MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Automobile
  • Cheapest Car : బైక్ ధరలోనే కారు.. కేవలం రూ.3.49 లక్షలకే నీ సొంతం గురూ..!

Cheapest Car : బైక్ ధరలోనే కారు.. కేవలం రూ.3.49 లక్షలకే నీ సొంతం గురూ..!

కేవలం రూ.3.49 లక్షల ప్రారంభ ధరతో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మార్కెట్లో సందడి చేస్తోంది. CNG, AMT ఆప్షన్లు, అదిరిపోయే మైలేజ్‌తో బడ్జెట్ కార్ల ప్రియులను ఆకట్టుకుంటోంది. మరి 2026 మోడల్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 06 2026, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మారుతి ఎస్ ప్రెస్సో ధర ఎంతో తెలుసా?
Image Credit : stockPhoto

మారుతి ఎస్-ప్రెస్సో ధర ఎంతో తెలుసా?

Budget Car : బైక్ ధరలోనే కారు... వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. సాధారణంగా రాయల్ ఎన్ ఫీల్డ్, కేటిఎం, కవాసకి వంటి లగ్జరీ బైక్స్ ధర రూ.2 లక్షల నుండి రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఇదే ధరకి మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ( S-Presso) కారు వచ్చేస్తోంది.

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్, SUV లాంటి లుక్, తక్కువ మెయింటెనెన్స్ కోరుకునే వారికి మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. భారత మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.3.49 లక్షల నుంచి మొదలవుతుంది. మొదటిసారి కారు కొనేవారికి, సిటీ ప్రయాణాలకు ఈ చిన్న SUV చాలా అనువుగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎస్-ప్రెస్సో మైలేజ్ ఎంతో తెలుసా?
Image Credit : maruti suzuki

ఎస్-ప్రెస్సో మైలేజ్ ఎంతో తెలుసా?

ఈ కారుకు 1.0-లీటర్ కె-సిరీస్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్, CNG ఆప్షన్ ప్రధాన బలం. 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో ఇది లభిస్తుంది. పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ లీటర్‌కు సుమారు 25.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అదే CNG మోడల్ అయితే ఒక కిలో గ్యాస్‌కు 32 కిలోమీటర్లకు పైగా మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

34
ఎస్-ప్రెస్సో ఫీచర్లివే
Image Credit : maruti

ఎస్-ప్రెస్సో ఫీచర్లివే

2026 మోడల్‌లో కూడా ఎత్తైన SUV డిజైన్, 180mm గ్రౌండ్ క్లియరెన్స్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్ వంటివి ఉన్నాయి. ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే, కొన్ని వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి అందిస్తున్నారు.

44
ఎస్-ప్రెస్సో మైనస్ లు, ప్లస్ లు
Image Credit : Getty

ఎస్-ప్రెస్సో మైనస్ లు, ప్లస్ లు

అయితే భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ కారును కొనే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. గ్లోబల్ NCAP సేఫ్టీ టెస్టులో ఈ కారుకు తక్కువ రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని భద్రతా ఫీచర్లను మెరుగుపరిచినప్పటికీ, ఎక్కువ సేఫ్టీ కోరుకునే వారు ఇతర మోడళ్లను కూడా పరిశీలించడం మంచిది.

సిటీ ప్రయాణాలకు అనువైన డ్రైవింగ్, తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్, దేశవ్యాప్తంగా విస్తరించిన మారుతి సుజుకి సర్వీస్ సెంటర్లు ఈ కారుకు ప్రధాన బలాలు. తక్కువ ఖర్చుతో నమ్మకమైన కారు కొనాలనుకునే వారికి, ముఖ్యంగా మొదటిసారి కారు కొనేవారికి, CNGతో నెలవారీ ఖర్చు తగ్గించుకోవాలనుకునే వారికి మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 2026 మంచి ఆప్షన్.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nissan Car: రూ. 5 లక్షలకే అదరగొట్టే 7 సీటర్ కారు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల మైలేజ్ గ్రావిట్‌ సొంతం
Recommended image2
Top 7 Seater Cars : పెద్ద ఫ్యామిలీకి సరిపోయేలా.. చీప్ ఆండ్ బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే
Recommended image3
FASTag : కారు అమ్మేయగానే ముందు ఫాస్టాగ్ క్లోజ్ చేయండి.. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Maruti Suzuki S-Presso : మీ శాలరీ రూ.25,000 అయినా సరే.. ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Recommended image2
Maruti Suzuki S Presso: నెల‌కు రూ. 6,500 క‌డితే చాలు.. రూ. 3.5 ల‌క్ష‌ల‌కే కొత్త కారు మీ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved