MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Electric Auto: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 90 కి.మీ వెళ్తుంది.. మిడిల్ క్లాస్ వాళ్లకి బెస్ట్ ఛాయిస్

Electric Auto: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 90 కి.మీ వెళ్తుంది.. మిడిల్ క్లాస్ వాళ్లకి బెస్ట్ ఛాయిస్

Electric Auto: యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇటు రోజూవారీ ఖర్చులు పెరిగిపోతున్నాయని ఇబ్బంది పడే ఆటో డ్రైవర్లకు పియాజియో ఒక కొత్త ఆప్షన్ తెచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు వెళ్తుంది. బడ్జెట్‍లో దొరికిపోతుంది.

1 Min read
Author : Nandini Arava
Published : Jul 06 2026, 08:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ ఆటో
Image Credit : gemini ai

మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ ఆటో

యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇటు రోజూవారీ ఖర్చులు పెరిగిపోతున్నాయని ఇబ్బంది పడే ఆటో డ్రైవర్లకు పియాజియో ఒక కొత్త ఆప్షన్ తెచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు వెళ్తుంది. బడ్జెట్‍లో దొరికిపోతుంది. 

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, పియాజియో కంపెనీ 'ఏప్ వేవ్' అనే కొత్త ఎలక్ట్రిక్ ఆటోను లాంచ్ చేసింది. దీని స్టార్టింగ్ ప్రైస్ రూ. 2.55 లక్షలు (ఎక్స్-ఫ్యాక్టరీ). సిటీలో తిరిగే ఆటోడ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారుచేశారు. ఇందులో 5.4 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. దీని గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి సుమారు 4.5 గంటలు పడుతుంది. ఇది చాలా కాలం మన్నికగా ఉంటుందని, 19 శాతం గ్రేడబిలిటీతో ఎత్తుపల్లాల రోడ్లపై కూడా సులువుగా వెళ్తుందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. రూ.3.9 లక్షలకే మంచి మైలేజ్ ఇచ్చే సూపర్ కారు…మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఛాయిస్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
ఆటో డ్రైవర్లకు బెస్ట్ ఛాయిస్
Image Credit : Piaggio

ఆటో డ్రైవర్లకు బెస్ట్ ఛాయిస్

ప్రయాణికుల సౌకర్యం కోసం ఇందులో ప్రత్యేకమైన సస్పెన్షన్ సిస్టమ్ ఇచ్చారు. దీనివల్ల ప్రయాణంలో కుదుపులు, శబ్దం తగ్గుతాయి. 180 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో ఎలాంటి రోడ్లపైనైనా ఇబ్బంది లేకుండా నడపవచ్చు. విశాలమైన క్యాబిన్ రోజువారీ ప్రయాణాలకు మరింత సౌకర్యాన్ని ఇస్తుంది. పట్టణాల్లో షేర్ ఆటో సర్వీసులకు, ఫిక్స్‌డ్ రూట్లలో తిప్పడానికి, దగ్గరి ప్రయాణాలకు ఈ వాహనం చాలా అనువుగా ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్, తక్కువ నిర్వహణ ఖర్చు వల్ల ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని కంపెనీ చెబుతోంది. భారత్‌లో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో సౌకర్యం, భద్రత, నమ్మకాన్ని అందించేలా ఈ కొత్త వాహనాన్ని రూపొందించామని కంపెనీ ఛైర్మన్, ఎండీ డియాగో గ్రాఫీ తెలిపారు. రూ.90వేలకు భారీ డిస్కౌంట్లు, మారుతి సుజుకి మెగా ఆఫర్ల లిస్ట్ ఇదే. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bikes Offer : రూ.2,80,000 సూపర్ బైక్ కేవలం రూ.4,999 కే మీసొంతం.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్
Recommended image2
Top Selling Cars: మారుతి, టాటా, నిస్సాన్ కార్ల సేల్స్ దెబ్బకి రికార్డులు బద్దలు.. నెంబర్ 1 ఎవరంటే?
Recommended image3
New Car Vs Used Car : కొత్త కారా లేక సెకండ్ హ్యాండ్ కారా? 2026లో ఏది కొంటే బెస్ట్!
Related Stories
Recommended image1
Sleek Speakers: హోమ్ థియేటర్ కొనాల్సిన పనిలేదు...ఇది ఉంటే చాలు.. చిన్నదే అయినా సౌండ్ అదిరిపోద్ది
Recommended image2
Safe Cars Under 5 Lakh: మైలేజ్, సేఫ్టీ, CNG ఆప్షన్ తో రూ.5 లక్షల్లో ఇంత మంచి కారు దొరుకుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved