళ్లడానికి, ఫ్యామిలీతో దగ్గర్లోని ట్రిప్స్ వేయడానికి వాడుకోవచ్చు.

ఈ బడ్జెట్‌లో మారుతి సుజుకి ఆల్టో 800, వ్యాగన్ ఆర్, హ్యుందాయ్ i10, రెనాల్ట్ క్విడ్, హ్యుందాయ్ ఇయాన్ లాంటి మోడల్స్ చూడొచ్చు. అయితే కారు తయారీ సంవత్సరం, తిరిగిన కిలోమీటర్లు, కండిషన్, ఓనర్ల సంఖ్యను బట్టి ధర మారుతుంది. మీరు కొనేటప్పుడు ఆ ధరకు కారు దొరుకుతుందో లేదో చెక్ చేసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మారుతి ఆల్టో 800 — తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఛాయిస్!
Image Credit : Pexels

మారుతి ఆల్టో 800 — తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఛాయిస్!

ధర అంచనా: రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు

బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి ఆల్టో 800 ఫస్ట్ ఆప్షన్. దీని సైజ్ చిన్నగా ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో నడపడానికి, చిన్న ప్లేస్‌లో పార్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆల్టో 800 పెట్రోల్ మోడల్ రోజువారీ ప్రయాణాలకు బాగా సెట్ అవుతుంది. మారుతి సుజుకి సర్వీస్ సెంటర్లు ఎక్కడైనా దొరకడం, స్పేర్ పార్ట్స్ ఈజీగా దొరకడం దీనికి ఉన్న మరో ప్లస్ పాయింట్.

ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లు, చిన్న ఫ్యామిలీలు, సిటీలో ఎక్కువగా తిరిగేవాళ్లు ఈ కారును తీసుకోవచ్చు. అయితే తక్కువ ధరకు వస్తుందని గుడ్డిగా కొనేయొద్దు. ఇంజిన్, క్లచ్, ఏసీ, టైర్లు, ఇన్సూరెన్స్, సర్వీస్ హిస్టరీ పక్కాగా చెక్ చేసుకోవాలి. పాత కారు కాబట్టి దాని కండిషన్ చాలా ముఖ్యం.

37
మారుతి వ్యాగన్ ఆర్ — ఫ్యామిలీకి పర్ఫెక్ట్ కారు!
Image Credit : Pexels

మారుతి వ్యాగన్ ఆర్ — ఫ్యామిలీకి పర్ఫెక్ట్ కారు!

ధర అంచనా: రూ.2.3 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు

చిన్న కారైనా లోపల స్పేస్ ఎక్కువగా ఉండాలనుకునే వారికి మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మంచి ఆప్షన్. దీని డిజైన్ కాస్త ఎత్తుగా ఉండటం వల్ల కారు ఎక్కడం, దిగడం చాలా ఈజీ. డ్రైవర్‌తో పాటు ప్యాసింజర్లకు కంఫర్ట్‌గా ఉండే సీటింగ్, రోజువారీ అవసరాలకు సరిపోయే క్యాబిన్ స్పేస్ దీని స్పెషాలిటీ.

ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి, ఆఫీస్‌కు వెళ్లడానికి, సిటీలో ఎక్కువగా తిరగడానికి ఈ మోడల్ బాగా సెట్ అవుతుంది. రూ.3 లక్షల లోపు దొరికే కార్ల కండిషన్, తయారీ సంవత్సరాన్ని బట్టి ధర మారుతుంది. కాబట్టి ఈ బడ్జెట్‌లో పాత మోడల్స్ చూస్తున్నప్పుడు.. కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, సర్వీస్ హిస్టరీ ఎలా ఉంది, ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యాయా అనేది తప్పకుండా చెక్ చేయాలి.

47
హ్యుందాయ్ i10 — కంఫర్టబుల్ జర్నీకి కేరాఫ్ అడ్రస్!
Image Credit : Unsplash

హ్యుందాయ్ i10 — కంఫర్టబుల్ జర్నీకి కేరాఫ్ అడ్రస్!

ధర అంచనా: రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు

హ్యుందాయ్ i10 సిటీ ప్రయాణాలకు, చిన్న ఫ్యామిలీల రోజువారీ అవసరాలకు బాగా సరిపోయే హ్యాచ్‌బ్యాక్ కారు. దీని క్యాబిన్ కంఫర్ట్, డ్రైవింగ్ ఈజీగా ఉండటం, ప్రాక్టికల్ డిజైన్ చాలామందిని ఆకట్టుకుంటాయి.

ఈ బడ్జెట్‌లో పాత తయారీ సంవత్సరాలకు చెందిన i10 మోడల్స్ చూడొచ్చు. కొన్ని పాత మోడల్స్‌లో ఆటోమేటిక్ గేర్ ఆప్షన్ కూడా దొరకొచ్చు. అయితే ఆటోమేటిక్ గేర్ ఉందని చెప్పి గుడ్డిగా తీసుకోకండి. దాని గేర్‌బాక్స్ కండిషన్‌ను మెకానిక్‌తో చెక్ చేయించడం చాలా ముఖ్యం.

కొనేముందు ఏసీ, సస్పెన్షన్, క్లచ్ లేదా గేర్‌బాక్స్, ఇంజిన్ కండిషన్ చెక్ చేయాలి. పాత కార్లలో వచ్చే రిపేర్లకు ఎంత ఖర్చవుతుందో కూడా ముందే అంచనా వేసుకోవాలి.

57
రెనాల్ట్ క్విడ్ — తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ కారు!
Image Credit : renault

రెనాల్ట్ క్విడ్ — తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్ కారు!

ధర అంచనా: రూ.2.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు

చిన్న కారు కావాలి, అదే టైమ్‌లో లుక్ కూడా స్టైలిష్‌గా ఉండాలి అనుకునే వారికి రెనాల్ట్ క్విడ్ బెస్ట్ ఆప్షన్. ఎస్‌యూవీ లాంటి లుక్, ఎత్తైన డిజైన్, సిటీ ప్రయాణాలకు సరిపోయే సైజ్ దీని మెయిన్ హైలైట్స్. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ముఖ్యంగా పాత మోడల్స్‌కు చెందిన కొన్ని క్విడ్ కార్లు రూ.3 లక్షల లోపు దొరుకుతాయి.

అయితే కేవలం ధర చూసి మాత్రమే నిర్ణయం తీసుకోవద్దు. కారు సర్వీస్ హిస్టరీ, ఇంజిన్ కండిషన్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, స్పేర్ పార్ట్స్ దొరికే ఛాన్స్ గురించి ఆరా తీయాలి. మీకు దగ్గర్లో ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ఉందో లేదో తెలుసుకోవడం మంచిది. ఓనర్ దగ్గర డాక్యుమెంట్లు తీసుకుని, మెకానిక్‌తో చెక్ చేయించాకే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.

67
హ్యుందాయ్ ఇయాన్ — సిటీ రైడ్స్‌కు పర్ఫెక్ట్ చిన్న కారు!
Image Credit : Pexels

హ్యుందాయ్ ఇయాన్ — సిటీ రైడ్స్‌కు పర్ఫెక్ట్ చిన్న కారు!

ధర అంచనా: రూ.1.8 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు

రూ.3 లక్షల లోపు దొరికే మరో చిన్న కారు హ్యుందాయ్ ఇయాన్. సిటీలో తిరగడానికి, చిన్న ప్లేస్‌లో పార్క్ చేయడానికి బాగా సెట్ అయ్యే ఈ కారు.. బడ్జెట్‌లో ఫస్ట్ కారు కొనాలనుకునే వారికి మంచి ఆప్షన్. ఇయాన్ మోడల్స్ చాలా ఏళ్ల క్రితమే మార్కెట్లోకి వచ్చాయి కాబట్టి, ఇప్పుడు దొరికే కార్లు కాస్త పాతవి అయి ఉండొచ్చు. అందుకే ధర కంటే కారు ప్రస్తుత కండిషన్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి.

ఇంజిన్, క్లచ్, ఏసీ, సస్పెన్షన్, టైర్లు చెక్ చేయడంతో పాటు.. కారు ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేదా వరదల్లో మునిగిందా అనేది కూడా ఎంక్వైరీ చేయాలి. అలాగే కారు ఆర్సీ, ఇన్సూరెన్స్, ఓనర్‌షిప్ డాక్యుమెంట్లు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తక్కువ ధరకు కొన్న కారు.. తర్వాత రిపేర్ల పేరుతో జేబుకు చిల్లు పెట్టకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

77
సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!
Image Credit : Unsplash

సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

రూ.3 లక్షలకే కారు వస్తుందని కంగారుపడి కొనేయొద్దు. పాత కారును సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని కండిషన్, డాక్యుమెంట్లు, ఫ్యూచర్ మెయింటెనెన్స్ ఖర్చులను తప్పకుండా చూసుకోవాలి.

1. సర్వీస్ హిస్టరీ: కారును సరిగ్గా మెయింటైన్ చేశారా లేదా, సర్వీస్ రికార్డులు ఉన్నాయా అనేది చెక్ చేయాలి.

2. యాక్సిడెంట్, వరద ముప్పు: కారు బయట లుక్ చూసి మోసపోవద్దు. కారు బాడీ, అండర్‌బాడీ, ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌ను మెకానిక్‌తో చెక్ చేయించాలి.

3. డాక్యుమెంట్లు: ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, లోన్ బ్యాలెన్స్, ఓనర్ డీటెయిల్స్ పక్కాగా చెక్ చేసుకోవాలి.

4. టెస్ట్ డ్రైవ్: కారును నడిపి చూసి ఇంజిన్, బ్రేక్స్, క్లచ్, గేర్‌బాక్స్, ఏసీ, టైర్ల కండిషన్ అంచనా వేయాలి. వీలైతే మీకు తెలిసిన మెకానిక్‌ను వెంట తీసుకెళ్లండి.

5. అదనపు ఖర్చులు: కారు ధరతో పాటు ఓనర్‌షిప్ మార్పు, ఇన్సూరెన్స్, రిపేర్లు, వెంటనే మార్చాల్సిన స్పేర్ పార్ట్స్ ఖర్చులను కూడా లెక్కేసుకోవాలి.

ముఖ్యంగా కారును నేరుగా చూడకుండా అడ్వాన్స్ ఇవ్వొద్దు. మీ బడ్జెట్ మొత్తాన్ని కారు కొనడానికే పెట్టకుండా, అనుకోని రిపేర్ల కోసం కొంత అమౌంట్ పక్కన పెట్టుకోండి. రూ.3 లక్షల లోపు మంచి సెకండ్ హ్యాండ్ కారును పట్టుకోవచ్చు. కానీ ఏ మోడల్ తీసుకుంటున్నామన్న దానికంటే.. ఆ కారు ఏ కండిషన్‌లో ఉందన్నదే చాలా ముఖ్యం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best SUVs Under 8 Lakhs: బెస్ట్ మైలేజ్, సేఫ్టీలో టాప్.. రూ. 8 లక్షల లోపు బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే
Recommended image2
Festival Scooter Offers : 60 కి.మీ మైలేజ్.. రూ.లక్షలోపే ధర.. ఫ్యామిలీకి సరిపోయే బెస్ట్ 6 స్కూటర్లు
Recommended image3
Diwali Bike Offers: లక్ష రూపాయలలోపు 80 కి.మీ మైలేజ్ ఇచ్చే సూపర్ బైక్స్ ఇవే!
Related Stories
Recommended image1
Gold Silver Rate: మళ్లీ రాజుకుంటున్న యుద్ధ మంటలు..ఈసారి కుప్పకూలిన వెండి, స్థిరంగా ఉన్న పసిడి
Recommended image2
Festival Scooter Offers : 60 కి.మీ మైలేజ్.. రూ.లక్షలోపే ధర.. ఫ్యామిలీకి సరిపోయే బెస్ట్ 6 స్కూటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved