- Home
- Automobile
- Car Offers : ఈ కారుపై ఏకంగా రూ.2.05 లక్షల వరకు తగ్గింపా..! లిమిటెడ్ ఆఫర్, వెంటనే కొనేయండి
Car Offers : ఈ కారుపై ఏకంగా రూ.2.05 లక్షల వరకు తగ్గింపా..! లిమిటెడ్ ఆఫర్, వెంటనే కొనేయండి
కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే అక్టోబర్ నెలలో మీకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. పండుగ సీజన్ సందర్భంగా రెనాల్ట్ కంపెనీ తన డస్టర్, కైగర్, ట్రైబర్, క్విడ్ కార్లపై స్పెషల్ డిస్కౌంట్లను ప్రకటించింది.

రెనాల్ట్ డస్టర్ ధర భారీగా తగ్గింపు
సొంత కారు కొనాలనేది చాలా మంది కల.. పండగ సీజన్లో కొత్తకారు కొంటుంటారు. కార్ల కంపెనీలు కూడా విజయదశమి, దీపావళి పండుగల సందర్భంగా స్పెషల్ ఆపర్లు ఇస్తుంటాయి…. ఇలా ఈ దసరాకి రెనాల్ట్ కంపెనీ బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్, స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్స్ ఉన్నాయి.
ముఖ్యంగా కొత్త రెనాల్ట్ డస్టర్ కారు కొనేవారు గరిష్ఠంగా రూ.2.05 లక్షల వరకు ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఇదంతా డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్ కాదు. మీరు ఎంచుకునే వేరియంట్, పాత కారు ఎక్స్ఛేంజ్, మీ లోన్ ఎలిజిబిలిటీని బట్టి ఫైనల్ ఆఫర్ మారుతుంది. అయితే కారు కొనేముందు షోరూమ్ ధరతో పాటు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, లోన్ వడ్డీ లాంటి ఖర్చులన్నీ లెక్కేసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.
అక్టోబర్ 2026 రెనాల్ట్ కారు ఆఫర్లు
రెనాల్ట్ డస్టర్ కారు విషయానికొస్తే.. టెక్నో ప్లస్, ఐకానిక్ వేరియంట్లపై రూ.50,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. పాత డస్టర్ కారును ఎక్స్ఛేంజ్ చేస్తే అదనపు లాభాలు కూడా ఉంటాయి. అంతేకాదు స్పెషల్ ఫైనాన్స్ స్కీమ్ కింద కేవలం 4.99 శాతం వడ్డీ రేటుకే లోన్ ఇస్తున్నారు.
అయితే ఈ ఆఫర్లన్నీ అందరు కస్టమర్‌కు వర్తిస్తాయా లేదా అనేది కంపెనీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. అందుకే డస్టర్ కొనాలనుకునే వారు కేవలం కారు ధరనే కాకుండా.. మీ పాత కారుకు వస్తున్న రేటు, లోన్ టెన్యూర్, ఈఎంఐ, మొత్తం వడ్డీ ఖర్చులను కూడా బేరీజు వేసుకోవాలి.
రెనాల్ట్ కైగర్‌పై ఎంత డిస్కౌంట్ ఉందంటే?
కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇష్టపడే వారి కోసం రెనాల్ట్ కైగర్‌పై రూ.84,000 వరకు ఆఫర్లు ఇస్తున్నారు. ఎవల్యూషన్ ప్లస్, టెక్నో, ఎమోషన్ వేరియంట్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ పొందొచ్చు.
ఇక ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేందుకు అనువైన 7-సీటర్ రెనాల్ట్ ట్రైబర్‌పై రూ.81,000 వరకు లాభాలు ఉన్నాయి. సిటీ డ్రైవింగ్‌కు పర్ఫెక్ట్ అయిన చిన్న కారు రెనాల్ట్ క్విడ్‌పై రూ.55,000 వరకు ఆఫర్లు ప్రకటించారు. ఇవన్నీ గరిష్ఠ ఆఫర్లు మాత్రమే. పాత స్టాక్, కొత్త స్టాక్ కార్లను బట్టి ఈ డిస్కౌంట్లు మారే అవకాశం ఉంది.
రెనాల్ట్ ట్రైబర్ పండుగ ఆఫర్
ఈ పండుగ ఆఫర్లు అక్టోబర్ 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే షోరూమ్‌లో ఉన్న స్టాక్, మీరు ఉండే నగరం, ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి ఈ ఆఫర్లు మారొచ్చు. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ పాలసీ లాభాలు, ఫైనాన్స్ ఆఫర్లు.. ఇవన్నీ కలిపి ఒకేసారి పొందొచ్చా లేదా అనేది ముందే క్లారిటీ తీసుకోండి. అడ్వాన్స్ కట్టే ముందే రెనాల్ట్ షోరూమ్ డీలర్ దగ్గర కొటేషన్ రాయించుకోవడం మంచిది. కారు ధర, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, యాక్సెసరీస్, లోన్ ఛార్జీలు అన్నీ లెక్కేసుకుంటే అనవసరపు ఖర్చులను తగ్గించుకోవచ్చు.

